shorte links

Monday, March 21, 2016

మేకింగ్ సినిమా సింపుల్.....


మేకింగ్ సినిమా సింపుల్....... ఈ వీడియో తప్పక చూదండి.ఒక అద్భుతంలో మీరూ బ్యాగస్వాములు కండి.సినిమాని కూడా సింపుల్ గా తీయొచ్చని ప్రపంచానికి చాటుదాం రండి. K.jaya prakash(state bank of india,nizampet branch,ifsc code.SBIN0012217) a/c.no.30789454363. Mob &whatsapp.9010992219




బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : క్షణం
Next
 
క్షణం : క్షణం.. అడివి శేష్, అదా శర్మ, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించగా, కొత్త దర్శకుడు రవికాంత్ పేరేపు తెరకెక్కించిన సినిమా. ఫిబ్రవరి 26న మంచి క్రేజ్‌తో విడుదలైన ఈ సినిమా, ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే అందరినీ మెప్పించి హిట్ కొట్టింది. తెలుగు సినిమాకు ఓ కొత్తదనమున్న సినిమాను పరిచయం చేసిన థ్రిల్లర్‌గా 'క్షణం'కు మొదట్నుంచీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రెండో వారం కూడా ఈ సినిమా ఏ సెంటర్స్‌లో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
‘క్షణం’ కోసం కొత్త తరహా థ్రిల్లర్ ని సబ్జెక్ట్ ని ఎన్నుకోవడమే మేజర్ ప్లస్. మొదట్నుంచి చివరి వరకూ ఎక్కడా సినిమా ఫ్లో మిస్ అవ్వకుండా పకడ్బందీగా అల్లిన సన్నివేశాలు బాగా మెప్పిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. నటీనటులంతా ఈ సినిమాను మరో ఎత్తుకి తీసుకెళ్ళారు. అడివి శేష్ సినిమాను దాదాపుగా తన భుజాలపై మోశాడనే చెప్పుకోవాలి. ఫస్ట్ ఫ్రేం దగ్గర్నుంచి చివరి ఫ్రేం వరకూ అడివి శేష్ అద్భుతమైన నటనని కనబరిచాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆద శర్మ చాలా బాగా ఆకట్టుకుంది. అనసూయ ఒక పోలీస్ పాత్రలో చాలా బాగా నటించింది. టఫ్ పోలీస్ గా సత్యం రాజేష్ సూపర్బ్ గా చేసాడు.
 
 సినిమాలో అక్కడక్కడా కొన్ని విషయాలను పూర్తిగా చెప్పకుండా మధ్యలో వదిలేసినట్లనిపించింది. అనసూయ పాత్ర మీద డిజైన్ చేసిన కొన్ని సీన్స్ సహజత్వానికి కొంచెం దూరంగా ఉంటాయి. సెకండాఫ్‌లో సినిమా వేగం కాస్త తగ్గుతుంది. ఫస్టాఫ్‌లో వచ్చే ఓ పాట కూడా సినిమా ఫ్లోను కాస్త దెబ్బతీసిందనే చెప్పాలి. ఇక ఈ తరహా కథాంశం, కథనం ఉన్న సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మాత్రమే చూసేవారికి పెద్దగా నచ్చకపోవచ్చు. 


 
బాక్స్ ఆఫీసు వద్ద :
 
ఎ సెంటర్స్ : ఫర్వాలేదు
 
బి సెంటర్స్ : అంత బాగా ఆడడం లేదు
 
సి సెంటర్స్ : అంత బాగా ఆడడం లేదు
 
తీర్పు : హిట్

‘జనతా గ్యారెజ్‌’తో సూపర్ స్టార్‌కు జాక్‌పాట్!

mohan-lal-1
మోహన్ లాల్.. మళయాల సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా సూపర్ స్టార్‌గా వెలుగొందుతోన్న నటుడు. తెలుగులో కూడా గతంలో ‘గాంఢీవం’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో మెప్పించిన ఆయన, మణిరత్నం రూపొందించిన ‘ఇద్దరు’ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు మరింత దగ్గరయారు. ఇక ఈ మధ్యే తమిళ సినిమా ‘జిల్లా’ తెలుగు డబ్బింగ్ ద్వారా మళ్ళీ మెప్పించిన మోహన్ లాల్, ప్రస్తుతం తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న ‘జనతా గ్యారెజ్’ ఒకటి కాగా, మరొకటి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మనమంతా’.
ఇక ‘జనతా గ్యారెజ్’ సినిమాకు మోహన్ లాల్ అందుకున్న రెమ్యునరేషన్ విషయంలో ఓ ఆసక్తికర విషయం తెలిసింది. మాకు అందిన సమాచారం మేరకు తమ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించేందుకు ‘జనతా గ్యారెజ్’ నిర్మాతలు మోహన్ లాల్‌కు 1.5కోట్ల రూపాయలతో పాటు మళయాల హక్కులను ఆఫర్ చేశారట. మళయాల హక్కులు కోటి రూపాయలు పలుకుతాయని నిర్మాతలు భావించగా, ఏకంగా 4 కోట్ల రూపాయలు పలికి మోహన్ లాల్‌కు జాక్‌పాట్ తెచ్చాయట. దీంతో మోహన్ లాల్, ‘జనతా గ్యారెజ్‌’తో ఈ స్థాయి జాక్‌పాట్ కొట్టడం ఆసక్తికరంగా మారిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

మహేష్ సినిమా ఒక జిల్లాకు 6.8 కోట్లా?

తెలుగు సినిమా మార్కెట్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన హీరోల్లో మహేష్ బాబు ఒకడు. పోకిరి - దూకుడు - శ్రీమంతుడు లాంటి సినిమాలతో తెలుగు సినిమా రేంజే మార్చేశాడు నవతరం సూపర్ స్టార్. రెండు పెద్ద డిజాస్టర్ల తర్వాత కూడా ‘శ్రీమంతుడు’ సినిమా బిజినెస్ - కలెక్షన్ల పరంగా నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ కొల్లగొట్టేయడం మహేష్ బాబు స్టామినాకు నిదర్శనం. తాజాగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు కూడా మహేష్ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మహేష్ తర్వాతి సినిమా విషయంలోనూ రికార్డుల మోత మోగడం ఖాయంలా కనిపిస్తోంది.

సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ తన తర్వాతి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా ముహూర్తం కూడా జరుపుకోని ఈ సినిమాకు అప్పుడే ఒక జిల్లాలో బిజినెస్ పూర్తయిపోవడం విశేషం. తూర్పు గోదావరి జిల్లాకు ఓ  డిస్ట్రిబ్యూటర్ అప్పుడే నిర్మాతలతో అగ్రిమెంట్ కూడా చేసేసుకున్నాడు. ఈ ఒక్క జిల్లాకే రూ.6.8 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చాడట ఆ బయ్యర్. బాహుబలి సినిమాకు సైతం ఈ జిల్లా హక్కులు రూ.5.25 కోట్లే పలికాయి. అలాంటిది దాని మీద ఒకటిన్నర కోట్ల దాకా ఎక్కువ పలకడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా సినిమా మొదలవకముందే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం అద్భుతమే. ఇప్పుడే ఇంత డిమాండ్ ఉందంటే.. ఇక సినిమా మొదలై.. పూర్తయ్యాక ఎంత క్రేజ్ ఉంటుందో మరి.

నాగ్ కుర్చీ రేటెంతో తెలుసా?

అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘ఊపిరి’కి పొట్లూరి వర ప్రసాద్ రూ.60 కోట్ల బడ్జెట్ పెట్టానంటే నమ్మశక్యం కాలేదు. కానీ ఆ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుంటుంటే.. బడ్జెట్ ఆ స్థాయికి చేరడంలో ఆశ్చర్యమేమీ లేదనిపిస్తుంది. నాగ్ ఈ సినిమా అంతా చక్రాల కుర్చీకే పరిమితమయ్యే పాత్రలో కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఐతే ఆయన కూర్చున్న ఆ చక్రాల కుర్చీ ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు పెట్టి ఆ కుర్చీ చేయించిందట పీవీపీ సంస్థ.

మరీ అంత ఖర్చు పెట్టేంత ప్రత్యేకత ఏముంది ఆ కుర్చీలో అని ఆశ్చర్యం కలగడం ఖాయం. ఐతే అది స్వీడన్ లో ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించిన కుర్చీ అట. నాగ్ పోషించే పాత్రకు కాళ్లు చేతులు అన్నీ చచ్చుబడిపోయి ఉంటాయి. ఏమాత్రం అందులో కదలిక వచ్చినా.. పాత్ర ఔచిత్యం దెబ్బ తింటుంది. అందుకే శరీరంలో ఏ కదలికలు లేకుండా ఉండేలా ఈ చక్రాల కుర్చీలో నియంత్రించే ఏర్పాట్లు ఉంటాయట. అందుకే ఆ కుర్చీకి అంత ఖర్చయిందట.

‘ఊపిరి’ ఒరిజినల్ ‘ది ఇన్ టచబుల్స్’ నిర్మాతలు కూడా ఇలాంటి కుర్చీనే ప్రత్యేకంగా తయారు చేయించారట. ఆ సంస్థకే ఆర్డర్ ఇచ్చి పీవీపీ వాళ్లు కూడా కుర్చీని తయారు చేయించుకుని వచ్చారట. నిర్మాణ విలువల విషయంలో పీవీపీ ఏమాత్రం రాజీ పడదని వాళ్ల గత సినిమాలు చూస్తే అర్థమవుతుంది. తెలుగు - తమిళ భాషల్లో ఈ శుక్రవారమే ‘ఊపిరి’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరో లైఫ్ ఛేంజింగ్ మూవీ

అక్కినేని నాగార్జున ఇప్పుడు తన కెరీర్ మొత్తంలోనే టాప్ స్టేజ్ లో ఉన్నారు. ఎన్నో విభిన్నమైన సినిమాలతో తన స్టామినా చాటుతూ వచ్చిన నాగ్.. ఇప్పుడు సోగ్గాడే చిన్న నాయనతో 50 కోట్ల హీరోగా మారిపోయారు. అంతకు ముందు మనం మూవీతోనూ బ్లాక్ బస్టర్ కొట్టిన నాగార్జున.. సీనియర్ హీరోలకు అసాధ్యం అని అందరూ అనుకున్న ఫిఫ్టీ క్లబ్ లోకి ఎంటర్ అయ్యారు. 

ఇప్పుడు ఊపిరి మూవీతో హ్యాట్రిక్ పై కన్నేశారు నాగార్జున. ఈ మూవీ పబ్లిసిటీ కోసం విభిన్నమై పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు ఈ సీనియర్ స్టార్. ఆడియో ఫంక్షన్ ని - ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ ని వేరువేరుగా నిర్వహించి ఆసక్తి కలిగించిన నాగ్.. ఇప్పుడు ఊపిరి రిలీజ్ మరో వారం రోజుల్లోకి రావడంతో.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. ' నిన్న నే మూవీ చూశా. డబుల్ హ్యాపీ మొన్న సంక్రాంతికి  క్యాప్ పెట్టాను ఇప్పుడు ఫెదర్స్ పెట్టబోతున్నా.. ఇది నాకు లైఫ్ ఛేంజింగ్ మూవీ' అంటూ ఊపిరిని పొగడ్తల్లో ముంచెత్తారు. 

ఒక రకంగా నాగ్ కెరీర్ లోనే ఇది మైలు రాయిలా నిలిచిపోయే చిత్రం. సినిమా అంతా కుర్చీలోనే ఉంటూ చేతులు కాళ్లు కదల్చకుండా కేవలం ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తోనే అన్ని భావాలను పలికించే పాత్ర ఇది. ఈ మూవీ తర్వాత యాక్టర్ గా నాగార్జున స్థాయి పది రెట్లు పైకి ఎక్కడం ఖాయమనే అంచనాలున్నాయి. 

పవన్ పవర్ బాలీవుడ్ కి తగిలింది

బాలీవుడ్ జోకర్ కం యాక్టర్ కమల్ ఆర్ ఖాన్. ఇతగాడి గురించి ఇక్కడి జనాలకు పెద్దగా ఏం తెలీకపోయినా.. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద ట్వీట్స్ చేసి ఒక్కసారిగా పాపులర్(అన్ పాపులర్) అయ్యాడు. పవన్ తన సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో రిలీజ్ చేస్తానని చెప్పినప్పటి నుంచే ఈ దాడి మొదలైందని.. పవర్ ఎంట్రీ కి భయపడే ఈ దాడి అనే మాటను తుపాకి ముందే చెప్పింది. 

అయితే పవన్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని బాలీవుడ్ జనాలు కూడా చెప్పినా వినిపించుకోకుండా తెగ పేలిన కమల్ ఆర్ ఖాన్ కి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ చూసి వణుకు పుట్టిందని తెలుస్తోంది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా పవన్ అంటే తెగ ఇష్టం పుట్టేసింది అంటున్నాడు కమల్ ఆర్ ఖాన్.  'తెలుగులో పవన్ కళ్యాణ్ పెద్ద సూపర్ స్టార్ అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే ఐ లవ్ హిమ్. అయినా సరే.. అతని సినిమా హిందీలో రిలీజ్ కావడానికి వీల్లేదు'.. ఇదీ ఆ పూర్తి పిచ్చోడి ట్వీట్. 

అంతే కాదు.. రజినీకాంత్ - పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఇప్పుడు తాను ఇష్టపడుతున్నానంటూ మరో ట్వీట్ కూడా పెట్టి పవన్ ని ట్యాగ్ చేశాడు. అంటే వివాదం తగ్గించేందుకు ప్రయత్నించమని అభ్యర్ధించడం అన్నమాట. ఇంతగా జ్ఞానోదయం కలగడానికి కారణం.. అటు పొలిటికల్ గా ఇటు సినిమాల్లోనూ పవన్ రేంజ్ గురించి ఈ క్రిటిక్ కి డైరెక్ట్ గా తలంటు పోశారట. అంతే కాదు.. ఆడియో ఫంక్షన్ కోసం జరుగుతున్న ఏర్పాట్లు - ఇంటెలిజెన్స్ హడావిడి చూసి.. ఈ కమల్ ఆర్ ఖాన్ కి జ్ఞానోదయం అయిందంటున్నారు. మొత్తానికి ఇంకా అడుగు పెట్టకుండానే కమల్ ఆర్ ఖాన్ నోరు మూయించాడంటే.. బాలీవుడ్ లో పవన్ పవర్ అప్పుడే స్టార్ట్ అయిపోయినట్లే. 

కళ్యాణ్ రామ్! అన్నీ అవే ట్వీట్సా?

ఈ మధ్య కాలంలో ట్విట్టర్ తెగ పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలయితే.. ఈ ప్లాట్ ఫాంని తెగ వాడేస్తున్నారు. తమ మనసులో మాట చెప్పడానికి తమ గురించి జనాలకు అప్ డేట్స్ ఇవ్వడానికి.. సోషల్ మీడియాని మీడియంగా మార్చేస్తుకున్నారు. అయితే.. ఓ నందమూరి హీరో మాత్రం.. ఇలాంటి వాటికి భిన్నంగా.. కేవలం బర్త్ డే విషెస్ చెప్పడానికే ట్విట్టర్ హ్యాండిల్ ని ఉపయోగించుకుంటున్నాడు. 

నందమూరి కళ్యాణ్ రామ్ ఇవాళ చేసిన ట్వీట్.. బాలయ్య మనవడు దేవాన్ష్ కి హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పడం. దేవాన్ష్ తో తాను ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసి ' హ్యాపీ బర్త్ డే దేవాన్ష్. నువ్వు సంతోషంగా పెరగాలని విజయం సాధించాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు. మార్చ్ 19న హ్యాపీ బర్త్ డే పెద నాన్న అంటూ మోహన్ బాబు విషెస్ చెప్పి.. పెదరాయుడు ఫోటోను పోస్ట్ చేశాడు కళ్యాణ్ రామ్. 

అంతకు ముందు బాలయ్య గురించి రెండు ఇతర ట్వీట్స్ చేయగా.. ఫిబ్రవరి 22న తారకరత్నకు హ్యాపీ  బర్త్ డే చెబుతూ ట్వీట్ పెట్టాడు. దానికి ముందు దివంగతుడైన జానకి రామ్ కు వి మిస్ యూ అన్నయ్య అంటూ ట్వీట్ చేశాడు. అప్పుడెప్పుడో పూరీతో తన సినిమా గురించి తప్ప.. మిగతా అన్నీ బర్త్ డే విషెస్ ని మాత్రమే కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు. 

తెలంగాణలో 4 ఆటలు కాదు.. 5 ఆటలా?

సినీ ప్రియులకు పండగే. సినిమాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది. దశాబ్దాలకు తరబడి సాగుతున్న రూల్స్ ను బ్రేక్ చేసేసి.. తనదైన శైలిలో విలక్షణ నిర్ణయాన్ని తీసుకునే దిశగా అడుగులు పడనున్నాయి. ఇప్పటివరకూ సూచనగా ఉన్న ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కానీ సానుకూల నిర్ణయం తీసుకుంటే మాత్రం చిన్న సినిమాలకు పండగేనని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇప్పటివరకూ తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లు నాలుగు ఆటలు మాత్రమే వేసే స్థానే..ఐదు ఆటలు వేసేలా ఆదేశాలు జారీ చేసే వీలుండటమే దీనికి కారణం.  

చిన్న సినిమాకు థియేటర్లు దొరకటం కష్టంగా మారిన నేపథ్యంలో.. అందుకు భిన్నంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే వీలుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ధియేటర్లలో రోజూ ఐదు సినిమాలు వేసే అవకాశాన్ని ఇవ్వటం అందులో ఒకటి. అంతేకాదు.. ఐదో షో కచ్ఛితంగా చిన్న సినిమా అయి ఉండాలన్న సూచనను తెలంగాణ సబ్ కమిటీ చేసింది.

అంతేకాదు.. చిన్న సినిమాల పరిమితిని ఇప్పటివరకూ ఉన్న 30 థియేటర్ల నుంచి 50 థియేటర్లకు పెంచాలన్న నిర్ణయం కూడా తీసుకుంది. కమిటీ తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి.. అధికారిక ఆదేశాలు వెలువడితే మాత్రం.. తెలంగాణలోని థియేటర్ల షో టైమింగ్స్ మొత్తంగా మారిపోవటం ఖాయం. చూస్తుంటే.. అలాంటి రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది.

గ్యారేజ్ టీంకి షాకిచ్చిన మలయాళ స్టార్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొన్ని విషయాల్లో చాలా పక్కాగా ఉంటారు.  తాజాగా కళాభవన్ మణి మరణించినపుడు.. అతనికి నివాళిగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ బోలెడు రాజకీయాలు చేసేశాడు మోహన్ లాల్. ప్రస్తుతం మల్లూవుడ్ లో టాప్ స్టేజ్ లో ఉండడంతో.. ఆయన చెప్పింది చెప్పినట్లు చేయాల్సిన పరిస్థితి అక్కడ. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ లో నటిస్తున్న మోహన్ లాల్.. ఆ మూవీ నిర్మాతలకు భారీ షాక్ నే ఇచ్చాడు. 

జనతా గ్యారేజ్ లో నటించేందుకు మోహన్ లాల్ తో చేసుకున్న రెమ్యూనరేషన్ అగ్రిమెంట్ ఏంటో తెలుసా.. కోటిన్నర రూపాయలు ప్లస్ మలయాళ రైట్స్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒప్పుకుంది. వీళ్ల అంచనా ప్రకారం మలయాళ రైట్స్ రూపంలో 1.5 కోట్లు వస్తాయని భావించారు. కానీ ఇప్పుడు జనతా గ్యారేజ్ మలయాళ డబ్బింగ్ రైట్స్ ని అమ్మేశాడు మోహన్ లాల్.

 ఈమూవీ మలయాళ హక్కులు ఏకంగా 4.5 కోట్ల రూపాయలు పలకడంతో.. మైత్రి సంస్థకు షాక్ తగిలింది. అంటే.. ఒక్క సినిమాతో 6 కోట్లు జేబులో వేసుకున్నాడన్న మాట మోహన్ లాల్. అఫ్ కోర్స్ తన తెలివితేటలనే వాడినా.. మరీ ఈ రేంజ్ లో గ్యారేజ్ టీంకి షాక్ ఇవ్వడం మాత్రం అశ్చర్యకరమే. 

ఎండాకాలంలో సూట్ ఏంటి తమ్మూ?

ఫ్యాషన్ విషయంలో తమన్నాకి పాఠాలు చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు ట్రెండీగా మారిపోవడం మిల్కీకి బాగానే అలవాటు. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ సినిమాలు చేస్తుండడం మరో ఫ్యాషన్ రంగమైన అడ్వర్ టైజ్ మెంట్స్ లోనూ మంచి అనుభవం ఉండడంతో.. తమ్మూ ఎప్పుడూ ట్రెండింగ్ గానే కనిపిస్తూ ఉంటుంది. ఆ మధ్య ఓ అవార్డ్ ఫంక్షన్ లో అయితే క్లీవేజ్ షో చేసి చితక్కొట్టేసింది. 

రీసెంట్ గా నాగ్ - కార్తిలతో కలిసి నటించిన ఊపిరి మూవీ తమిళ వెర్షన్ తోఝా ఆడియో వేడుకలో కూడా.. అమ్మడి అందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మరోవైపు డిఫరెంట్ డ్రసింగ్ తోనూ ఆకట్టుకుంది. పబ్లిక్ ఫంక్షన్ లో ఎక్స్ పోజింగ్ పై కొన్ని విమర్శలు ఉన్నా.. ఫ్యాషన్ లవర్స్ మాత్రం బాగానే ఎగ్జయిట్ అయ్యారు. ఇప్పుడు తెలుగులో ప్రచారానికి వచ్చేసింది తమన్నా. విడుదలకు మరో నాలుగు రోజులే గడువు ఉండడంతో.. ఇక్కడ కూడా ప్రమోషన్స్ యాక్టివ్ గానే చేస్తోంది. 

తాజాగా జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ కు ఫుల్లు సూట్ వేసుకుని హాజరయ్యింది మిల్కీ బ్యూటీ. డార్క్ కలర్ సూట్ ఆమె ఫెయిర్ స్కిన్ కు బాగానే నప్పింది. అందులోంచే కొంత క్లీవేజ్ ని ప్రదర్శించింది. అయితే.. ఇంత హాట్ సమ్మర్ లో హాట్ హాట్ డ్రస్సులు కాకుండా.. మరీ ఇలా ఒళ్లంతా కప్పేసుకున్న సూట్ కోట్ వేసుకొచ్చిందేంటో అనుకున్నారు ఫ్యాషన్ ప్రియులు.

Kathakali Movie Review

Kathakali

Kathakali
MOVIE:Kathakali
RATING:
2.5/5
Cast: VishalCatherineKarunas and Others
Directed by: Pandya Raj
Produced by: Vishal
Banner: VFF Productions
Music by: Hiphop Thamizha
Release Date: 2016-03-18
 

Kathakali Movie Review

Vishal's recent Tamil release Kathakali has been dubbed into Telugu with the same name. It is a whodunit murder mystery that is sprinkled with regular commercial elements like romance, comedy and action. It is fairly engaging to an extent but soon looses the fizzle because of thin story and lazy writing towards the end.

What is it about?


Kamalakar (Vishal) and his family are tortured by a local rowdy Samba who is against Kamalakar's brother's wish to setup an independent business. Kamalakar seeks revenge but he moves on. While he is about to marry his girlfriend (Catherine), Samba is killed and Kamalakar is the prime suspect for the murder. Kamalakar doesn't know how to get out of the trap laid by a cunning police officer. So he executes a plan to find the murderer.

Performances:

Vishal is good as the regular guy. This is one of his finest performances till date. Cathrine is okay as the girlfriend. She goes missing after a point. She is just used for the romantic track and is hardly seen in the second half. Karunas comedy doesn't work. The actor who played the role of police inspector is menacing. Jayaprakash is wasted.

Technicalities:

Songs are not impressive and thankfully there are only a couple of them in it. BGM is impressive though. That whistle sound is nicely done. Cinematography is fine. Most part of the movie runs in dark and the cinematographer did a very good job in setting the mood right with his lighting. Editing is crisp. Production values are decent.

Thumbs Up:


Mystery element

Thrilling Sequences

Thumbs Down:

Romantic episode

Comedy

Analysis:

Like most of the Tamil films, Kathakali too had a simple plot but an interesting screenplay. It is based on the revenge drama but Pandya Raj did it in whodunit style. It takes so much time to get on track. Romantic episode between Vishal and Catherine is anything but interesting. Same scenes are repeated until we get bored of it.

Story gets interesting before the interval as the main villain is killed and all fingers point at the hero. Pandya Raj did well in holding the interest of the viewers for a while, but even the mystery element gets uninteresting as the film takes predictable path. Climax part looks contrived as if the director is in a hurry to end it.
        
Kathakali could have been better had the director continued to throw surprises at us until the end. Even the big reveal at the end didn't make an impact because of lazy and cinematic climax. There are scenes that are worth watching but Kathakali falls flat on a whole.

Actress - Sanjana at Sardaar Audio Launch Photos

Sanjana at Sardaar Audio Launch   Sanjana at Sardaar Audio Launch   Sanjana at Sardaar Audio Launch   Sanjana at Sardaar Audio Launch   Sanjana at Sardaar Audio Launch   Sanjana at Sardaar Audio Launch   Sanjana at Sardaar Audio Launch   Sanjana at Sardaar Audio Launch   Sanjana at Sardaar Audio Launch   

Actress - Kajal Agarwal at Sardaar Audio Launch Photos

Kajal Agarwal at Sardaar Audio Launch   Kajal Agarwal at Sardaar Audio Launch   Kajal Agarwal at Sardaar Audio Launch   Kajal Agarwal at Sardaar Audio Launch   Kajal Agarwal at Sardaar Audio Launch   Kajal Agarwal at Sardaar Audio Launch   Kajal Agarwal at Sardaar Audio Launch   Kajal Agarwal at Sardaar Audio Launch   Kajal Agarwal at Sardaar Audio Launch   Kajal Agarwal at Sardaar Audio Launch   

ఆ ఒక్క తమిళ సినిమానే దిక్కు

ఆ ఒక్క తమిళ సినిమానే దిక్కు

March 19th, 2016, 09:20 AM IST
ఆ ఒక్క తమిళ సినిమానే దిక్కు
తెలుగు సినిమా ఈ వారం ఎదుర్కొంటున్నంత గడ్డు పరిస్థితి గత కొన్నేళ్లలో ఎప్పుడూ ఎదుర్కొని ఉండదేమో. ఏదైనా భారీ సినిమా బాగా ఆడుతుంటే.. కొత్త సినిమాలేవీ విడుదల కాకుండా ఖాళీగా వదిలేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. సంక్రాంతి తర్వాతి వారం ఇలాగే ఏ సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఐతే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఆల్రెడీ థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలున్నాయి కానీ వాటికీ కలెక్షన్లు లేవు. కొత్తవేమైనా సత్తా చూపిస్తాయేమో అనుకుంటే.. ఈ శుక్రవారం ఓ మోస్తరు సినిమా కూడా ఏదీ రాలేదు.

ఉన్నంతలో తమిళ డబ్బింగ్ మూవీ ‘కథకళి’ మేలు. శుక్రవారం విడుదలైన నాలుగైదు సినిమాల్లో ఇదొక్కటే ఓ మోస్తరుగా జనాల్ని థియేటర్లకు రప్పిస్తోంది. దీనికి టాక్ కూడా పర్వాలేదు. థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడేవారిని విశాల్ మూవీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ వారం విడుదలైన తెలుగు సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

‘దృశ్యకావ్యం’ అంటూ మంచి పబ్లిసిటీ చేసి ఓ సినిమా వదిలారు. దానికంత ‘దృశ్యం’ లేదని తేలిపోయింది. ఈ సినిమాకు థియేటర్లు బాగానే ఇచ్చారు కానీ.. జనాలకు పెద్దగా ఆనట్లేదు. ఇక శివాజీ నటించిన ‘సీసా’ గురించి మాట్లాడేవాళ్లే లేరు. రొమాన్స్ విత్ ఫైనాన్స్ అంటూ ఇంకో సినిమా వచ్చింది దాని పరిస్థితి ఇంతే. ఐతే వచ్చే బుధవారం నుంచి బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడే అవకాశముంది. ఆ రోజు సందీప్ కిషన్ సినిమా ‘రన్’ వస్తుంది. ఇంకో రెండు రోజులకే ‘ఊపిరి’ థియేటర్లలోకి దిగుతుంది. కాబట్టి తెలుగు సినిమా స్లంప్ ఇంకో నాలుగు రోజులే అన్నమాట.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14175/VIshal-Kathakali-is-the-only-movie-to-watch-this-week#sthash.pnvk5Yn0.dpuf

సర్దార్ పాసులు ఎంత పలుకుతున్నాయ్..

సర్దార్ పాసులు ఎంత పలుకుతున్నాయ్..
ఒకప్పుడు సినిమా టికెట్లు మాత్రమే బ్లాక్‌లో అమ్మేవాళ్లు. కానీ ఇప్పుడు ఆడియో వేడుకల పాస్‌లు సైతం వేలం పాట వేసే అమ్మేసే రోజులు వచ్చేశాయి. బ్లాక్‌లో టికెట్టు కొని థియేటర్లోకి వెళ్తే తెర మీద బొమ్మ మాత్రమే చూడొచ్చు. కానీ ఆడియో ఫంక్షన్ పాస్ తీసుకుంటే.. తమ అభిమాన కథానాయకుడిని నేరుగా చూసుకోవచ్చు. ఇంకా చాలామంది సెలబ్రెటీల్ని చూడొచ్చు. చాలా కార్యక్రమాల్ని ఆస్వాదించొచ్చు. గోల చేయొచ్చు.. కేరింతలు కొట్టొచ్చు.. అదృష్టం బాగుంటే తమ అభిమాన కథానాయకుడికి కొంచెం దగ్గరగా వెళ్లి ఫొటో కూడా దిగొచ్చు. అందుకే పెద్ద హీరోల ఆడియో ఫంక్షన్లకు సంబంధించిన పాస్‌లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది ఈ మధ్య.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి హీరోల ఆడియో వేడుకలకు వేలకు వేలు పోసి.. పాస్‌లు సంపాదిస్తున్నారు అభిమానులు. మా హీరో సినిమా టికెట్ ఇంత పలికింది అని గొప్పలు చెప్పుకున్నట్లే.. ఆడియో ఫంక్షన్ల పాస్‌లకు సంబంధించి వేలం పాటల వివరాల్ని కూడా సోషల్ మీడియాలో ఘనంగా షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఆదివారం జరగబోయే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్ పాస్‌లు కూడా ఒక్కొక్కటి కొన్ని వేలల్లో అమ్ముడుబోతున్నాయట. అభిమాన సంఘాల ద్వారా పాస్‌లు దక్కించుకున్నవాళ్లు.. వీటికి ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ బేరం పెడుతున్నారు. కొందరు ఆన్ లైన్లో సైతం వీటిని సేల్‌కు పెడుతున్నారు. ‘సర్దార్..’ ఆడియో వేడుక రోజు నాటికి ఈ పాస్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడే అవకాశముంది. ఆ రోజు వెన్యూ ముందు పాస్‌లు బేరానికి పెడితే అనూహ్యమైన ధరలు పలకడం ఖాయం.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14176/Sardaar-Gabbarsingh-Audio-Launch-Passes-Costs-Bomb#sthash.VwxMyHHZ.dpuf

తేజతో అతడు.. పుష్కరం తర్వాత

తేజతో అతడు.. పుష్కరం తర్వాత
డైరెక్టర్ తేజ.. చాలామంది నటీనటులకు లైఫ్ ఇచ్చాడు. నవదీప్ కూడా అతను పరిచయం చేసిన వాడే. తాను పరిచయం చేసిన కొంతమందికి తలపొగరు ఎక్కువై తననే పట్టించుకోని స్థితికి వచ్చేశారని.. కానీ కొందరు మాత్రం తన మేలు మరిచిపోలేదంటూ.. ఆ జాబితాలో నవదీప్ పేరు కూడా చెప్పాడు తేజ ఆ మధ్య.

ఐతే ప్రస్తుతం తేజ ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడో.. నవదీప్ కూడా అలాగే కష్టాల్లో ఉన్నాడు. ఈ టాలెంటెడ్ హీరోకు తెలుగులో అవకాశాలే లేవు. ఈ పరిస్థితుల్లో తన కొత్త సినిమాలో తేజ...నవదీప్‌కు హీరోగా ఛాన్సివ్వడం విశేషం. సరిగ్గా పుష్కరం కిందట వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘జై’ సినిమా వచ్చింది. అది ఫ్లాపైనా.. నవదీప్ టాలెంట్ ఏంటో ఇండస్ట్రీకి తెలిసిందే. ఆ తర్వాత మంచి మంచి అవకాశాలు అందుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్.

మళ్లీ ఇన్నేళ్లకు తేజ దర్శకత్వంలో నవదీప్ నటించడం విశేషమే. ‘అహం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడిది కూడా హీరో స్థాయి పాత్రేనట. ఈ చిత్రంలో రాజశేఖర్ విలన్ క్యారెక్టర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దాడట తేజ. రాజశేఖర్, నవదీప్, తేజ.. ఈ ముగ్గురికీ కూడా ‘అహం’ చాలా చాలా కీలకం. ఈ సినిమాతో ముగ్గురి కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూద్దాం మరి.

నాగ్ అల్లు అర్జున్ తో కలిస్తే రచ్చే

నాగ్ అల్లు అర్జున్ తో కలిస్తే రచ్చే
కెరీర్ లో ఎప్పుడూ లేనంత హాయిగా, హ్యాపీగా ఉన్నారు నాగార్జున. దీనికి కారణం వరస విజయాలు.. మరో కారణం విభిన్నమైన క్యారెక్టర్లు. మనం, సోగ్గాడే చిన్నినాయనా వంటి చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించాడు నాగ్. ఇక ఇప్పుడు ఊపిరిలోనూ అలాంటి పాత్రే చేసాడు. కుర్చీకే అంకితమయ్యే బిలియనియర్ పాత్రలో నటించాడు గ్రీకువీరుడు. ఈ సినిమాలో నటించిన తర్వాత నాగార్జున మనసు మార్చుకున్నాడు. ఇకపై మల్టీస్టారర్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు నాగార్జున. ఇమ్మీడియట్ గా ఈ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాడు.

నాగార్జున ప్రస్తుతం ఊపిరి ప్రమోషన్స్ లోనే బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు.. మరొకటి రాఘవేంద్రరావ్ తో నమో వెంకటేశా.. ఇంకోటి త్రివిక్రమ్ తో ఓ సినిమా. వీటిలో త్రివిక్రమ్ సినిమానే ముందు తెరకెక్కనుందని సమాచారం. ఇందులో నాగార్జున సోలో హీరో కాదు.. అల్లు అర్జున్ తో కలిసి ఈయన నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ చెప్పిన కథ నాగ్ కు బాగా నచ్చిందని సమాచారం.

ఇప్పటికే కార్తితో కలిసి నటించిన నాగ్.. అన్నీ కుదిర్తే బన్నీతో నటించడం కూడా ఖాయమే. ఇదే ఊపులో మరిన్ని మల్టీస్టారర్స్ కు కూడా నాగార్జున ఓకే చెప్పేస్తున్నారు. తమిళ హీరో సూర్యతో నాగార్జున ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారనేది తాజాగా వినిపిస్తున్న వార్త. ఇక ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఎప్పట్నుంచో వేచి చూస్తున్నా.. కథ కుదిర్తే చేస్తానంటూ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు నాగార్జున. మొత్తానికి వయసు పిలిచే సరికి మనసు మార్చుకోక తప్పలేదు మన గ్రీకువీరుడికి.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14182/Nagarjuna-and-Allu-arjun-In-Trivikram-Movie#sthash.vYsee9Xw.dpuf

రాజమౌళిని పర్మిషన్ అడిగావా సునీల్..?

రాజమౌళిని పర్మిషన్ అడిగావా సునీల్..?
హిట్ కొట్టాలంటే ఏదో ఒకటి చేయాలి.. ఎందుకంటే ఇండస్ట్రీలో విజయం లేకపోతే విలువ ఉండదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పర్లేదు ఒక్కసారి ఫ్లాపుల్లో పడితే ఉండే తలనొప్పులే వేరు. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా.. లోపల మాత్రం చాలా తేడాలు వచ్చేస్తాయి. తనకు అలాంటి పరిస్థితులు రాకూడదని ఇప్పట్నుంచే జాగ్రత్త పడుతున్నాడు సునీల్. ఈయన హిట్ అనే మాట విని నాలుగేళ్లు దాటిపోయింది. అప్పుడెప్పుడో వచ్చిన పూలరంగడు తర్వాత సునీల్ కు మరో విజయం రాలేదు.

మిస్టర్ పెళ్లికొడుకు, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి.. ఇలా వచ్చిన సినిమాలన్నీ వచ్చినట్లే చాప చుట్టేసాయి. ప్రస్తుతం వీరుపోట్లతో ఈడు గోల్డ్ ఎహే, వంశీ కృష్ణ ఆకెళ్లతో ఓ సినిమా చేస్తున్నాడు సునీల్. వంశీ సినిమాకు జక్కన్న అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు దర్శకనిర్మాతలు. జక్కన్న అంటే ఇండస్ట్రీలో వెంటనే గుర్తొచ్చేది రాజమౌళి. తన సినిమాను ఓ శిల్పంలా చెక్కుతాడని ఎన్టీఆర్ అతడికి ఈ ముద్దుపేరు పెట్టాడు. తర్వాత ఇదే పాపులర్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఇదే టైటిల్ ను సునీల్ తన సినిమా కోసం టైటిల్ గా వాడుకున్నాడు. జక్కన్న ఎంటర్ టైన్ మెంట్ తో పాటు... యాక్షన్ ప్యాక్డ్ గా తెరకెక్కుతోంది. మరి చూడాలి.. కనీసం రాజమౌళి ముద్దుపేరైనా సునీల్ కు విజయం తీసుకొస్తుందో లేదో..?
- See more at: http://telugu.gulte.com/tmovienews/14183/Sunil-uses-Rajamouli-Nick-name-for-his-next#sthash.4NlTsf4G.dpuf

కెరీర్ చివర్లో దెయ్యం వేశాలు..

కెరీర్ చివర్లో దెయ్యం వేశాలు..
స్టార్ ఇమేజ్ ఉన్నపుడు... నేను ఇలాంటి పాత్రలు మాత్రమే చేస్తాను.. ఇవి చేయను.. నాకవి కావాలి.. ఇవి కావాలి.. అని గొంతెమ్మ కోర్కెలు కోరతారు. ఒక్కసారి ఇమేజ్ పోయిందంటే ఇండస్ట్రీలో విలువ ఇచ్చేవారు కంటికి కనిపించరు. ఒకప్పుడు సార్ సార్ అంటూ భజన చేసేవాళ్లే... ఇమేజ్ లేకపోతే కనీసం దండం కూడా పెట్టరు. హీరోయిన్ల విషయంలోనూ అంతే. స్టార్ హీరోయిన్ గా ఉన్నపుడు వాళ్లు చేసే హంగామా...వేసే వేశాలు అన్నీ ఇన్నీ కావు. ఆ భ్రమలోనే ఉంటూ కొన్నాళ్లూ అవకాశాలకు కూడా దూరమవుతారు. కానీ త్రిష మాత్రం తన ఇమేజ్ ఏంటో ముందే తెలుసుకుంది. అందుకే చిన్న సినిమాలైనా పర్లేదని అన్నింటికి ఓకే చెప్పేస్తోంది.

కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఓ దెయ్యంగా నటిస్తోంది త్రిష. నాయకి అనే సినిమాలో ఈ చెన్నై చంద్రం ఘోస్ట్ గా రెచ్చిపోనుంది. ఈ సినిమాను గోవి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈయన తొలి సినిమా లవ్ యూ బంగారం. మారుతి స్కూల్ నుంచి వచ్చిన ఈ దర్శకుడు.. తొలి సినిమాలో కావాల్సినంత బూతును మిక్స్ చేసి విమర్శలు కూడా అందుకున్నాడు. అలాంటి దర్శకుడికి త్రిష ఇప్పుడు ఓకే చెప్పింది. ఈ మధ్యే టీజర్ కూడా బయటికి వచ్చేసింది. డైరెక్టర్ ఫస్ట్ చిత్రం రిజల్డ్ గురించి పక్కన పెడితే... త్రిష ఇందులో ఉండటమే సినిమాకు పెద్ద ప్లస్. రెండు భాషల్లోనూ త్రిషకున్న ఫాలోయింగ్ తో నిర్మాతలు బిజినెస్ చేసేస్తారు. మరి కొన్న బయ్యర్లు ఎంతవరకు సేఫ్ అవుతారనేది చూడాలి. కెరీర్ చివర్లో త్రిష ప్రేక్షకుల్ని ఎలా భయపెట్టనుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్...
- See more at: http://telugu.gulte.com/tmovienews/14184/Trisha-In-Nayaki-Movie-as-Devil#sthash.gh7dd9TA.dpuf

అమీర్ ఆశపడ్డాడు.. షారుఖ్ చేసేస్తున్నాడు

అమీర్ ఆశపడ్డాడు.. షారుఖ్ చేసేస్తున్నాడు
సన్నీ లియోన్ ఓ పోర్న్ స్టార్.. కానీ అది గతం. ఇప్పుడామె మాంచి డిమాండ్ ఉన్న బాలీవుడ్ నటి. హీరోయిన్‌గా చేయించుకుంటే హీరోయిన్‌గా చేయించుకోవచ్చు.. లేదంటే గెస్ట్ రోల్ చేయడానికైనా రెడీ.. అవసరమైతే ఐటెం సాంగ్‌లో ఆడి పాడ్డానికైనా సిద్ధం. ఆమె క్రేజ్‌ను వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఓ పెద్ద జర్నలిస్టు.. మీ లాంటి పోర్న్ స్టార్‌తో కలిసి నటించడానికి అమీర్ ఖాన్ ఒప్పుకుంటాడా అంటూ సన్నీని అవమానించేలా ప్రశ్నించాడు. దానికి ఆమె ఏం సమాధానం ఇచ్చిందన్నది పక్కనబెడితే.. సన్నీతో నటించడానికి తనకే అభ్యంతరం లేదని.. ఫ్యూచర్లో ఆమెతో కలిసి నటిస్తానని ప్రకటించాడు అమీర్. ఐతే అమీర్‌తో ప్రతి విషయంలోనూ పోటీ పడే షారుఖ్ ఖాన్.. తన శత్రువు కంటే ముందు సన్నీతో కలిసి తెర పంచుకునే అవకాశాన్ని కొట్టేయాలనుకున్నట్లున్నాడు. తన కొత్త సినిమా ‘రాయీస్’లో సన్నీతో కలిసి స్టెప్పులేయడానికి రెడీ అయిపోతున్నాడు షారుఖ్. ఈ సినిమాలో సన్నీ ఐటెం సాంగ్ చేయబోతుండటం.. అది కూడా ఓ ఫేమస్ హిందీ పాటకు రీమిక్స్ కావడం విశేషం.

బాలీవుడ్ క్లాసిక్ సాంగ్స్‌లో ఒకటైన ‘లైలా ఓ లైలా’ పాటకు నృత్యం చేయబోతోంది సన్నీ లియోన్. ‘ఖుర్బాని’లోని ఈ పాట ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఓ మైల్ స్టోన్. అలాంటి పాటను ‘రాయీస్’ కోసం రీమిక్స్ చేస్తున్నారు. ఇదే విశేషమంటే ఆ పాటలో సన్నీ, షారుఖ్ కలిసి డ్యాన్స్ చేయబోతుండటం ఇంకా పెద్ద విశేషం. ఈ పాటను సన్నీతో చేయిద్దామని స్వయంగా షారుఖ్ ఖానే చెప్పాడట. రాహుల్ డోలాఖియా దర్శకత్వం వహిస్తున్న ‘రాయీస్’లో షారుఖ్ అండర్ వరల్డ్ డాన్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఆ మధ్య రిలీజైన ‘రాయీస్’ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ఏడాది రంజాన్ రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాని కంటే ముందు ఏప్రిల్ 15న ‘ఫ్యాన్’ సినిమాతో పలకరించబోతున్నాడు కింగ్ ఖాన్.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14185/Sunny-Leone-in-Shah-Rukh-Khans-Raees#sthash.jgIdiL9H.dpuf

గుణశేఖర్‌కు వందేళ్ల పుస్తకం దొరికింది

గుణశేఖర్‌కు వందేళ్ల పుస్తకం దొరికింది
ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ‘రుద్రమదేవి’ సినిమా తీశాడు గుణ. విడుదలకు ముందు కూడా అతను ఎన్నెన్ని కష్టాలు పడ్డాడో అందరికీ తెలిసిందే. ఐతే రూ.70 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీసిన గుణ.. నిండా మునిగిపోవడం ఖాయమని చాలామంది అంచనా వేశారు కానీ, అతను చివరి తక్కువ నష్టాలతోనే బయటపడ్డాడు. ‘రుద్రమదేవి’ అంచనాల్ని మించి ఆడింది. గుణ మళ్లీ ఇంకో సాహసం చేయడానికి కావాల్సిన ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘రుద్రమదేవి’ తాలూకు స్ట్రెస్ నుంచి బయటపడ్డానికి ఓ ఆర్నెల్ల దాకా విశ్రాంతి తీసుకున్న గుణ.. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టు పని మొదలుపెట్టాడు. ‘రుద్రమదేవి’ చివర్లోనే ‘ప్రతాపరుద్రుడు’ పేరుతో తన తర్వాతి సినిమాను తెరకెక్కించబోతున్నట్లు హింట్ ఇచ్చాడు గుణ.

మధ్యలో ‘గోనగన్నారెడ్డి’ సినిమా తెరమీదికి వచ్చింది కానీ.. తర్వాత ఆ ప్రయత్నాలు పక్కనబెట్టేసి ‘ప్రతాపరుద్రుడు’ చేయడానికే రెడీ అయ్యాడు గుణ. ఈ సినిమాలో హీరో బాలకృష్ణ అని.. ప్రభాస్ అని.. రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఐతే ఆ రూమర్లన్నింటినీ ఖండించిన గుణ.. సైలెంటుగా స్క్రిప్టు మీద పని చేసుకుంటున్నాడు. ఇండియాలో చిట్టచివరి రాజు అయిన ప్రతాపరుద్రుడి గురించి తెలుసుకునేందుకు లైబ్రరీల మీద పడ్డాడు. చరిత్రకారుల్ని కలుస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఓ అద్భుతమైన పుస్తకం దొరికిందట. శతాబ్దం కిందట, 1910లో రాసిన ‘హిందూ మహాయుగము’ అనే పుస్తకాన్ని సంపాదించాడు గుణ. ఇందులో ప్రతాపరుద్రుడి గురించి కూడా చాలా సమాచారం ఉందట. ఈ పుస్తకం తన సినిమాకు చాలా ఉపయోగపడుతుందని సంబరపడుతున్నాడు గుణ. ఈ విషయాన్ని ట్విట్టర్లో కూడా షేర్ చేసుకుని సంతోషించాడు గుణ. మొత్తానికి ‘ప్రతాపరుద్రుడు’ కోసం గుణ బాగానే కష్టపడుతున్నాడన్నమాట.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14186/Gunasekhar-got-a-book-100-years-old-#sthash.Cc3IwteK.dpuf

ఆ సినిమా బడ్జెట్ కంటే రీమేక్ రేటు ఎక్కువ

ఆ సినిమా బడ్జెట్ కంటే రీమేక్ రేటు ఎక్కువ
పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి.. సెన్సేషనల్ హిట్టయింది ‘క్షణం’ సినిమా. టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు వచ్చినన్ని ప్రశంసలు మరే సినిమాకూ రాలేదు. ఇండస్ట్రీ జనాలందరూ కూడా ఈ సినిమా గురించి మాట్లాడ్డానికి చాలా ఉత్సాహం చూపించారు. బాలీవుడ్లో సైతం ‘క్షణం’ హాట్ టాపిక్ అయింది. తరణ్ ఆదర్శ్ లాంటి వాళ్లు ఈ సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. పీవీపీ సంస్థ బాలీవుడ్ సెలబ్రెటీలకు ఈ సినిమా స్పెషల్ షో వేసి చూపించింది. ఆ షో చూసి వెంటనే పొట్లూరి వరప్రసాద్ చేతిలో అడ్వాన్స్ పెట్టేశాడట బాలీవుడ్ బడా ప్రొడ్యూరసర్ సాజిద్ నడియాడ్ వాలా. ఈ సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తం రీమేక్ రైట్స్ కింద ఇచ్చినట్లు సమాచారం.

రేటు ఎంత అని చెప్పలేదు కానీ.. సాజిద్ ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి ‘క్షణం’ రీమేక్ రైట్స్ తీసుకున్న మాట వాస్తవమని స్వయంగా హీరో అడివి శేషే చెప్పాడు. ఐతే ‘క్షణం’ బాలీవుడ్ రీమేక్‌లో తనే నటించబోతున్న విషయాన్ని అతను ఖండించాడు. ‘క్షణం’ కారణంగా తనకు బాలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వస్తున్న మాట వాస్తవమని.. ఐతే ‘క్షణం’ రీమేక్ లో మాత్రం తాను నటించట్లేదని చెప్పాడు శేష్. అసలు ఆ సినిమాలో ఎవరు నటించబోతున్నారో కూడా తనకు తెలియదన్నాడు. ‘క్షణం’ కథ రాయడంతో పాటు.. డైరెక్టర్ రవికాంత్ పేరెపుతో కలిసి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా రాశాడు శేష్. మరి పీవీపీ భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు.. రీమేక్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా భారీగా ఆదాయం తెస్తున్న నేపథ్యంలో అందులో శేష్ కు ఎంత వాటా ఇస్తున్నారో మరి.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14187/Remake-Rights-more-than-the-movie-budget#sthash.qlb5haXn.dpuf

పవన్‌కే పంచ్ పడితే..

పవన్‌కే పంచ్ పడితే..
చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటారు. ప్రెస్ మీట్లు పెట్టినపుడు మన సినీ తారలు.. రాజకీయ నాయకులు ఈ తరహాలోనే మాట్లాడుతుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ లక్షణం ఎక్కువుంటుంది. మీడియా వాళ్లు ఏదైనా ఇబ్బందికర ప్రశ్న వేస్తే.. వాళ్ల మీదికి పంచ్‌లు విసిరేస్తుంటారు. జర్నలిస్టులకు పొలిటికల్ ఉద్దేశాలు ఆపాదించి.. పంచ్‌లు వేయడం మన నాయకులకు బాగానే అలవాటు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ నాయకుడే కదా.. మన పొలిటికల్ లీడర్ల తరహాలోనే పంచ్ వేయబోయాడు. ఐతే ఓ విలేకరి ఆయనకు తిరిగి పంచ్ వేసి షాకిచ్చాడు.

నిన్న పవన్ కళ్యాణ్ అనుకోకుండా ఓ ప్రెస్ మీట్ పెట్టి విలేకరులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ విలేకరి పవన్‌ను రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న వేశాడు. దీంతో పవన్‌కు కోపం వచ్చేసింది. ‘‘మీరు సినిమా జర్నలిస్టా.. పొలిటికల్ జర్నలిస్టా’’ అంటూ పంచ్ వేశాడు. ఐతే ఆ విలేకరి ఏమాత్రం తొణక్కుండా.. ‘‘మీరు సినీ హీరో అలాగే పొలిటీషియన్ కద సార్’’ అన్నాడు. అంతే పవన్ ఇక దీని మీద ఏమీ మాట్లాడ్డానికి వీల్లేకపోయింది. అయినా మొన్న బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చినపుడు సినిమాల మీదా మాట్లాడాడు.. రాజకీయాల ప్రస్తావన కూడా తెచ్చాడు పవన్. మరి ఆమె దగ్గర లేని ఇబ్బంది.. మన తెలుగు జర్నలిస్టుల దగ్గర ఏమొచ్చింది..? వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వాళ్లిష్టం.. పబ్లిక్ లైఫులోకి వస్తే ఏమైనా అంటాం.. అన్నాడో మహాకవి. అలాగే ప్రెస్ మీట్ పెట్టినపుడు జర్నలిస్టులు కూడా ఏ ప్రశ్న అయినా అడగొచ్చండోయ్.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14190/Pawan-shocks-with-Journalists-Punch#sthash.jRGcykjt.dpuf

ఆ సినిమా గోపీచంద్ చేసుంటేనా...

ఆ సినిమా గోపీచంద్ చేసుంటేనా...
ఎవరో చేయాల్సిన సినిమాలు ఇంకెవరి చేతికో వెళ్లడం ఇండస్ట్రీలో మామూలే. ఈ మధ్య రిలీజైన ‘కృష్ణాష్టమి’ సినిమా ముందు బన్నీ దగ్గరికి వెళ్లింది. తర్వాత సునీల్ దగ్గరికొచ్చింది. అంతకంటే ముందు ‘లోఫర్’ కూడా నితిన్ నుంచి వరుణ్ ‌తేజ్‌ దగ్గరికి వచ్చింది. ఆ రెండు సినిమాల ఫలితాలు చూశాక బన్నీ, నితిన్‌లిద్దరూ హమ్మయ్య అనుకునే ఉంటారు.

ఐతే ఇలా హమ్మయ్య అనిపించే సినిమాలతో పాటు.. హీరోలు రిగ్రెట్ అయ్యేలా చేసే సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ కోవలోని సినిమానే.. టెర్రర్. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఫామ్‌లో లోని శ్రీకాంత్ హీరోగా చేయడం వల్ల.. సరిగా ప్రమోట్ చేయకపోవడం వల్ల.. సినిమా కమర్షియల్ సక్సెస్ కాలేదు కానీ.. ఇందులో వేరే హీరో ఎవరైనా నటించి, సినిమాను బాగా ప్రమోట్ చేసి ఉంటే.. చాలా పెద్ద హిట్టే అయ్యేది. అంత పొటెన్షియాలిటీ ఉన్న సినిమానే ఇది.

ఐతే దర్శకుడు సతీశ్ కాశెట్టి నిజానికి ఈ సినిమా చేద్దామనుకున్నది గోపీచంద్‌తోనట. అతడికి స్క్రిప్టు కూడా వినిపించాడట. కానీ సీరియస్ సినిమాలు వదిలేసి, ఎంటర్టైనర్స్ చేసుకుంటూ వస్తున్న గోపీచంద్.. ‘టెర్రర్’ చేయడానికి ఒప్పుకోలేదట. పాటలు, కమర్షియల్ అంశాలు ఏమీ లేకపోవడంతో నో అనేశాడట. దీంతో సతీశ్.. శ్రీకాంత్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. శ్రీకాంత్ హీరో పాత్రను చాలా బాగానే చేశాడు కానీ.. అతడి మార్కెట్ బాగా పడిపోవడం వల్ల సినిమా జనాలకు రీచ్ కాలేకపోయిది. నిజంగా గోపీనే కనుక ఈ సినిమా చేసి ఉంటే.. సినిమా రేంజే వేరుగా ఉండేది
- See more at: http://telugu.gulte.com/tmovienews/14191/If-Gopichand-Do-Srikanths-Terror-#sthash.6dMhO5eo.dpuf

బన్నీ నిర్ణయంపై ఫ్యాన్స్ అసంతృప్తి!

బన్నీ నిర్ణయంపై ఫ్యాన్స్ అసంతృప్తి!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సరైనోడు'. ఈ సినిమా ఆడియోను విడుదల చేసి ఏప్రిల్ 22న సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే చిత్ర నిర్మాతలు మాత్రం సినిమా పాటల విడుదల కోసం ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేయకుండా ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 

ఈ విషయంపై బన్నీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడి ఆడియో ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఈ వార్త తెలిసి బన్నీ నిర్ణయం సరైనది కాదంటున్నారు. మరి బన్నీ ఫ్యాన్స్ కోసం తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో లేదో చూడాలి. అయితే చిత్రబృందం ఏప్రిల్ రెండో వారంలో విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14192/Fans-upset-with-Sarainodu-Audio-launch-cancelled-news#sthash.QowZgMe9.dpuf

బాబాయ్ నా ఇన్స్పిరేషన్ అంటున్న చరణ్!

బాబాయ్ నా ఇన్స్పిరేషన్ అంటున్న చరణ్!
తన కెరీర్ కు బాబాయ్ పవన్ కళ్యాన్ ఇన్స్పిరేషన్ అంటున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. రీసెంట్ గా చెర్రీ హైదరాబాద్ లోని ఓ కళాశాలలో ఫంక్షన్ కు అతిథిగా వెళ్ళాడు. అక్కడ స్టూడెంట్ ను ఇన్స్పైర్ చేసేలా.. ప్రేమ గురించి పెళ్లి గురించి, చదువు గురించి మాట్లాడాడు. ప్రేమించడం తప్పు కాదని అయితే ముందు కెరీర్ బిల్డ్ చేసుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండని స్టూడెంట్స్ కు చెప్పాడు. నేను ఉపాసన ప్రేమించుకున్నప్పుడు స్టేటస్ లు చూసి ప్రేమించుకోలేదని.. స్టేటస్ లు చూసి ఎప్పుడూ ప్రేమించకూడదని చెప్పడంతో పాటు.. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, లవ్, కెరీర్ విషయంలో కేర్ తీసుకోమని స్టూడెంట్స్ కు సలహా ఇచ్చాడు.

అంతేకాకుండా తన జీవితానికి పవన్ కళ్యాన్ ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పాడు. ఇరవైయేళ్ళ వయసులో చరణ్ అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడట. ఆ సమయంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పిలిచి గంటసేపు మాట్లాడరంట. అప్పుడే తనకు జీవితమంటే ఏంటో అర్ధమయిందని చరణ్ చెప్పాడు. అమ్మా నాన్న నా జీవితానికి ఎంత ఆదర్శమో… నా కెరీర్ కు బాబాయ్ ఇనిస్పిరేషన్ కూడా అంతే ఉందని చెర్రీ చెప్పుకొచ్చాడు. 
- See more at: http://telugu.gulte.com/tmovienews/14193/Ramcharan-about-Relation-with-Pawan#sthash.3mi3NaE2.dpuf

బన్నీకు హ్యాండ్ ఇవ్వడు కదా..?

బన్నీకు హ్యాండ్ ఇవ్వడు కదా..?
తమిళంలో సంగీత దర్శకుడు అనిరుధ్ కు మంచి క్రేజ్ ఉంది. ఇదే క్రేజ్ తో తనకు తెలుగులో పలు ఆఫర్లు వచ్చాయి. కాని అనిరుధ్ మాత్రం తెలుగు సినిమాలకు పని చేయకుండా తప్పించుకుంటున్నాడు. ముందుగా రాంచరణ్ తన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో అనిరుధ్ తో మ్యూజిక్ చేయించాలనుకున్నాడు కానీ కుదరకపోవడంతో తన ప్లేస్ లో యువన్ శంకర్ రాజా తో మ్యూజిక్ చేయించాడు. అలాగే నితిన్, త్రివిక్రమ్ సినిమా 'అ..ఆ' సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు అనుకున్నారు. కాని మధ్యలో నుండి అనిరుధ్ వెళ్ళిపోయాడు. 

తాజాగా బన్నీ, లింగుస్వామీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సినిమాకైనా అనిరుధ్ మ్యూజిక్ చేస్తాడా.. లేదా మధ్యలోనే వెళ్ళిపోతాడో చూడాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కొత్త హీరోయిన్ ను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ 'సరైనోడు' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బన్నీ, లింగుస్వామి ల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది!
- See more at: http://telugu.gulte.com/tmovienews/14195/Will-Anirudh-work-with-Allu-Arjun#sthash.R7k6wikq.dpuf

'సర్దార్‌' మూడు నిమిషాల్లో మోత మోగిపోద్ది

'సర్దార్‌' మూడు నిమిషాల్లో మోత మోగిపోద్ది
నలభై సెకన్ల టీజర్‌తోనే అభిమానుల్ని ఉర్రూతలూగించిన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఇక థియేట్రికల్‌ ట్రెయిలర్‌తో ఫాన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ పీక్స్‌కి తీసుకెళ్లిపోబోతున్నాడు. 171 సెకన్ల నిడివి వుండే థియేట్రికల్‌ ట్రెయిలర్‌ చూసిన వారు ఉత్సాహం ఆపుకోలేకపోతున్నారు. ఇంతవరకు పవన్‌ సినిమాల ట్రెయిలర్లన్నీ ఒకెత్తు, ఇదొక్కటీ ఒక రేంజు అంటూ సన్నిహిత వర్గాలు ఊగిపోతున్నాయి. డైలాగుల నుంచి యాక్షన్‌ వరకు, కామెడీ నుంచి డాన్స్‌ మూమెంట్స్‌ వరకు ఏదీ మిస్‌ అవకుండా ట్రెయిలర్‌లోనే సినిమా చూపించేయబోతున్నాడట దర్శకుడు బాబీ. ఈ ఒక్క ట్రెయిలర్‌ ఓకే చేయడానికి దాదాపు యాభై కట్స్‌ రెడీ చేసి చూపించాడట ఎడిటర్‌.

ట్రెయిలర్‌తో సినిమాపై వున్న అంచనాలు అమాంతం వందింతలు పెరిగిపోవాలనేది టార్గెట్‌గా పెట్టుకుని మరీ ఈ ట్రెయిలర్‌ కట్‌ చేయించారట. ట్రెయిలర్‌ ఫైనల్‌ ఎడిట్‌ చూసిన పవన్‌కళ్యాణ్‌ కూడా చాలా ఇంప్రెస్‌ అయి బాబీని, ఎడిటర్‌ని ప్రశంసించాడట. సినిమా ఎలా వుండబోతుందో మూడు నిమిషాల్లో చూపించేసారంటూ ఇద్దరికీ కితాబులు ఇచ్చారట. ఆ ట్రెయిలర్‌ ఏంటనేది మనం చూడాలంటే మాత్రం మరి కొన్ని గంటలు వేచి చూడక తప్పదు. ఈలోగా ఆ ట్రెయిలర్‌ చూసిన వారు చేసే హైప్‌ చూసి అంచనాలు పెంచుకోవాల్సిందే.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14196/Sardaar-Gabbar-singh-Trailer-length-in-3-mins#sthash.EmRC7yvS.dpuf

పవన్‌ అంతే... రెండో మాట ఉండదు

పవన్‌ అంతే... రెండో మాట ఉండదు
పవన్‌కళ్యాణ్‌ కనిపించగానే చిరంజీవితో సంబంధాల గురించి, రాంగోపాల్‌వర్మ ట్వీట్ల గురించి అడిగేసి, అతను టంగ్‌ స్లిప్‌ అయితే దుమారం రేపవచ్చు అని చూసిన వారికి అతను ఛాన్సే ఇవ్వలేదు. చిరంజీవితో సంబంధాల గురించి ప్రశ్న కూడా రాకుండా పవన్‌ తెలివిగా ముందే చిరంజీవిని సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఆడియో లాంఛ్‌కి పిలిచినట్టు చెప్పాడు. అక్కడితో ఆగకుండా అన్నయ్యపై తనకున్న సెంటిమెంట్‌ని చాటుకుంటూ 'గబ్బర్‌సింగ్‌' ఆడియో కూడా ఆయనే లాంఛ్‌ చేశారని గుర్తు చేసాడు. ఇంకాస్త సెంటిమెంట్‌ జోడిస్తూ చాలా కాలం తర్వాత తను రాసిన కథ ఇదే కనుక ఈ చిత్రానికి అతిథిగా అన్నయ్య వస్తే బాగుంటుందని ఫీలయ్యానని అన్నాడు. దీంతో ఇక ప్రెస్‌మీట్‌లో చిరంజీవి ప్రస్తావన తేవాల్సిన అవసరమే మీడియాకి కనిపించలేదు. 

ఇక రాంగోపాల్‌వర్మ విషయాన్ని ప్రస్తావించి, ఆయన ట్వీట్ల గురించి స్పందించమంటే ఆయన అభిప్రాయాల్ని తాను గౌరవిస్తానని పవన్‌ అన్నాడు. అంతకుమించి ఒక్క మాట కూడా లేదు. తన ట్వీట్స్‌ గురించి పవన్‌ కనుక ఏదైనా వెటకారం చేస్తే ఇక రాంగోపాల్‌వర్మకి కొన్ని రోజుల పాటు వార్తల్లో వుండడానికి స్టఫ్‌ దొరికేది. అటు వర్మకి ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా, ఇటు మీడియాకి కూడా దాని గురించి కవర్‌ చేయడానికి పెద్ద విషయమేం లేకుండా పవన్‌ సింపుల్‌గా తేల్చేసాడు. దీంతో వర్మ కూడా తాను పవన్‌కి అందరికంటే పెద్ద అభిమానినని చెప్పుకుని ఆ మేటర్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టడం తప్ప దానిని ముందుకి లాగలేకపోయాడు.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14197/Pawan-About-RGv-and-chiranjeevi-in-pressmeet#sthash.0QZbJHUm.dpuf

అల్లు అర్జున్‌తో చెయ్యట్లేదని తేల్చేసాడు

అల్లు అర్జున్‌తో చెయ్యట్లేదని తేల్చేసాడు
సూర్యతో వంద కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమా ప్లాన్‌ చేస్తోన్న త్రివిక్రమ్‌ అది మొదలు పెట్టేలోగా ఆరు నెలల్లో ఒక సినిమా పూర్తి చేసేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. దీంట్లో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తాడని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో నాగార్జునతో ఒక స్పెషల్‌ క్యారెక్టర్‌ చేయిస్తున్నారనే పుకార్లు కూడా స్టార్ట్‌ అయ్యాయి. ఊపిరి సినిమాలో కార్తీతో కలిసి నటించిన నాగార్జున ఇప్పటి యువతరంతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా వున్నట్టు టాక్‌ వుంది. 

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌తో చేయడానికి నాగ్‌ అంగీకరించారనే ప్రచారం మొదలైంది. కానీ అలాంటిదేం లేదని నాగార్జున తేల్చేసారు. తనని ఎవరూ సంప్రదించలేదని, అయినా ఇప్పుడు కొత్త సినిమాలు టేకప్‌ చేసే తీరిక లేదని ఆయన చెప్పారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో భక్తిరస చిత్రం చేయబోతున్న నాగార్జున దాని తర్వాత 'సోగ్గాడే చిన్ని నాయనా' సీక్వెల్‌ అయిన 'బంగార్రాజు' చేస్తారట. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే నాగ్‌ తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తారట. సో అల్లు అర్జున్‌, నాగార్జున కలిసి చేస్తున్నారనే పుకార్లకి ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టేసుకోవచ్చు.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14198/Nagarjuna-clarifies-On-Multistarrer-rumors-with-allu-arjun#sthash.fYsOMcCs.dpuf

పవన్‌కళ్యాణ్‌ని ప్రశ్నించడానికి భయపడ్డారా?

పవన్‌కళ్యాణ్‌ని ప్రశ్నించడానికి భయపడ్డారా?
పవన్‌కళ్యాణ్‌ చాలా కాలం తర్వాత సినిమా మీడియాని కలిసాడు. ఈమధ్య కాలంలో పొలిటికల్‌ ప్రెస్‌మీట్లు మాత్రమే పెడుతోన్న పవన్‌కళ్యాణ్‌ సినిమా మీడియాతో ముచ్చటించాడు. అయితే ప్రెస్‌మీట్‌కి సరిగ్గా రెండు గంటల ముందు న్యూస్‌ రావడంతో ఆయనని ఏమి అడగాలనే దానిపై ఎవరూ ప్రిపేర్‌ అయి వెళ్లినట్టు లేరు. ఇది సినిమా ప్రెస్‌మీట్‌ అంటూ ఇక్కడ సినిమాల గురించి మాత్రమే మాట్లాడతానని చెప్పిన పవన్‌కళ్యాణ్‌ని పదే పదే రాజకీయాలకి సంబంధించిన ప్రశ్నలే వేసారు. ఇదిలావుంటే ఈ ప్రెస్‌మీట్‌ పెట్టడానికి సరిగ్గా మూడు రోజుల ముందు నుంచీ సెట్లో కమెడియన్‌ షకలక శంకర్‌పై పవన్‌ చేయి చేసుకున్నాడనే వదంతులు వినిపిస్తున్నాయి. 

దీనిని చాలా వెబ్‌సైట్లు కవర్‌ చేసాయి. అయితే ఏ ఒక్కరూ కూడా అది నిజమా కాదా అని పవన్‌కళ్యాణ్‌ అడిగే ధైర్యం మాత్రం చేయలేకపోయారు. చాలా కాలం తర్వాత తమ ముందుకి వచ్చిన పవన్‌ని కాంట్రవర్షియల్‌ క్వశ్చన్స్‌తో చిరాకు పెడితే ఎక్కడ లేచి వెళ్లిపోతాడో లేక మళ్లీ ప్రెస్‌మీట్‌ పెట్టడో అనుకున్నారో కానీ ఒక హాట్‌ టాపిక్‌ గురించి డిస్కషన్‌ రాకుండానే పవన్‌ ప్రెస్‌మీట్‌ ముగిసింది. సినిమా జర్నలిస్టులంటే జంకారని అనుకోవచ్చు. అక్కడ పొలిటికల్‌ జర్నలిస్టులున్నా కానీ ఇలాంటివి అడిగేందుకు ఎవరూ సాహసించకపోవడం విశేషమే.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14199/Media-Afraid-Of-Pawan-to-ask-about-Shakalaka-Shankar#sthash.VHFJ9sxn.dpuf

పవన్ వ్యతిరేకించే చిరంజీవి, ప్రేమించే చిరంజీవి

పవన్ వ్యతిరేకించే చిరంజీవి, ప్రేమించే చిరంజీవి
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. అదే టైంలో చిరంజీవి పవన్ గురించి ఏం మాట్లాడతాడో అని అంతా ఆత్రుతగా ఎదురుచూశారు. అందుకు తగ్గట్టుగానే చిరు ప్రసంగా సాగింది. తన తమ్ముడి గురించి.. ఇంతకుముందు ఎన్నడూ మాట్లాడని విధంగా అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే పవన్ కూడా తన అన్న గురించి మాట్లాడారు. ‘అన్నయ్య గురించి ఎంత మాట్లాడిన తక్కువే. అన్నయ్యపై నాకున్న ప్రేమను ఎన్నిసార్లని ప్రూవ్ చేసుకోగలను. ప్రతి సారి చెబుతున్నా. అన్నయ్య నా గుండెల్లో వున్నారు. తనపై వున్న ప్రేమను ఇంత అని చెప్పలేను’ అన్నారు.
అలాగే ‘సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి... ఈ రోజు ఓ స్టార్ గా అన్నయ్య ఎదగడానికి కారణం.. ఆయన పడిన కఠోరశ్రమే కారణం. నా లాంటి వాళ్లు ఇప్పుడు చాలా ఈజీగా స్టార్లైపోవచ్చు. దాని వెనుక అన్నయ్య పడిన శ్రమ ఎంతో వుంది. నేను హీరోగా ఎంటర్ అయినప్పుడు సినిమాలు చేయకపోయినా పర్వాలేదు... ఆయనకున్న పేరును మాత్రం చెడగొట్టరాదని అనుకున్నా. అన్నయ్య, వదిన నన్ను సినిమా హీరోగా వెళ్లాలని చెప్పినప్పుడు... పనిపాట లేకుండా తిరగుతున్న నాతో ఏదో ఓ పనిచేయించాలని వారు అలా చెప్పారనుకున్నా. కానీ... వారి నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయలేదు. ఎంతో కష్టపడి సినిమాలు చేస్తూ వస్తున్నా’ అన్నారు.

ఇంకా పవన్ మాట్లాడుతూ ‘అన్నయ్య పగలంతా కష్టపడి ఇంటికొచ్చి అలా షూస్ తో నిద్రపోయేవారు. నేను వాటిని తొలగించినప్పుడు సాక్సుల్లో నుంచి చెమట వాసన వచ్చేది. అది నాకు సువసనలానే అనిపించేది. ఎందుకుంటే.. కష్టంలో నుంచి వచ్చిన చెమట అయినా నాకు సువసనతో సమానమే. ఆ రోజుల్లో అన్నయ్య అంత కష్టపడాల్సిన పనిలేదు. కానీ.. ఆయన మా కోసం... ఇండస్ట్రీ బాగుకోసం ఎంతో కష్టపడ్డారు. అన్నయ్య సినిమా ఇండస్ట్రీని, అలాగే ఆయన నిజాయతీ ఎంతలా వుంటుంది అనేదినికి ఓ ఉదాహరణ చెబుతాను. ఓ రోజు సినీ వారపత్రిక రోడ్డుపై పడివుంటే.. దాన్ని అందరూ తొక్కేస్తూ అలా వెళ్లిపోతున్నారు. వెంటనే అన్నయ్య చూసి.. ఆ వారపత్రిక కవర్ పేజీపై వున్న ఫొటోను తుడిచి భద్రంగా ఎత్తిపెట్టారు. అప్పుడే నాకు అర్థమైంది. అన్నయ్యకు ఇండస్ట్రీ అంటే ఎంత ప్రేమో. ఆ కవర్ పేజీలో వున్నది ఇతర హీరో అయినా... అన్నయ్య ఎంతో డెడికేషన్ తో దాన్ని తొక్కకుండా భద్రపరిచారని’ తెలిపారు.

ఇంకా మాట్లాడుతూ ‘నాకు అన్నయ్యతో రాజకీయ పరంగా విభేధాలుండొచ్చేమో కానీ.. అన్నయ్యగా మాత్రం నా గుండెల్లో వుంటాడు. దాన్ని నేను ప్రతి సారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు సినీ జీవితాన్నిచ్చిన అన్న, వదినలను మరువలేను’ అన్నారు.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14200/Pawan-kalyan-About-Chiranjeevi-Pawan-Sardaar-Audio-Launch#sthash.YQqNm0n8.dpuf