shorte links

Thursday, July 28, 2016

మహేష్, పవన్‌తో నష్టం: రజనీ వచ్చి చిరుకి హెల్ప్, వర్కౌట్ అయ్యేనా?

హైదరాబాద్: ఓవర్సీస్ మార్కెట్లో కొన్నేళ్లుగా తెలుగు సినిమాల మార్కెట్ బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోల సినిమాలకు నైజాం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించే టెర్రిటరీగా ఓవర్సీస్ మార్కెట్ మారింది. దీంతో ఈ మార్కెట్‌ను దక్కించుకోవడానికి చాలా మంది తెలుగు స్టార్స్ పోటీ పడుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్లో చాలా కాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న తెలుగు హీరోలు ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు పవన్ కళ్యాణ్, మరొకరు మహేష్ బాబు. చాలా కాలంగా వీరిద్దరి సినిమాలు మాత్రమే ఇక్కడ భారీ వసూళ్లు సాధిస్తూ వస్తున్నాయి. అందుకు కారణం ఈ ఇద్దరు హీరోలపై ఎన్నారై ప్రేక్షకులకు ఉన్న అభిమానమే. అయితే బాహుబలి వచ్చి వీరిద్దరినీ వెనక్కి నెట్టేసింది. బాహుబలి ఒక ప్రత్యేకమైన సినిమా కాబట్టి ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను... రెగ్యులర్ తెలుగు సినిమాలతో పోల్చడం తగదు. ఓవర్సీస్‌ మార్కెట్లో రారాజులు ఎవరంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పక తప్పదు. అందుకే ఈ ఏడాది కూడా వీరి సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని ఓ బయ్యర్ రూ. 10.5 కోట్లకు కొనుగోలు చేయగా, బ్రహ్మోత్సవం చిత్రాన్ని ఏకంగా రూ. 13కోట్లకు కొనుగోలు చేసారు. అయితే ఈ రెండు సినిమాలు భారీ ప్లాపులు కావడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. ఇలాంటి నష్ట పరిస్థితుల నేపథ్యంలో అసలు ఓవర్సీస్‌లో పెద్దగా మార్కెట్ లేని చిరంజీవి చేస్తున్న 150వ మూవీకి భారీ ఆఫర్ వస్తుందనే ఊహ కూడా ఎవరూ చేయరు. పైగా ఈ మధ్య కాలంలో పెద్దగా ఫాంలో లేని వివి వినాయక్ దర్శకత్వం కావడం కూడా ఓ కారణం..

No comments:

Post a Comment