shorte links

Wednesday, March 16, 2016

సూర్యకి నో.. శివ ఓకే.. దటీజ్ పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ పూర్తి కాగానే.. ఎస్ జే సూర్య డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడు. దీనికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. అయితే.. ఈ సినిమా స్టోరీకి సంబంధించిన ఓ అప్ డేట్ ఇప్పుడు బయటకొచ్చింది. ఖుషీ2 అని అనుకుంటున్న ఈ మూవీకి దర్శకుడు ఎస్ జే సూర్య స్టోరీని పవన్ పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. 

సూర్య చెప్పిన స్టోరీ లైన్ బాగున్నా.. దాన్ని పూర్తి స్క్రిప్ట్ గా మార్చడంలో ఈ దర్శకుడు ఫెయిల్ అయ్యాడట. అయితే ఇదే సమయంలో ఆకుల శివ చెప్పిన స్టోరీ సూపర్బ్ గా నచ్చడంతో.. ఆ కథను ఓకే చేసిన పవన్.. దర్శకత్వ బాధ్యతలను మాత్రం ఎస్ జే సూర్యకే అప్పగించాడని టాక్ వినిపిస్తోంది. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కు అనేక స్టోరీలు అందించాడు ఆకుల శివ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టైల్ - మేనరిజమ్స్ తగినట్లుగా.. ఓ మంచి రోల్ చుట్టూ రాసిన స్టోరీ.. పవర్ స్టార్ కి బాగా నచ్చిందని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. 

పవన్-ఎస్జే సూర్య కాంబినేషన్ లో రానున్న సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిచనున్నాడు. గోపాలాగోపాలా టైంలో.. తన సినిమా ఆఫర్ ఇస్తానని చేసిన ప్రామిస్ ని ఇలా నెరవేర్చుకుంటున్నాడు పవర్ స్టార్. మరోవైపు ఖుషీ2ని పవన్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ నిర్మిస్తుండడం విశేషం.

సుధీర్ బాబుకు కళ్లల్లో నీళ్లొచ్చేశాయ్

నెలలు సంవత్సరాల తరబడి పడ్డ కష్టానికి ఫలితం ఎలా ఉంటుందో చూసుకోబోయే ముందు ఉద్వేగం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే సుధీర్ బాబుకు ఈ ఉద్వేగంలో కన్నీళ్లు కూడా వచ్చేశాయట. తెలుగులో హీరోగా నిలదొక్కుకోవడానికి ఎంతో శ్రమించి ఆ ప్రయత్నంలో కొంతవరకు విజయవంతమైన సుధీర్.. బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘భాగి’ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. దీని థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజే విడుదలైంది. ఇందులో సుధీర్ బాబు లుక్ కానీ.. అతడి అప్పీయరెన్స్ కానీ మౌండ్ బ్లోయింగ్ అనే చె్ప్పాలి. దీంతో టాలీవుడ్ సెలబ్రెటీలు ఇక్కడి జనాలు సుధీర్ పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశారు.

అసలు ట్రైలర్ అప్ లోడ్ చేస్తున్నపుడే ఉద్వేగంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయని చెప్పిన సుధీర్.. జనాల స్పందన చూసి ఇంకా ఎమోషనల్ అయ్యాడు. ‘‘ఎక్కడో బాలీవుడ్ లో ఓ ఛాలెంజింగ్ రోల్ కోసం వెతుక్కుంటూ ఓ తెలుగువాడిని తీసుకుపోయారు. మనం ఎవరికీ తక్కువ కాదు’’ అంటూ ఇంకో ట్వీట్ చేశాడు సుధీర్. ఈ సినిమా కోసం సుధీర్ ఎంతో కష్టపడి.. చిజిల్డ్ బాడీ పెంచాడు. బాలీవుడ్ కండల వీరులకు ఏమాత్రం తీసిపోని రీతిలో తన బాడీని తీర్చిదిద్దుకున్నాడు. కేవలం బాడీ పెంచడమే కాకుండా.. యాక్షన్ సన్నివేశాల కోసం కొన్ని నెలల పాటు ప్తర్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు సుధీర్. అతడి కష్టం ట్రైలర్లో కనిపిస్తోంది. తెలుగు హిట్ మూవీ ‘వర్షం’కు రీమేక్ గా చెబుతున్న ఈ సినిమా సుధీర్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

బన్నీకి మూడో స్థానం కట్టబెట్టేయొచ్చా?

నాలుగేళ్లు వెనక్కి వెళ్తే.. అల్లు అర్జున్ ను టాప్ హీరోల లీగ్ లో చేర్చడానికి కొంచెం సందేహించే వాళ్లు. కానీ ‘జులాయి’ దగ్గర్నుంచి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు బన్నీ బాబు. అందులోనూ గత రెండేళ్లలో బన్నీ జోరు మామూలుగా లేదు. చూస్తుండగానే ఇంతింతై అని ఎదిగిపోయి.. టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా ఎదిగిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా మూడు యాభై కోట్ల షేర్ సినిమాల్ని అందించిన ఏకైక హీరో బన్నీనే కావడం విశేషం. ‘రేసుగుర్రం’ రూ.60 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తే.. ఏవరేజ్ అనిపించుకున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ కూడా 50 కోట్లకు పైనే వసూలు చేసింది. బన్నీ అతిథి పాత్ర పోషించిన ‘రుద్రమదేవి’ కూడా ఈ క్లబ్బులో అడుగుపెట్టింది.

ఇక ‘సరైనోడు’ బిజినెస్ లెక్కలు చూస్తుంటే టాలీవుడ్ జనాలకు దిమ్మదిరుగుతోంది. టాలీవుడ్ లో తిరుగులేని మార్కెట్ ఉన్నది పవన్ కళ్యాణ్ - మహేష్ బాబులకే. వాళ్లిద్దరినీ అసలు సిసలు సూపర్ స్టార్లుగా భావిస్తారు అందరూ. జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ - రామ్ చరణ్ లకూ మంచి మార్కెట్ - ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ.. పవన్ - మహేష్ ల రేంజే వేరుగా ఉంటుంది. వాళ్లను మిగతా వాళ్లు టచ్ చేయడం చాలా కష్టం. ఐతే ఒకప్పుడు పైన చెప్పుకున్న ముగ్గురి కంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్న బన్నీ.. ఇప్పుడు పవన్ - మహేష్ లను టచ్ చేసేస్తున్నాడు.

‘సరైనోడు’ బిజినెస్.. సర్దార్ గబ్బర్ సింగ్ - బ్రహోత్సవం సినిమాలకు దగ్గరగా ఉండటం.. కొన్ని ఏరియాల్లో వాటిని దాటేస్తుండటం చూస్తుంటే బన్నీ సత్తా ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ లో నెంబర్ వన్ ఎవరన్నది తేల్చడం కష్టం. పవన్ - మహేష్.. ఇద్దరూ ఇద్దరే. ఎవరికి ఎవరూ తీసిపోరు. ఎవర్ని ఎవరూ మించరు. కాబట్టి 1 2 స్థానాల్ని వాళ్లిద్దరికీ ఇచ్చేయొచ్చు. ఐతే మూడో స్థానం విషయంలో మాత్రం ఇప్పుడు క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారమైతే ఆ స్థానాన్ని బన్నీకి కట్టబెట్టేయొచ్చు. ఈ స్థానానికి ప్రభాస్ - ఎన్టీఆర్ కూడా పోటీలో ఉంటారు. ఐతే ప్రభాస్ అసలు స్టామినా ఏంటన్నది ‘బాహుబలి’ తర్వాత వచ్చే సినిమాను బట్టి చెప్పొచ్చు. ఎన్టీఆర్ సంగతి ‘జనతా గ్యారేజ్’ విడుదలైనపుడు చూద్దాం. 

కాజల్.. ఏంటీ టార్చర్?

ఇది టార్చర్ కాక ఇంకేంటి చెప్పండి. అసలే అందగత్తె.. పైగా మరింత అందంగా తయారై కుర్రాళ్లను కవ్విస్తే ఎలా? ఈ చందమామను ఇలా చూసి ప్రశాంతంగా నిద్ర పోవడం కుర్రాళ్లకు సాధ్యమా..? వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతుందటారు. కానీ ఈ అమ్మాయి అందం మరింత పెరుగుతోందే.. దశాబ్దం ముందు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రోజుల్లో కంటే.. ఇప్పుడే మరింత అందంగా కనిపిస్తోందే. ఈ మధ్య బరువు తగ్గి మరింత నాజూగ్గా తయారై.. మరింతగా కుర్రాళ్లను కవ్విస్తోందే.. ఇది టార్చర్ కాక మరేంటి చెప్పండి.

మొన్నా మధ్య ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమంలో కాజల్ చేసింది మామూలు రచ్చా! పద్ధతిగా కనిపించే అమ్మాయి ఒక్కసారిగా క్లీవేజ్ షోలతో రెచ్చిపోతే.. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా కాలమే పట్టింది కుర్రాళ్లకు. ఆ అందాల సుడిగుండం నుంచి చాలామంది ఇంకా కూడా బయటపడలేదు. ఇప్పుడు నిండైన దుస్తులతోనూ అదే స్థాయిలో రెచ్చగొడుతూ తాను ఏ రకంగానైనా టార్చర్ పెట్టగలనని చాటుకుంటోంది. ఈ అందాలకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను ఎంత వరకు పడగొట్టిందో కానీ.. కుర్రాళ్లకు మాత్రం నిద్రలేని రాత్రుల్నే మిగులుస్తోంది చందమామ.

ఫొటోస్: సున్నీ లియోన్ మార్నింగ్ వర్క్ ఔట్స్

'నో రిఫండ్' అని చెప్పేసిన సర్దార్

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల విషయంలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఒకవేళ సినిమా రిలీజయ్యాక రిజల్టు తేడా వచ్చేసింది అనుకోండి.. మా డబ్బులు మాకిచ్చేయండి అంటూ పంపిణీదారులందరూ గళమెత్తుతున్నారు. భారీగానే గోల చేస్తున్నారు. వారి వాదనలోనూ సగం నిజముంది అనే అనుకోవాలి. అయితే వ్యాపారం అన్నప్పుడు లాస్ వస్తే మాత్రం.. ఇలా డబ్బులు తిరిగి ఇచ్చేయమనడం సమంజసం కాదని ఎన్నోసార్లు నిర్మాతలు కూడా వాపోయారు.

ఈ డిస్కషన్లన్నీ ఎలా ఉన్నా కూడా.. ఈరోస్ ఇంటర్నేషనల్ వారు మాత్రం.. ''సర్దార్'' విషయంలో 'నో రిఫండ్' అనే క్లాజుతో ఎగ్రిమెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా రిలీజయ్యాక రిజల్టు ఎలా ఉన్నా కూడా.. ఒకవేళ లాస్ వస్తే మాత్రం రిఫండ్ అనేది తిరిగి అడగకూడదు అనేది వీరి కండీషన్ అట. ఆ కండీషన్ తోనే అన్ని ఏరియాల్లో సర్దార్ సినిమాను అమ్మేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సర్లేండి.. ఎలాగో పవన్ కళ్యాణ్ సినిమానే కాబట్టి.. మినిమం ఎంటర్ టెయన్ మెంట్ ఉన్నా కూడా.. సినిమా ఖచ్చితంగా ఇన్వెస్టుమెంటును తిరిగి తెచ్చేస్తుందని అందరి నమ్మకం. 

ఏప్రియల్ 8న సర్దార్ గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

జగ్గూ కూడా భయపెట్టడానికీ రెడీ

ప్రస్తుతం 'నాన్నకు ప్రేమతో' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ.. తదుపరి సినిమాల్లో ఇంకాస్త అదరగొట్టేయాలని చూస్తున్నాడు సీనియర్ నటుడు జగపతి బాబు. విలన్ వేషాలను వేయాడానికి మనస్సును ఒప్పించేసుకున్న తరువాత అస్సలు ఎక్కడా తగ్గట్లేదు ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ వీరుడు. త్వరలోనే తమిళంలో సూపర్ స్టార్ విజయ్ కు విలన్ గా నటిస్తున్నప్పటికీ.. త్వరలో మనోడు తెలుగులో చేయబోయే సినిమా అతిపెద్ద హైలైట్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో జగపతి హీరోయన్ తండ్రిగానే కాదు.. ఒక డేంజరస్ విలన్ గా కూడా చేస్తున్నాడు.

అబ్బే విలనీ కొత్తదేం కాదుగా అనుకోకండి.. ఎందుకంటే ఈ సినిమాలో జగపతి బాబు ఒక దెయ్యంగా నటిస్తున్నాడట. హీరోయన్ ఈషా మెయిన్ లీడ్ గా కొత్త దర్శకుడు సుధాకర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో.. జగపతి ఆమె తండ్రిగా ప్లస్ ఒక దెయ్యంగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో జగపతి రోల్ ఎలా ఉండోబోతోంది అనే విషయం సినిమా రిలీజ్ అయ్యేవరకు ఏ మాత్రం రివీల్ చేయకూడాదని యునిట్ సభ్యులు నిర్ణయించుకున్నారట. అందుకే ఈ న్యూస్ ను చాలా సీక్రెట్ గా ఉంచారు. 

మొత్తానికి చాలామంది హీరోయిన్ల బాటలో ఇప్పుడు జగ్గూ కూడా భయపెట్టేస్తాడనమాట. లెటజ్ సీ

మిల్కీ బ్యూటి ఫినిష్ చేసేసింది

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు తన ట్యాలెంట్ మొత్తం చూపించేస్తోంది. బాహుబలి బెంగాల్ టైగర్ ల విజయాలతో జోష్ మీద ఉండడంతో.. ఆ ఉత్సాహాన్ని తర్వాత సినిమాల్లోనూ ప్రదర్శిస్తోంది. నాగ్ - కార్తిలతో కలిసి మిల్కీ నటించిన ఊపిరి.. విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం కోసం తొలిసారిగా డబ్బింగ్ చెబుతున్న తమన్నా.. ఇప్పుడా కార్యక్రమం కూడా కంప్లీట్ చేసింది.

డబ్బింగ్ స్టూడియోలో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఈ విషయాన్ని చెప్పింది తమ్మూ. 'వావ్.. ఇప్పుడే ఊపిరి కోసం డబ్బింగ్ పూర్తి చేశా. నా స్వీట్ హార్ట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో..' అంటూ ట్వీట్ చేసింది తమన్నా. తొలిసారిగా డబ్బింగ్ కంప్లీట్ చేసిన ఉత్సాహం తమ్మూలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది కానీ.. స్టూడియోలో మాత్రం నానా రచ్చ చేసేసిందట. మామూలుగానే హై ఎనర్జీతో ఉండే తమన్నా.. తన ట్యాలెంట్ ప్రదర్శించే ఛాన్స్ వచ్చేసరికి మరింతగా రెచ్చిపోయిందంటున్నారు. అయితే.. తమన్నా చెప్పే డబ్బింగ్ పార్ట్.. చాలా త్వరగా అయిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే  విషయం.

తమన్నాకి తెలుగు బాగానే వచ్చినా.. మొదటి సారి డబ్బింగ్ చెబుతూ ఇంత స్పీడ్ గా పూర్తి చేసేయడం విశేషమే. అయితే.. ఈ మూవీల తమన్నా కేరక్టర్ చాలా చిన్నదేమో అనే అనుమానాలు వస్తున్నాయిపుడు. ఎందుకంటే.. ఊపిరికి మాతృక అయిన ఫ్రెంచ్ మూవీలో ఈ రోల్ పట్టుమని పది నిమిషాలు కూడా ఉండదు మరి.

తమన్నాను ఇలా ఎప్పుడైనా చూశారా?

తమన్నా చాలా మోడర్న్ గా కనిపించే హీరోయిన్. ఆమె కెరీర్లో ఎక్కువగా ఆ టైపు క్యారెక్టర్లలోనే చూశాం ఇప్పటిదాకా. తమన్నా లుక్ చూస్తే.. ఆమె సంప్రదాయబద్ధమైన చీర కట్టుడు పాత్రలు అంతగా నప్పవన్న ఫీలింగ్ ఉండటంతో దర్శకులు ఆమెకు ఆ టైపు పాత్రలేవీ పెద్దగా ఆఫర్ చేయలేదు. ఐతే ఇండస్ట్రీలో పదేళ్లు గడిపేశాక కూడా ఒకే తరహా పాత్రలు చేస్తే ఏం బావుంటుందని అనుకుందో ఏంటో కానీ.. ఈ మధ్య వైవిధ్యమైన పాత్రల్ని ఎంచుకుంటోంది తమ్మూ. విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న ‘ధర్మదురై’ సినిమాలో మేకప్ లేకుండా.. చీరతో సంప్రదాయ బద్ధంగా కనిపించే విలేజ్ అమ్మాయిగా నటిస్తోంది తమ్మూ.

దీంతో పాటు ప్రభుదేవా హీరోగా తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రంలోనూ తమ్మూ ఆ టైపు క్యారెక్టరే చేస్తున్నట్లుంది. ఈ మధ్యే చడీచప్పుడు లేకుండా మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తమ్మూ అందులో పెళ్లి కూతురిగా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుండటం ఓ చిత్రమైతే.. పక్కన పెళ్లి కొడుకుగా ప్రభుదేవా ఉండటం మరో విశేషం. ప్రభు - తమ్మూ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కానీ.. ఇద్దరూ జంటగా నటిస్తున్న విషయం తెలియదు. ఇద్దరూ కూడా సరికొత్త లుక్ లో దర్శనమిస్తున్నారిందులో. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ రూపొందిస్తున్న ఈ సినిమా హార్రర్ బేస్డ్ కథాంశంతో తెరకెక్కుతోంది. తెలుగు - తమిళ - హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.

సూర్య తెలుగోళ్లకు అంత ప్రయారిటీ ఇస్తాడా?

సూర్య సినిమా వస్తోందంటే తెలుగు నిర్మాతలు కూడా తమ సినిమాల్ని వాయిదా వేసుకుంటారంటూ నాగార్జున చేసిన వ్యాఖ్యల్లో అతిశయోక్తి ఏమీ లేదు. ఈ మధ్య సరైన సినిమాలు పడకపోవడం వల్ల కొంచెం జోరు తగ్గింది కానీ... మామూలుగా అయితే సూర్యకు తెలుగు హీరోలతో సమానంగా ఫాలోయింగ్ ఉందిక్కడ. ఆ సంగతి గ్రహించే తెలుగు అభిమానులకు చాలా ప్రయారిటీ ఇస్తుంటాడు సూర్య. తన సినిమాల తెలుగు డబ్బింగ్ విషయంలో జాగ్రత్త పాటిస్తాడు. తెలుగు కోసం కొన్ని సన్నివేశాలు ప్రత్యేకంగా చేస్తాడు. ప్రమోషన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టిపెడతాడు. ఈ మధ్య తన సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచడంతో కొంత వెనకబడ్డ సూర్య.. ‘24’ మూవీతో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నాడు.

తెలుగులో ఇష్క్ - మనం లాంటి సినిమాలు తీసిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడం.. పైగా సమంత హీరోయిన్ కావడంతో ‘24’పై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. వేసవికి రాబోయే భారీ తెలుగు సినిమాలతో సమానంగా దీని కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మన ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో ‘24’ ఆడియోను ముందు తెలుగులోనే రిలీజ్ చేయాలని చూస్తున్నాడట సూర్య. ఈ నెల 28న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ‘24’ ఆడియో వేడుక నిర్వహించబోతున్నారట. దర్శకుడు విక్రమ్ హీరోయిన్ సమంతలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్.. తెలుగులో ‘24’ను విడుదల చేయబోతున్న నితిన్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారట. సూర్య నిజంగా తమిళం కంటే ముందు తెలుగు ఆడియో వేడుక చేస్తే.. అతడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

సర్దార్ షాక్ అప్పుడే స్టార్ట్ అయింది

ఎవరూ ఊహించని ఊహించలేని షాక్ లు ఇవ్వడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి బాగా అలవాటు. ప్రాజెక్టుల సెలక్షన్ నుంచి టెక్నీషియన్ల వరకూ ఏదో ఒక షాక్ ఇస్తూనే ఉంటాడు. ఇక్కడి మీడియా జనాలకే ఏనాడూ ఇంటర్వ్యూ ఇవ్వని పవన్.. ఒక్కసారిగా బాలీవుడ్ మీడియాతో ముచ్చట్లు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇలా ఎందుకు జరిగిందనే సంగతి.. సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ పోస్టర్ చూశాక కానీ అర్ధం కాలేదు. 

ఇప్పుడు ఆడియో ఫంక్షన్ విషయంలో కూడా ఇలాంటి ఓ ఛేంజ్ కనిపిస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల కార్యక్రమం కోసం గచ్చిబౌలి స్టేడియం - నిజాం కాలేజ్ గ్రౌండ్స్ ను వేదికలుగా ఎంపిక చేశారు. ఈ మేరకు పోలీసుల నుంచి పర్మిషన్స్ కూడా అడుగుతూ లేఖలు పంపారు. ఇప్పుడు మాత్రం. సర్దార్ ఆడియో వేదికను నోవోటెల్ హోటల్ మార్చేశారు. ఈ నెల 20తేదీన సాయంత్రం 7గంటలకు ఈ ఫంక్షన్ జరగనుంది. ఫంక్షన్ డేట్ కి సరిగా ఓ వారం కూడా సమయం లేనపుడు.. ఇలా వెన్యూ ఛేంజ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. 

మొత్తానికి ఈ ఫంక్షన్ విషయంలోనూ తన మార్క్ చూపిస్తున్న పవన్.. ఆ రోజున వేదికపై కేవలం సర్దార్ గబ్బర్ సింగ్ కు పనిచేసిన యూనిట్ మాత్రమే ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాజల్ తొలిసారిగా ఈ సినిమాలో పవన్ కు జంటగా నటించగా... ఏప్రిల్ 8న తెలుగు - హిందీ భాషల్లో భారీ రిలీజ్ కు నిర్మాణ సంస్థ ఈరోస్ ప్లాన్ చేసింది. 

ఫొటోస్: నారా రోహిత్ సావిత్రి స్టిల్స్

బాహుబలి మళ్లీ పుట్టింటికి వచ్చేసింది




బాహుబలి-2 యూనిట్:

                                    ఒకే లొకేషన్లో ఒక సినిమా మూడేళ్లకు పైగా షూటింగ్ జరుపుకోవడం ఎక్కడైనా చూస్తామా.. బాహుబలి విషయంలో మాత్రమే అది సాధ్యమైంది. మూడేళ్ల కిందట్నుంచి ఈ సినిమా షూటింగుకి రామోజీ ఫిలిం సిటీ వేదికగా నిలుస్తోంది. 2013లో ఈ సినిమా షూటింగ్ కర్నూలులో మొదలై.. రామోజీ ఫిలిం సిటీకి షిఫ్టయింది. ఇక అప్పట్నుంచి ఎన్ని రోజులు ఇక్కడ షూటింగ్ జరిగిందో లెక్కబెట్టడం కష్టం. కొన్ని రోజులు కేరళలో కొన్ని రోజులు బల్గేరియాలో షూటింగ్ చేశారు తప్పితే.. మిగతా అంతా ఫిలిం సిటీలోనే కానిచ్చేశాడు జక్కన్న. విశాలమైన ప్రదేశం.. సకల సౌకర్యాలు.. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ.. ఎంత పెద్ద సెట్టింగ్ కావాలనుకుంటే అంత పెద్దది వేసుకునే సౌకర్యం.. ఏ డిస్టబెన్స్ ఉండదు.. జక్కన్న లాంటి వాడికి ఇంతకంటే ఏం కావాలి? అందుకే ఆయనకు రామోజీ ఫిలిం సిటీ రెండో ఇల్లుగా మారిపోయింది.
మూడు నెలల కిందట బాహుబలి-2 షూటింగ్ కూడా ఇక్కడే మొదలుపెట్టాడు రాజమౌళి. తర్వాత కేరళకు వెళ్లి కొన్ని సన్నివేశాలు షూట్ చేసుకుని వచ్చాడు. గత కొన్ని రోజులుగా గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ఓ షెడ్యూల్ అయింది. అది పూర్తి చేసుకుని తిరిగి ఫిలిం సిటీలో అడుగుపెట్టింది బాహుబలి-2 యూనిట్. ఇప్పటిదాకా తీసినవి అంత కీలక సన్నివేశాలమీ కావని.. బాహుబలి-2కు ప్రాణం అనదగ్గ సన్నివేశాలు ఇకపైనే మొదలవుతాయని చెబుతున్నారు. ఇక నిర్విరామంగా ఫిలిం సిటీలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ - రానా - అనుష్క సహా ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటుందట. యుద్ధం ఎపిసోడ్ తో పాటు సినిమాకు కీలకం అనదగ్గ సన్నివేశాలన్నీ ఇకపైనే చిత్రీకరించబోతున్నారట.

by GVR GROUPS