shorte links

Wednesday, March 16, 2016

u&i entertainments face book

www.facebook.com/UandIEntertainments

u&i entertainments ని face book లో like చేయండి u&i entertainments updates మీ face book timeline లోకి పొందండి
 

U&I ENTERTAINMENTS


u & i entertainments 

https://www.youtube.com/channel/UCm7szjKyFlLFAMKHURoa5eA

మోహన్ బాబు మంచి నిర్ణయం

మార్చి 19.. విలక్షణ నటుడు మోహన్ బాబు జన్మదినం ప్రతి సంవత్సరం తిరుపతిలో తాను నెలకొల్పిన విద్యానికేతన్ స్కూల్లో జన్మదిన వేడుకలు చేసుకుంటారు మోహన్ బాబు. జిల్లాలోని ఎందరో ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా వచ్చి శుభాకాంక్షలు చెబుతుంటారు. బొకేలు బహుమతులు ఇస్తుంటారు. ఐతే ఇకపై అలాంటి కట్టిపెట్టమంటున్నారు మోహన్ బాబు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఇలా వృథా ఖర్చు చేయొద్దని.. దాని బదులు ఆ డబ్బులతో మంచి పని చేయమని చెబుతున్నారాయన. మిరాకిల్ అనే స్వచ్ఛంద సంస్థకు సహకారం అందించమని తన అభిమానులు - శ్రేయోభిలాషులకు పిలుపునిచ్చారు మోహన్ బాబు.

‘‘1993 నుండి ప్రతి పుట్టినరోజును విద్యానికేతన్ లో పిల్లల మధ్య జరుపుకోవడం అలవాటు. ఐతే ప్రతి పుట్టినరోజున శుభాకాంక్షలతో పాటు వందల సంఖ్యల పుష్పగుచ్చాలు - పూల దండలు అందుకుంటాను. అవి మరుసటి రోజుకు వాడిపోతాయి. చెత్తకుప్పలో పడేస్తాం. ఐతే ఈ ఏడాది నుంచి బొకేలు - పూలదండలు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నా. ఎవరూ నా కోసం అవి తీసుకురాకండి. దాని బదులు ఆ డబ్బుల్ని మిరాకిల్ ఫౌండేషన్ కు అందజేయండి. ఇటీవల మిరాకిల్ ఫౌండేషన్ ను సందర్శించి వారు సమాజానికి అందిస్తున్న తోడ్పాటు చూసి ఇంప్రెస్ అయ్యాను. 3000 మంది ఆనాథ పిల్లలకు తమ వంతుగా సహాయ సహాకారాలను అందిస్తున్నారు. ఇలాంటి సంస్థలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నా పుట్టినరోజు కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని సదరు మిరాకిల్ ఫౌండేషన్ సంస్థకు పంపండి’’ అని మోహన్ బాబు ఓ ప్రకటనలో చెప్పారు.

ఏదేదో ఊహించుకోవద్దంటున్న రేణు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ బొంబాయిలో ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టేసారు. అయితే ఈ చిత్రానికి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం వలనే బొంబాయిలో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారనే వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ విడిపోయినా ఈ సినిమాతో మళ్లీ దగ్గరవుతున్నారని ఫ్యాన్స్ సంబరపడ్డారు. 

అయితే రేణు తాజాగా చేసిన ఓ ట్వీట్ తో అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లింది. ఆమె ట్వీట్ లో పవన్ సినిమా ప్రస్తావన లేక పోయినా.. ఆమె ఉద్దేశ్యం మాత్రం ఆ సినిమా గురించే అని అంటున్నారు. నాకు సంబంధించిన ఏ విషయం అయినా.. నిజమైతే నేనే ట్విట్టర్ ద్వారా తెలియచేస్తాను. అంతే కానీ ఏదేదో ఊహించుకోకండి అంటూ ట్వీట్ చేసింది. దీంతో పవన్ సినిమాకు రేణు నిర్మాతగా వ్యవహరిస్తుందో.. లేదో అనే అనుమానంలో అభిమానులున్నారు

అమ్మకు కోపంతో short film (Funny Satire on NTR Nannaku Prematho)


Watch Ammaku Kopamtho Funny Comedy Satires on NTR Nannaku Prematho written and directed by Sukumar.

Singham123 Full Movie For Free - Sampoornesh Babu | Vishnu Manchu



Singham123 Full Movie - Sampoornesh Babu | Vishnu Manchu - HD
The ultimate foolhardy cop ever seen on Indian screen or even world cinema for that matter, is set to blaze silver screens this summer. Having watched umpteen cop flicks every now and then, if you think you’ve seen them all. Then it’s time to rethink, because, here comes the guy who will leave you in awe! 
Singham 123 is a spoof action comedy starring Sampoornesh Babu playing the role of a “Sensational”, “Seductive”, “Supercop”. Set in the backdrop of a village called Singarayakonda which is ruled by a self proclaimed king and mafia-lord, Lingham. He fancies himself as the destructive force and an archenemy of Law and Order. After several failed attempts by Indian Police throughout the decade, Singham123 is assigned the mission impossible: to arrest Lingham. 
Will Singham 123 be successful in completing the mission? 

Story, Screenplay and Producer – Vishnu Manchu
Director – Akshat Ajay Sharma
Cinematography – Satish Mutyala 
Editor – M R Varma
Music – Seshu KMR
Dialogues – Diamond Ratnam
Fight Master – P. Satish
Cast:
Sampoornesh Babu
Bhavani
Sanam Prasad
Annapurna 
Prudvi Raj
Viva Harsha

బంగారం-వెండి

బంగారం-వెండి
మంగళవారం ట్రేడింగ్‌ ముగిసే సరికి తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు హైదరాబాద్‌, విజయవాడ, ప్రొద్దుటూరు, రాజమండ్రి, విశాఖపట్నం తమిళనాడులో బంగారం, వెండి ధరలు కింది విధంగా ఉన్నాయి.

నమ్మాల్సింది నాన్ననా.. నిజాల్నా?

నమ్మాల్సింది నాన్ననా.. నిజాల్నా? 
ప్ర: నాకిప్పుడు ముప్ఫై మూడేళ్లు. నేను దేశ విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకున్నా. ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. మాది సంపన్న కుటుంబం. నాకు కాబోయే భర్త స్థాయికి తగ్గట్టు ఉండాలని నాన్న చాలా సంబంధాలు చూశారు. ఈ మధ్య ఓ అబ్బాయి నచ్చడంతో నిశ్చితార్థం చేశారు. పెళ్లికి ఇంకా సమయం ఉంది. ఈలోపు మా ఫోటోలను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో స్నేహితులతో పంచుకున్నప్పుడు ఒకరిద్దరు.. అతని గురించి ప్రతికూలంగా చెప్పారు. మొదట నేను నమ్మక పోయినా ఎందుకైనా మంచిదని ఆరా తీశా. వ్యసనాలూ, అక్రమ సంబంధాలతోపాటూ, అప్పులూ ఉన్నట్టు తేలింది. అదే విషయాన్ని ఇంట్లో చెబితే నాన్న నమ్మకపోగా.. అసలు పట్టించుకోవట్లేదు. ‘చాలా ఏళ్లకు మంచి సంబంధం దొరికింది. లేనిపోని ఆరోపణలు నమ్మి పెళ్లి వద్దనడం సరికాదు’ అంటున్నారు. ఇంత జరిగాక ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. అలాగని ఆప లేకపోతున్నా. ఏదైనా సలహా ఇవ్వండి.
- ఓ సోదరి
జ:ఉన్నత చదువు కోసం దేశవిదేశాలు చుట్టొచ్చిన మీకు భిన్న వ్యక్తులూ, మనస్తత్వాలూ, సంస్కృతుల పరిచయం కొత్త కాదు. ఈ నేపథ్యంలో అలవాట్లూ, పోకడలనీ గమనించే ఉంటారు. అలాంటి మీరు సమస్యని ఎదుర్కోవడం పెద్దకష్టమని అనుకోవద్దు. అంతకంటే ముందు మీరు కెరీర్‌లో స్థిరపడాలనీ, మీ కంటూ ఉనికిని ఏర్పరచుకోవాలని ఆరాటపడ్డారు. మరోవైపు మీరు అన్ని రకాలుగా విజయం సాధించడం కోసం నాన్నా తాపత్రయపడ్డారు. అండగానూ నిలిచారు. కానీ వివాహ విషయంలోనే కొన్ని విషయాలు మిమ్మల్ని ముల్లులా గుచ్చుకుంటున్నాయని ఉత్తరం సూచిస్తోంది. సరితూగే సంబంధం అనుకుని పెళ్లి ఖాయం చేశారు. కానీ నమ్మి అతడిని అల్లుడిగా మనస్ఫూర్తిగా స్వీకరించాక.. ఆరోపణల్ని మీ నాన్న లెక్కచేయట్లేదు. అవి నిజం కావచ్చు.. అని కూడా ఆలోచించలేకపోతున్నారు. పైగా వారు ఇప్పటికే పెళ్లి ఆలస్యమైందన్న ఆదుర్దాలోనూ ఉన్నారనీ అర్థమవుతోంది. ఇప్పటికే వయసు మించిపోయిందనీ...ఇలా, రకరకాల కోణాల్లో ఆలోచిస్తూ అలా మాట్లాడుతున్నారేమో గమనించండి.
ఇన్నాళ్లపాటూ మీరు తీసుకున్న నిర్ణయాలను సమర్థించి ప్రోత్సహించిన వారు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోండి. ఒక వేళ మీరు చెప్పింది వాళ్లకి నిరాధారంగా అనిపించిందేమో అడిగి చూడండి.
ఇది అమ్మానాన్నలు తెచ్చిన సంబంధమే అయినా.. అతని విషయంలో చీకటి కోణాలు ఉంటే.. తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో బయటపడక తప్పదు. నిశ్చితార్థమైనంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. కానీ ఈ బంధం పెళ్లిగా పరిణమించకముందే అన్నీ తెలుసుకున్న మీరు స్పష్టంగా, సాక్ష్యాధారాలతో సహా మీ తల్లిదండ్రులకు చెప్పడం మంచిది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఎన్నో స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్న మీకు కీలకమైన పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఇంకొంత స్థిరత్వం.. దృఢత్వం కావాలి. తల్లిదండ్రుల్ని కాదనలేక మొహమాటంతో చేసుకుంటే.. భవిష్యత్‌లో సమస్యలొస్తే ఎదుర్కోవాల్సింది మీరే. పరస్పరం నమ్మకం, గౌరవం, విశ్వాసం లేని బంధాలు.. బలహీనమైన పునాదులతో నిర్మించిన ఇళ్ల వంటివి. అలాంటివి ఏ మాత్రం నిలబడతాయో మీరే ఆలోచించుకోండి. ఇక నాన్న నమ్మకం గురించి కూడా ఆలోచించండి. ఇద్దరి వాదనల్లో ఏది నిజమో మీరు తప్పక తెలుసుకోవాలి. నిజమో, భ్రమో అన్న వూహల్ని పక్కన పెట్టి.. వాస్తవికంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇలాంటి విషయాల్లో స్పష్టత వచ్చాకే నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఇకపోతే ఈ రోజుల్లో ఉద్యోగాల్లో నిలదొక్కుకుంటున్న ఆడపిల్లల్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు. ఈనేపథ్యంలో మీకు తగ్గ వ్యక్తి దొరుకుతాడేమో ప్రయత్నించడంలో తప్పులేదు. పొసగకుండా.. వైవాహిక బంధంలో అడుగుపెట్టి.. విడాకుల వరకూ వెళ్లడం సరికాదు. ఇది మిమ్మల్నీ, మీ తల్లిదండ్రుల్ని మరింతగా బాధ పెడుతుంది. అదే విషయాన్ని వారితో చెప్పి.. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసి నిర్ణయాలు తీసుకోండి.

ఒకటో నెంబర్‌ జట్టు నిలబడితే ఒట్టు

ఫేవరెట్‌ కథ అడ్డం తిరిగింది 
ఒకటో నెంబర్‌ జట్టు నిలబడితే ఒట్టు 
టీ20 ప్రపంచకప్‌ ఆరంభ పోరులో భారత్‌ బోల్తా 
దిమ్మదిరిగే షాకిచ్చిన కివీస్‌ స్పిన్నర్లు 
79 పరుగులకే చేతులెత్తేసిన ధోనీసేన 
47 పరుగుల తేడాతో అనూహ్య పరాజయం 
127.. ఇదీ ఒక లక్ష్యమేనా? టాప్‌ఆర్డరే వూదేయదూ..!ఓ 15 ఓవర్లయితే సరిపోవూ!కివీస్‌ 20-30 పరుగులు ఎక్కువ చేసి ఉన్నా బావుండే..!ప్రపంచకప్‌ ఆరంభ పోరు మరీ ఇంత ఏకపక్షంగా సాగడమా!...ఇలాంటి ఆలోచనలే కలిగి ఉంటాయి భారత అభిమానులకు!కానీ ఆ ఆలోచనలన్నీ తల్లకిందులు కావడానికి ఎంతో సమయం పట్టలేదు!
స్పిన్‌ మన బలం.. కానీ అదే బలహీనతగా మారింది. స్పిన్‌ మన ఆయుధం.. కానీ అదే మనపైకి బూమరాంగ్‌ అయింది. న్యూజిలాండ్‌ కోసం తవ్విన ‘స్పిన్‌’ గోతిలో మన జట్టే పడిపోయింది. స్పిన్‌ ఆడటంలో సమర్థులుగా పేరున్న మన బ్యాట్స్‌మెన్‌.. ఆ ఉచ్చులోనే చిక్కుకుని విలవిలలాడిపోయారు. టీ20 ప్రపంచకప్‌ హాట్‌ ఫేవరెట్‌గా తొలి మ్యాచ్‌లో అడుగుపెట్టిన ధోనీసేనను అతి సామాన్య జట్టుగా మార్చేసింది న్యూజిలాండ్‌. మన బ్యాట్స్‌మెన్‌ నిర్లక్ష్యపు ఆటనే ఆసరాగా చేసుకున్న కివీస్‌ స్పిన్నర్లు.. టీమ్‌ఇండియాకు దిమ్మదిరిగే షాకిచ్చారు. భీకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత్‌ను కేవలం 79 పరుగులకే కుప్పకూల్చి.. పరాభవం మిగిల్చారు. పిచ్‌ ఎంతగా స్పిన్నర్లకు అనుకూలించినప్పటికీ.. పరిస్థితులకు తగ్గట్లు ఆడకుండా నిర్లక్ష్యపు షాట్లతో వికెట్లు చేజార్చుకున్న మన పేరు గొప్ప బ్యాట్స్‌మెన్‌దే ఈ ఓటమి బాధ్యత!
నాగ్‌పుర్‌
టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనే అనూహ్య ఫలితం! సొంతగడ్డపై.. బలమైన జట్టుతో.. భారీ అంచనాల మధ్య.. హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. వూహించని విధంగా బోల్తా కొట్టింది. మంగళవారం నాగ్‌పుర్‌లో స్పిన్నర్ల ఆధిపత్యం సాగిన మ్యాచ్‌లో భారత్‌ 47 పరుగుల తేడాతో కివీస్‌ చేతిలో పరాభవం చవిచూసింది. 127 పరుగుల తక్కువ లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 79 పరుగులకే కుప్పకూలింది టీమ్‌ఇండియా. 30 పరుగులు చేసిన కెప్టెన్‌ ధోనీనే టాప్‌స్కోరర్‌. అతను, కోహ్లి (23), అశ్విన్‌ (10) మినహా ఎవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు. కివీస్‌ స్పిన్నర్లు శాంట్నర్‌ (4/11), ఇష్‌ సోధి (3/18), నాథన్‌ మెక్‌కలమ్‌ (2/15) భారత్‌ పతనాన్ని శాసించారు. 18.,1 ఓవర్లకే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. అంతకుముందు కివీస్‌ 20 ఓవర్లలో 126 పరుగులు చేసింది. అండర్సన్‌ (34; 42 బంతుల్లో 3×4) రాణించాడు. శాంట్నర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. భారత్‌ శనివారం తన తర్వాతి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొంటుంది.
నిలిస్తేగా..: 5, 1, 1, 4, 1, 0, 0, 0.. ధోని, కోహ్లి, అశ్విన్‌ కాకుండా మిగతా ఆటగాళ్ల స్కోర్లివి. మన బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం గురించి ఇంతకంటే చెప్పేదేముంది? నాగ్‌పుర్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించిన మాట వాస్తవమే, కివీస్‌ స్పిన్నర్లు కూడా తెలివిగా బౌలింగ్‌ చేశారు. కానీ.. టీమ్‌ఇండియా ఓటమికి అసలు కారణం బ్యాట్స్‌మెన్‌ బాధ్యతారాహిత్యమే. కివీస్‌ స్పిన్నర్లకు ఆత్మవిశ్వాసాన్నందించింది.. భారత్‌ ఓటమికి పునాది వేసింది.. మన బ్యాట్స్‌మెనే. భారత్‌ కోల్పోయిన తొలి నాలుగు వికెట్లూ.. బ్యాట్స్‌మెన్‌ చేజేతులా సమర్పించుకున్నవే. ధావన్‌ (1) అడ్డంగా ఆడేసి వికెట్ల ముందు దొరికిపోతే.. రోహిత్‌ (5) చివరి ఓవర్లలో బ్యాటింగ్‌ చేస్తున్నట్లు ఆవేశంగా ముందుకు ఉరికి స్టంపౌటైపోయాడు.. రైనా (1), యువరాజ్‌ (4) అనాలోచితమైన షాట్లతో చేజేతులా వికెట్లిచ్చేశారు.. అయినా కోహ్లి, ధోని ఉన్నారులే అన్న భరోసా! కానీ కీలక సమయంలో కోహ్లి కూడా ఔటైపోయాడు. అతను ఇష్‌ సోధి వేసిన చక్కటి బంతికి పెవిలియన్‌ చేరిపోయాడు. ఇక ఆ తర్వాత ధోని ఎంత పట్టుదల ప్రదర్శించినా ఫలితం లేకపోయింది. పాండ్య (1), జడేజా (0)లకు కూడా క్రీజులో నిలిచే ఉద్దేశమే కనిపించలేదు. అశ్విన్‌.. ధోనికి అండగా నిలిచినా సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగా పెరిగిపోవడంతో భారత్‌ అవకాశాలు సన్నగిల్లిపోయాయి. బంతి బ్యాట్‌ మీదకు రాకపోవడంతో ఛేదన అసాధ్యమని ముందే తేలిపోయింది. ధోని ఒకట్రెండు షాట్లు ఆడాడు కానీ.. అప్పటికే ఆలస్యమైపోయింది. 15 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని తొమ్మిదో వికెట్‌ రూపంలో వెనుదిరగడంతో భారత్‌ కథ ముగిసింది.
కివీస్‌ వ్యూహం మార్చుకుని..: అంతకుముందు టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌.. దూకుడుగా ఆడి భారత్‌ను ఆత్మరక్షణలోకి నెట్టేద్దామని చూసింది. కానీ ఆ వ్యూహం బెడిసికొట్టింది. తొలి ఓవర్లోనే రెండు సిక్సర్లు బాదారు ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌. కానీ ఒకటిన్నర ఓవర్లకే రెండు వికెట్లు కూడా పడ్డాయి. దీంతో కివీస్‌ వ్యూహం మార్చుకుని పరిస్థితులకు తగ్గట్లు నెమ్మదిగా ఆడి.. గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది.
ఆ 9 బంతుల్లో డ్రామా: మ్యాచ్‌లో హైలైట్‌ అంటే తొలి 9 బంతుల్లో సాగిన డ్రామానే. స్టేడియంలో ప్రేక్షకులు.. టీవీల్లో వీక్షకులు కుదురుకునే లోపే మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు జరిగిపోయాయి. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనా ఉండటంతో ధోని.. నేరుగా అశ్విన్‌కు కొత్త బంతి అందించాడు. అతనలా బంతి వేశాడో లేదో.. కివీస్‌ ఓపెనర్‌ గప్తిల్‌ బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి పంపించేశాడు. అందరూ ఆశ్చర్యంలో ఉండగానే.. అశ్విన్‌ దెబ్బకు దెబ్బ తీశాడు. రెండో బంతికే గప్తిల్‌ (6)ను వికెట్ల ముందు బలిగొన్నాడు. ఐతే రీప్లేలో బంతి వికెట్‌కు తాకేది కాదని తేలింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మున్రో (7).. ఆశ్చర్యకర రీతిలో రివర్స్‌ స్వీప్‌తో సిక్సర్‌ బాది అశ్విన్‌కు షాకిచ్చాడు. ఐతే తర్వాతి ఓవర్లో నెహ్రా మూడో బంతికి మున్రోను ఔట్‌ చేశాడు. మొత్తంగా 9 బంతుల్లో 2 సిక్సర్లు.. 2 వికెట్లతో మ్యాచ్‌కు ఆసక్తికర ఆరంభం లభించింది.
దూకుడు మంత్రం పని చేయకపోవడంతో ఆ తర్వాత కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి బ్యాటింగ్‌ చేశారు. ధోని తెలివిగా బౌలింగ్‌ మార్పులు చేస్తూ.. కివీస్‌ బ్యాట్స్‌మెన్‌కు మరింతగా ఇబ్బందులు సృష్టించాడు. బుమ్రా, రైనా, జడేజా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. మరోవైపు వికెట్ల పతనం కూడా ఆగలేదు. రైనా తన బౌలింగ్‌తో, ఫీల్డింగ్‌తో కివీస్‌ను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. విలియమ్సన్‌ (8)ను స్టంపౌట్‌ చేయించిన అతను.. టేలర్‌ (10)ను రనౌట్‌ చేశాడు. ఐతే పరిస్థితులకు తగ్గట్లు ఓపిగ్గా బ్యాటింగ్‌ చేసిన అండర్సన్‌.. కివీస్‌ స్కోరును వందకు చేరువ చేశాడు. అతను ఔటయ్యాక కివీస్‌ మళ్లీ ఇబ్బంది పడ్డప్పటికీ.. చివర్లో రోంచి (21 నాటౌట్‌; 11 బంతుల్లో 2×4, 1×6) మెరవడంతో భారత్‌కు సవాలు విసిరే లక్ష్యాన్ని నిర్దేశించింది.
5
టీ20ల్లో భారత్‌ జట్టు కివీస్‌తో ఐదు మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో ఓడిపోయింది
నగుబ్యాటు 
ధావన్‌ (1) 
ఎల్బీ(బి) నాథన్‌ 
తొలి ఓవర్లో నాథమ్‌ మెక్‌కలమ్‌ బంతిని అడ్డంగా స్వీప్‌ చేసి అడ్డంగా దొరికిపోయాడు ధావన్‌. అప్పటికి స్కోరు పదే. మరో రెండు పరుగులైనా చేరాయో లేదో మరో రెండు వికెట్లు పెవిలియన్‌ చేరాయి. టీమ్‌ఇండియా ఒక్కసారిగా ఒత్తిడిలోకి కూరుకుపోయింది. పూర్తిగా వెనుకంజలో పడింది.


రోహిత్‌ (5) 
(స్టంప్డ్‌) రోంచి (బి) శాంట్నర్‌ 
సారి ఎడమచేతి వాటం స్పిన్నర్‌ శాంట్నర్‌ చుట్టేశాడు. మూడో ఓవర్లో రోహిత్‌ శర్మ, రైనాలను బోల్తా కొట్టించాడు. శాంట్నర్‌ బంతిని చాలా ముందుకొచ్చి లెగ్‌సైడ్‌ ఆడబోయిన రోహిత్‌ గురి తప్పాడు. స్టంపౌటయ్యాడు. ఇక రైనా అయితే మిడ్‌వికెట్లో ఓ లడ్డూ లాంటి క్యాచ్‌ వెనుదిరిగాడు. కాస్త వెనక్కి జరిగే అడ్డంగా తిరిగి ఆడబోయిన రైనా.. బంతి బ్యాటు అంచుకు తగలడంతో గప్తిల్‌కు చిక్కి బ్యాటు చంకన పెట్టుకున్నాడు.

రైనా (1) 
(సి)గప్తిల్‌ (బి) శాంట్నర్‌ 
బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎక్కువ అవకాశాలు రావట్లేదని బాధపడుతున్న యువరాజ్‌ ఇప్పుడు అవకాశం వచ్చినా పేలవంగా ఆడి ఆలస్యం చేయకుండా ఆత్రంగా పెవిలియన్‌ చేరిపోయాడు. మరోవైపు ఉన్న కోహ్లికి కనీస సహకారం ఇవ్వలేకపోయాడు. మెక్‌కలమ్‌ ఫ్లైటెడ్‌ డెలివరీని ముందుకొచ్చి ఆడిన అతడు అటు ఇటూ కొట్టకుండా నేరుగా అతడి చేతికే అందించాడు. వికెట్లు పోతున్నా భారత్‌ ఆశలతో సాగిందంటే కారణం కోహ్లినే. కానీ 9వ ఓవర్లో సోధి చక్కని లెగ్‌ బ్రేక్‌కు అతడూ వెనుదిరగడంతో భారత్‌ వేగంగా పతనం దిశగా అడుగులేసింది. అప్పటికి స్కోరు 39/5. తర్వాతి రెండు ఓవర్లలో పాండ్య, జడేజా వచ్చినంత వేగంగా పెవిలియన్‌ బాట పట్టారు. కొన్ని బంతులు దొరక్కకుండా స్పిన్‌ చేశాక.. శాంట్నర్‌ నేరుగా, వేగంగా వేసిన బంతికి పాండ్య చిక్కాడు. బ్యాక్‌ఫుట్‌పై బ్యాటును గుడ్డిగా వూపేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. పట్టుదల కొరవడిన జడేజా.. సోధి బంతిని ఫ్రంట్‌ఫుట్‌పై లెగ్‌సైడ్‌ ఆడబోయి దెబ్బతిన్నాడు. అప్పటికి ధోని క్రీజులోనే ఉన్నా.. కివీస్‌ బౌలింగ్‌ చూస్తుంటే 43/7తో ఉన్న భారత్‌ ఓటమి తప్పించుకోలేదని తేలిపోయింది.
‘‘బ్యాట్స్‌మెనే ముంచారు. షాట్‌ సెలెక్షన్‌ చాలా దారుణంగా ఉంది. పరిస్థితులను కివీస్‌ బాగా సద్వినియోగం చేసుకుంది. పిచ్‌కు తగ్గట్టు ఆటను అన్వయించుకోవడంలో విఫలమయ్యాం’’
- ధోని
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్తిల్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 6; విలియమ్సన్‌ (స్టంప్డ్‌) ధోని (బి) రైనా 8; మున్రో (సి) పాండ్య (బి) నెహ్రా 7; అండర్సన్‌ (బి) బుమ్రా 34; రాస్‌ టేలర్‌ రనౌట్‌ 10; శాంట్నర్‌ (సి) ధోని (బి) జడేజా 18; ఇలియట్‌ రనౌట్‌ 9; రోంచి నాటౌట్‌ 21; నాథన్‌ మెక్‌కలమ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126; వికెట్ల పతనం: 1-6, 2-13, 3-35, 4-61, 5-89, 6-98, 7-114; బౌలింగ్‌: అశ్విన్‌ 4-0-32-1; నెహ్రా 3-1-20-1; బుమ్రా 4-0-15-1; రైనా 4-0-16-1; జడేజా 4-0-26-1; పాండ్య 1-0-10-0
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌శర్మ (స్టంప్డ్‌) రోంచి (బి) శాంట్నర్‌ 5; శిఖర్‌ ధావన్‌ ఎల్బీ (బి) నాథన్‌ మెక్‌కలమ్‌ 1; కోహ్లి (సి) రోంచి (బి) సోధి 23; రైనా (సి) గప్తిల్‌ (బి) శాంట్నర్‌ 1; యువరాజ్‌ (సి) అండ్‌ (బి) మెక్‌కలమ్‌ 4; ధోని (సి) మెక్‌కలమ్‌ (బి) శాంట్నర్‌ 30; పాండ్య ఎల్బీ (బి) శాంట్నర్‌ 1; జడేజా (సి) అండ్‌ (బి) సోధి 0; అశ్విన్‌ (స్టంప్డ్‌) రోంచి (బి) సోధి 10; నెహ్రా (బి) మిల్నె 0; బుమ్రా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (18.1 ఓవర్లలో ఆలౌట్‌) 79; వికెట్ల పతనం: 1-5, 2-10, 3-12, 4-26, 5-39, 6-42, 7-43, 8-73, 9-79; బౌలింగ్‌: నాథన్‌ మెక్‌కలమ్‌ 3-0-15-2; అండర్సన్‌ 3-0-18-0; శాంట్నర్‌ 4-0-11-4; ఇలియట్‌ 2-0-9-0; మిల్నె 2.1-0-8-1; సోధి 4-0-18-3

అమ్మాయి... శిక్ష

నపై అత్యాచారం జరిపిన ఆరుగురు అబ్బాయిలను శిక్షించిన ఓ అమ్మాయి కథతో మా చిత్రం తెరకెక్కిందన్నారు రామచంద్ర దోసపాటి. ఆయన కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘అమ్మాయి ఆరుగురు’. ఆశాలత కథానాయిక. జి.మురళీప్రసాద్‌ దర్శకత్వం వహించారు. చిత్రాన్ని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విలేకరుల సమావేశంలో రామచంద్ర దోసపాటి మాట్లాడుతూ ‘‘చిన్నప్పట్నుంచీ నటించాలనే కోరిక ఉంది. అది ఈ చిత్రంతో నెరవేరింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో హారర్‌ అంశాల్నీ జోడించాం. కథ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం సినిమాకి ప్రధానాకర్షణ. నా తదుపరి చిత్రాన్ని కూడా రెండు నెలల్లో మొదలెడతా. దానిలో మంచి పాత్రలో కనిపిస్తా. ఇతర నిర్మాతల చిత్రాల్లోనూ నటించాలనుంద’’న్నారు.

అలియాకి సిద్దార్థ్‌ ఇచ్చిన గిఫ్ట్‌..

ముంబయి: బాలీవుడ్‌ బబ్లీగర్ల్‌ అలియా భట్‌ 23వ పుట్టినరోజు నేడు. మీ పుట్టినరోజును ఎక్కడ జరుపుకోనున్నారు అని మీడియా అడిగిన ప్రశ్నకు.. దిల్లీలో అని తడుముకోకుండా చెప్పింది అలియా. అందులో వింతేముంది అంటారా..? నటుడు సిద్దార్థ్‌ మల్హోత్రా పుట్టింది కూడా దిల్లీలోనే..! వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని బాలీవుడ్‌ వర్గాలు కోడై కూస్తున్నా సిద్దార్థ్‌ నాకు ఎప్పటికీ స్నేహితుడే.. అని చెబుతోంది అలియా. ఓ పక్క ప్రేమ పుకార్లను ఖండిస్తూనే మరో పక్క సిద్దార్థ్‌తో కలిసి ఎంచక్కా చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు సిద్దార్థ్‌ అలియాను తాను పుట్టి పెరిగిన దిల్లీకి తీసుకెళ్లి ఇప్పటివరకు అలియా చూడని ప్రదేశాలను చూపించనున్నాడట. వీరిద్దరూ కలిసి నటించిన కపూర్‌ అండ్‌ సన్స్‌ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

సల్మాన్‌ని ఎలాగైనా పెళ్లికి ఒప్పిస్తా..

ముంబయి: ఇప్పటివరకు సల్మాన్‌ కుటుంబీకులు చేయలేని పనిని తాను చేసి చూపిస్తానంటున్నాడు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌. ఇంతకీ ఆ పనేమిటంటే సల్మాన్‌ని పెళ్లికి ఒప్పించడం అని చెబుతున్నారు. 50 ఏళ్లు వచ్చినా బాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో సల్మాన్‌ ఒకడు. ప్రస్తుతం సల్మాన్‌ రొమేనియన్‌ మోడల్‌ లులియా వ్యాంటూర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. లులియాకి హిందీ నేర్పించాలని సల్మాన్‌ ప్రత్యేక ట్యూషన్లుకూడా పెట్టించనున్నాడని అంతకుముందు వార్తలు వెలువడ్డాయి. ఎన్ని లవ్‌ ఎఫైర్స్‌ ఉన్నా సల్మాన్‌ పెళ్లి విషయం మాత్రం ప్రస్తావించడంలేదు అందుకే ఈ సారి ఎలాగైనా సల్మాన్‌ని పెళ్లికి ఒప్పిస్తానని ఆమీర్‌ పట్టుబట్టాడు. మరి ఈ విషయంలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ గెలుస్తాడో లేదో చూడాలి!

వేసవిలో ప్రేక్షకులకు ‘బ్రహ్మోత్సవం’?

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. హరిద్వార్‌, ఉదయ్‌పూర్‌లలో ఈ చిత్రం లాంగ్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందని మహేశ్‌బాబు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆయన అభిమానులతో పంచుకుంటూ సెట్‌లో తీసిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. లాంగ్‌ షెడ్యూల్‌ తరువాత, చివరికి నగరానికి చేరుకున్నామని... ఇంకా కొంచెం షూటింగ్‌ మిగిలి ఉందని ట్వీట్‌ చేశారు. చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి పొట్లూరి, మహేశ్‌బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమంత, కాజల్‌, ప్రణీత కథానాయికలు. మిక్కీ జె మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

షూటింగ్ కాసింతే పెండింగ్- మహేష్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ టీం నార్త్ అంతా చుట్టేసి ఇప్పుడు సౌత్ కి వచ్చేశారు. ప్రధాన సన్నివేశాల కోసం హరిద్వార్ - ఉదయపూర్ వంటి ప్రాంతాల్లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది బ్రహ్మోత్సవం యూనిట్. ఇక్కడితో పోల్చితే వేడిగా ఉండే ప్రాంతాల్లో షూటింగ్ చేసుకుని వచ్చినా వెంటనే ఇక్కడ కూడా షూట్ ప్రారంభించేయడం విశేషం. ఇప్పటికే హైద్రాబాద్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 

హరిద్వార్ - ఉదయపూర్ లలో షూటింగ్ కు సంబంధించ కొన్ని ఫోటోలను మహేష్ స్వయంగా ట్వీట్ చేశాడు. 'హరిద్వార్ - ఉదయపూర్ లలో సుదీర్ఘమైన షెడ్యూల్ పూర్తి చేసుకుని తిరిగొచ్చేశాం. ఇంకా కొంత షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది' అంటూ ట్వీట్ చేశాడు మహేష్. నార్త్ ఇండియాకి వెళ్లిన సమయంలో మహేష్-సమంతల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ తో పాటు.. జనసమ్మర్దంలో చిత్రీకరించే సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. బ్రహ్మోత్సవంలో సమంతతో పాటు కాజల్ అగర్వాల్ - ప్రణీతలు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని... పీవీపీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న బ్రహ్మోత్సవంను.. మే నెలలో విడుదల చేయబోతున్నారనే వార్తలు ఉన్నా.. షూటింగ్ ప్రోగ్రెస్ పై కాసిన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని సీన్స్ మాత్రమే పెండింగ్ అని మహేష్ తేల్చేయడంతో.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కానున్నాయనే విషయం ఖాయమైంది.

ఎన్టీఆర్ కి యాక్సిడెంటా?!

టాలీవుడ్ లో ఓ వార్త కలకలం సృష్టిస్తోంది. ముంబైలో జనతా గ్యారేజ్ షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ జరిగిందన్న వార్తే ఆ కలకలానికి కారణం. షూటింగ్ జరుగుతుండగా అనుకోకుండా ప్రమాదం చోటు చేసుకొందని అందులో ఎన్టీఆర్ గాయపడ్డాడని చెప్పుకుంటున్నారు. ఆ వార్త ఎక్కడనుంచో పుట్టుకు రాలేదు. జనతా గ్యారేజ్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ పేజీలోనే ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అన్న విషయం పోస్ట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ అభిమానులు తెలుగు ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందారు. నిజమా అని కనుక్కునే ప్రయత్నం జరుగుతున్నప్పుడే ఆ అకౌంట్ ఇన్ యాక్టివేట్ అయ్యింది. దీంతో మరింత గందరగోళానికి గురయ్యే పరిస్థితి తలెత్తింది. నిజంగానే ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ జరిగిందా లేదంటే అకౌంట్ని ఎవరైనా హ్యాక్ చేశారా అన్నది తేలాల్సి వుంది. 

అయినా ఇప్పుడు ఎన్టీఆర్ కి సెట్ లో యాక్సిడెంట్ జరిగే అవకాశమే లేదని సినిమా షెడ్యూల్ గురించి తెలిసిన కొద్దిమంది చెబుతున్నారు. ఎన్టీఆర్ - నిత్యమీనన్ లపై ప్రస్తుతం ముంబైలో సన్నివేశాలు తీస్తున్నారని ఫైట్ అన్నా తీస్తుంటే ఎన్టీఆర్ గాయపడ్డాడన్న వార్తకి బలం చేకూరేదని సన్నివేశాలే కాబట్టి యాక్సిడెంట్ కి అవకాశమే లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ కోసం ఈమధ్యే  ముంబై వెళ్లాడు ఎన్టీఆర్. మరో రెండు మూడు రోజుల్లో తిరిగిరానున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఓ స్టూడియోలోనే నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతుంది

10 కోట్లకు చేరిన నిఖిల్ మార్కెట్..

హ్యాపీడేస్ మూవీలో నలుగురిలో ఒకడిగా పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సృష్టించుకుని దూసుకుపోతున్నాడు కుర్ర హీరో నిఖిల్. శంకరాభరణం అంటూ ఫ్లాప్ కొట్టినా.. దానికి ముందు హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హిస్టరీ ఉండడంతో.. నిఖిల్ స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం నిఖిల్ మొత్తం మూడు ప్రాజెక్టులకు సైన్ చేసేశాడు. వీటిలో ఒకటి ఇప్పటికే షూటింగ్ కూడా జరపుకుంటోంది. 

టైగర్ తో గుర్తింపు పొందిన వీఐ ఆనంద్ తో నిఖిల్ ఓ మూవీ చేస్తున్నాడు. దీని షూటింగ్ మే నెలలో పూర్తి కానుండగా.. జూలైలో రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఇది కాకుండా మరో రెండు సినిమాలు కూడా నిఖిల్ ఖాతాలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలకు నిఖిల్ కి హిట్ ఇచ్చిన డైరెక్టర్లే చేస్తుండడం విశేషం. స్వామి రారా చిత్రాన్ని తీసిన సుధీర్ వర్మ - కార్తికేయ మూవీని అందించిన చందులతో నిఖిల్ సినిమాలు చేయనున్నాడు. ఇవి ఒకదాని వెనుక స్టార్ట్ కానుండగా.. ముందు ఎవరు స్క్రిప్ట్ రెడీ చేస్తే ఆ సినిమా చేస్తానని నిఖిల్ చెప్పాడు. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న మూవీకి బిజినెస్ కంప్లీట్ అయిపోయింది. రెండు రాష్ట్రాల రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ కొనుగోలు చేసింది. పది కోట్లు రిటర్న్ గ్యారంటీ ఆ పై వచ్చిన మొత్తాన్ని సగంసగం పంచుకునే ఒప్పందంతో బిజినెస్ క్లోజ్ చేశారు. దీంతో నిర్మాతకు 4 కోట్లు టేబుల్ ప్రాఫిట్ ముట్టినట్లు తెలుస్తోంది. మూవీ యావరేజ్ గా నిలిచినా.. శాటిలైట్ తో కలుపుకుంటే పది కోట్లు గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. అంటే ప్రస్తుతం నిఖిల్ మార్కెట్ ని 10 కోట్లు అని ఇండస్ట్రీ లెక్క

వెంకీ ఐటెమ్ గాళ్ ఎవరంటే?

బంగారంలాంటి బాబు అందో లేదంటే మరొకటి అందో తెలియదు కానీ...  వెంకటేష్ని తెగ పొగిడేస్తూ పాటేసుకుంది ఓ ముద్దుగుమ్మ. ఆ పాట ఆల్ మోస్ట్ ఐటెమ్ పాటలాగా ఉంటుందట. అవడానికి హీరో ఇంట్రడక్షన్ సాంగే అయినా... అందులో తన టాలెంటుని కూడా  చూపించిందట ఆ ముద్దుగుమ్మ. అసలు వెంకీతో పాడిన ఆ భామ ఎవరబ్బా అని ఆరా తీస్తే సుశాంత్ హీరోయిన్ అని తేలింది. సుశాంత్ కథానాయకుడిగా ఆటాడుకుందాం రా అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో కథానాయికగా సోనమ్ బజ్వా నటించింది. ఆమే ఇప్పుడు వెంకీకి ఐటెమ్ గాళ్ అయ్యింది. ఈమె ఆ ఆఫర్ అందుకోవడానికి కారణం మారుతి అండ్ టీమ్ తో కనెక్షన్ ఉండటమే. 

ఇదివరకు మారుతి కప్పల్ అనే తమిళ సినిమాని `పాండవుల్లో ఒకడు` పేరుతో తెలుగులో విడుదల చేశాడు. అందులో హీరోయిన్గా సోనమ్ బజ్వా నటించింది. ఆ సమయంలో సోనమ్ తో పరిచయం ఏర్పడటంతో ఇటీవల తాను దర్శకత్వం వహిస్తున్న వెంకీ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడన్నమాట మారుతి. కానీ చాలామంది వెంకీ ఐటెమ్ గాళ్ పూనమ్ బజ్వా అనుకుంటున్నారు.  మొత్తంగా  ఓ డబ్బింగ్ మూవీతో వచ్చి సైలెంట్ గా రెండు క్రేజీ ఆఫర్లు అందుకున్న సోనమ్ ఘటికురాలే. మరి మునుముందు అమ్మడు ఇంకే రేంజిలో రెచ్చిపోతుందో చూడాలి. 

ఎన్టీఆర్ కు ఏమవ్వలేదు: యూనిట్ క్లారిటీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ మూవీ షూటింగ్ లో.. జూనియర్ కు యాక్సిడెంట్ అయిందన్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. అసలు యాక్సిడెంట్ అయేందుకు అవకాశం లేదని... ప్రస్తుతం ముంబై షెడ్యూల్ లో స్టంట్స్ ఫైట్స్ లాంటివేవీ ఈ షెడ్యూల్ లో షూట్ చేయడం లేదని ఇప్పటికే యూనిట్ వర్గాలు తేల్చేశాయి. ఇప్పుడిదే అంశంపై అధికారికంగా క్లారిటీ ఇచ్చింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. 

'జనతా గ్యారేజ్ గురించి అన్ని అధికారికమైన వార్తలను ఈ ఐడీ ద్వారా ఈ పేజ్ లో అందిస్తాం. దయచేసి ఫేక్ అకౌంట్లను ఫాలో అయ్యి రూమర్లను నమ్మకండి.'  అంటూ ట్వీట్ చేశారు నిర్మాతలు. మైత్రి సంస్థ నుంచి వచ్చిన ఈ క్లారిటీతో జూనియర్ కు గాయాలయ్యాయనే వార్తలు రూమర్స్ అని తేలిపోయింది. జూనియర్ కు యాక్సిడెంట్ వార్తలు ఆందోళన కలిగించినా.. యూనిట్ నుంచి స్పష్టమైన ప్రకటన చేయడం ఎన్టీఆర్ కు ఏం కాలేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

జనతా గ్యారేజ్ మూవీలో జూనియర్ కు జంటగా సమంత - నిత్యామీనన్ లు నటిస్తుండగా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఐఐటీ-ముంబై స్టూడెంట్ గా ఎన్టీఆర్ కనిపించనుండగా.. ఆగస్ట్ 12న విడుదల చేసేలా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. 

సర్దార్ ట్రైలర్ లోనే ఆ స్టెప్?

అందరూ ఇప్పుడు ''సర్దార్'' విషయంలో ట్రైలర్ కోసమే చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఎలాగో మార్చి 20న సినిమా ఆడియో రిలీజ్ అవ్వబోతోంది కాబట్టి.. ఖచ్చితంగా అప్పుడే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు. ఇక ఈ ట్రైలర్ లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి అనే విషయంపై ఇప్పుడు చాలానే వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా సర్దార్ట్రైలర్ లో డైలాగులకు కొదవలేదట. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ ఎన్ని పంచ్ లు వేయొచ్చో అన్ని వేశాడట. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి చేసిన 'వీణ' స్టెప్ ను పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం రిపీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్టెప్ ను కూడా మనోడు ఈ ట్రైలర్ లో చూపిస్తాడట. చూపించేశాడట. డబ్బింగ్ రూమ్ నుండి వినిపిస్తున్న రూమర్ల ప్రకారం.. ఆ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. 

ఇకపోతే ట్రైలర్ మొత్తానికీ దేవిశ్రీప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం కూడా హైలైట్ అని తెలుస్తోంది. కేవలం ఒకే ఒక్క షాట్ లో కాజల్ అగర్వాల్ ను చూపించారట. మిగిలిన విషయాలన్నీ మనకు ట్రైలర్ రిలీజ్ అయితే కాని తెలియదు మరి. 

ఇండో-పాక్ లవ్.. అదిరిందిగా..

ఇండియా-పాకిస్తాన్.. ఈ రెండు దేశాలు ఏ అంశంపై ఒక చోటకు చేరినా అదో  ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరగడంతో.. రెండు దేశాల మధ్య ఆసక్తి తారాస్థాయికి చేరిపోయింది. ఏ చిన్న టాపిక్ అయినా ట్రెండింగ్ అయిపోతోంది. ఈ ట్రెండ్ ను క్యాష్ చేసుకునేందుకు ఓ ప్రముఖ టీ పొడి తయారు చేసే సంస్థ యాడ్ రూపొందించింది. 

భారతీయ యువతి టెన్నిస్ సంచలనం సానియా మీర్జా-పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు కలిసి నటించడం విశేషం. రియల్ లైఫ్ లో భార్యా భర్తలైన వీరిద్దరితో యాడ్ రూపొందించడమే కాదు.. దాన్ని విభిన్నంగా డిజైన్ చేసి ఇద్దరి మధ్య ఉన్న టేస్ట్ లలో తేడాలను ప్రస్తావించింది. ప్రతీ విషయంలోనూ వాదులాడుకుంటూ ఉంటారు వీరు. సచిన్ స్ట్రైడ్ డ్రైవ్ సూపర్ అని సానియా అంటే షోయబ్ అక్తర్ వేసే యార్కర్ కి ఓటేస్తాడు షోయబ్. ముల్తాన్ సోనా హల్వా బాగుంటుందని షోయబ్ చెబ్తే.. అమృత్ సర్ లడ్డూకి వేరేదేదీ సాటి లేదని సానియా అంటుంది. 

బాలీవుడ్ పాత పాటలు సానియా మీర్జా అంటే.. పాకిస్తాన్ పాప్ సాంగ్స్ అదుర్స్ అంటున్నాడు షోయబ్. కానీ ఇద్దరూ మాత్రం ఓ బ్రాండ్ టీ దగ్గరకు వచ్చేసరికి కలిసిపోతారు. కాన్సెప్టే కాదు.. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రిలీజ్ చేసిన ఈ యాడ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. 

ఫొటోస్: కరీనా కపూర్ ఫోటో షూట్

ఇక్కడ కూడా దంచుతావా పవన్?

ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.. ఎలాగో బాలీవుడ్ మీడియాకు ఒక పెద్ద ఇంటర్యూ ఇచ్చేశాడు. సో.. సినిమా రిలీజ్ లకు ముందు ఇంటర్యూలు ఇవ్వడూ (అంటే రిలీజ్ అయ్యాక కూడా ఇవ్వడులే) అనే సెంటిమెంట్ ఏమీ లేదు. అలాంటప్పుడు తెలుగు మీడియాలో కూడా దంచేస్తాడా మరి? 

నిజానికి బాహుబలి అండ్ శ్రీమంతుడు ప్రభావం మన సినిమాల మీద ఎలా ఉందో ఇప్పుడు ''సర్దార్'' అనురిస్తున్న స్ర్టాటజీ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే.. అదనపు ప్రమోషన్లు.. ఇంకా చెప్పాలంటే కాస్త శృతిమించిన ప్రమోషన్ల కారణంగా.. ఈ రెండు సినిమాలకూ విపరీతమైన కలెక్షన్లు వచ్చేశాయి. ముఖ్యంగా శ్రీమంతుడు సినిమానైతే మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా ఎన్నో ఇంటర్యూలు ఇచ్చి ప్రమోట్ చేశాడు. ఆ ప్రభావం సినిమా కలెక్షన్లు మీద కనిపించింది. చూస్తుంటే.. ఇప్పుడు సర్దార్ సినిమాను 80+ కోట్లు వెచ్చించి కొనుకున్న ఈరోస్ సంస్థ కూడా ఇలాగే పవన్ తో కూడా ప్రమోట్ చేయిస్తారేమో అనిపిస్తోంది. 

మరి బాలీవుడ్ కు ఇంటర్యూ ఇచ్చిన పవన్.. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా చిన్న చిన్న టివి ఛానళ్ళకు సైతం ఇంటర్యూలు ఇచ్చేసి సర్దార్ ను సూపర్ సక్సెస్ చేస్తాడా? చూద్దాం. 

తమిళ యాక్టర్ సూసైడ్ నోట్ లో ఏముంది?

తమిళ సినిమా.. టీవీ నటుడు సాయి ప్రశాంత్ ఈ మధ్యన సూసైడ్ చేసుకోవటం తెలిసిందే. 30 ఏళ్ల ఈ నటుడు సూసైడ్ చేసుకోవట ఇండస్ట్రీతో పాటు.. అభిమానులకు షాకింగ్ గా మారింది. ఆ మధ్యనే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నట్లు ఆ మధ్యన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన అతను.. ఆత్మహత్య చేసుకోవటం అందరిని కలిచి వేసింది.

తాజాగా ఆయన మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ఆయన రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సూసైడ్ నోట్ ప్రకారం.. తన మృతికి కారణం ఎవరూ బాధ్యులు కాదని చెప్పినప్పటికీ.. తన మరణానికి పరోక్ష కారణాన్ని చెప్పటం గమనార్హం. తన మరణానికి ఎవరినీ తప్పు పట్టాల్సిన పని లేదంటూనే.. తన భార్య సుజిత కోపం తగ్గించుకోవాలని పేర్కొనటం విశేషం.

ఈ సందర్భంగా ప్రశాంత్ రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్ లోని అంశాల్ని చూస్తే..

‘‘నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నా మరణం గురించి వర్రీ కావొద్దు’’

‘‘నీ మీద నా ప్రేమ.. నా మాటలన్నీ నిజం. ప్లీజ్ ఏడవొద్దు’’

‘‘నా చావుకు ఎవరూ కారణం కాదు’’

‘‘సుజిత నీ కోపం తగ్గించుకో’’

‘‘నా కూతురుకు మంచి నాన్నగా ఉండాలని భావిస్తున్నా. మిస్ యూ రక్షిత’’

‘‘పెళ్లి సమయంలో మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కి ఇచ్చిన రూ.5లక్షల కట్నం.. బంగారు నగలు.. వాటిని మీ వాళ్లకు తిరిగి ఇచ్చేస్తారు’’

‘‘నా ఆత్మహత్య వల్ల నీకు కానీ (సుజిత).. మీ ఫ్యామిలీకి కానీ ఎలాంటి సమస్యా రాదు’’

‘‘నాకెన్నో అవకాశాలు ఇచ్చిన రాడాన్ మీడియా.. సన్ నెట్ వర్క్ కి థ్యాంక్స్’’

సమంతకు మహేష్ కూతురు పెట్టిన కండిషన్

స్టార్ హీరోయిన్ సమంతకు అర్జెంటుగా ఓ కూతురు కావాలటండీ. అది కూడా మూడే మూడు రోజుల్లో ఓ పాప కావాలంటోంది. తన కొత్త ఫ్రెండును ఇంప్రెస్ చేయాలంటే శనివారం లోపు ఓ పాపను అరేంజ్ చేసుకోవాల్సిందే అంటోంది సామ్. సమంతకు ఈ కొత్త ఆలోచన ఎందుకొచ్చింది.. ఇంతకీ ఏంటి మేటర్ అంటారా? ఆ సంగతేంటో చూద్దాం పదండి.

ప్రస్తుతం సమంత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘బ్రహ్మోత్సవం’ షూటింగులో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. నార్త్ ఇండియాలో లాంగ్ షెడ్యూల్ ముగించుకుని కొన్ని రోజుల కిందట హైదరాబాద్ వచ్చేసింది ‘బ్రహ్మోత్సవం’ యూనిట్. ఇక్కడ తర్వాతి షెడ్యూల్ షూటింగులో ఉండగా ‘బ్రహ్మోత్సవం’ సెట్ కి ఓ ముఖ్యమైన అతిథి వచ్చింది. ఆ గెస్ట్ మరెవరో కాదు.. మహేష్ ముద్దుల కూతురు సితార.

బ్రహ్మోత్సవం సెట్లో సమంత - సితార కలిసి నిన్నంతా ఆడుకున్నారు. ఇద్దరూ కలిసి ఫొటోలు కూడా దిగారు. ఐతే ఆ తర్వాత సమంతకు టాటా చెబుతూ.. సితార ఓ కండిషన్ పెట్టిందట. మనిద్దరం శనివారం కూడా ఆడుకుందాం.. ఐతే ఆ రోజు నాతో కలిసి ఆడుకోవడానికి.. నీ పాపను కూడా తీసుకురా అని కండిషన్ పెట్టిందట సితార. మరి శనివారానికల్లా తనకో కూతురు కావాలని ఎలాగోలా ఎరేంజ్ చేసుకోవాలని అంటూ సరదాగా ట్వీట్ చేసింది సామ్. మరి సితార వచ్చేసరికి సమంత ఓ పాపను ఎలా అరేంజ్ చేసుకుంటుందో చూడాలి

బాలీవుడ్ లో పవన్ పరస్థితేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్.. తెలుగుతో పాటు అదే సమయంలో హిందీలో కూడా విడుదలవుతోంది. ఈ మేరకు ఇప్పటికే హిందీ సర్దార్ గబ్బర్ సింగ్ కి సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదల చేశారు. హిందీ రిలీజ్ కోసమే స్పెషల్ గా బాలీవుడ్ మీడియా పర్సన్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు పవన్. కానీ పవన్ బాలీవుడ్ లో సక్సెస్ సాధించగలడా అన్నదే అసలు ప్రశ్న. 

ఈరోస్ ఒత్తిడితో ఇలా హిందీ రిలీజ్ కు పవన్ ఒప్పుకోవాల్సి వచ్చింది. గతంలో ఇలాంటి ఎటెంప్ట్ పవన్ ఎప్పుడూ చేయలేదు. దబాంగ్ థీమ్ తో రూపొందే మూవీస్ లో అక్కడ సల్మాన్ ని చూడ్డం జనాలకు అలవాటు. ఇప్పుడు పవన్ వారికి పూర్తిగా కొత్త కావడంతో.. రిజల్ట్ పై సందేహాలున్నాయి. మరోవైపు మెగా ఫ్యామిలీకి బాలీవుడ్ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. చిరంజీవి తొలి హిందీ సినిమా ప్రతిబంధ్ పర్లేదనిపించినా.. ఆ తర్వాత ఆజ్ కా గూండారాజ్ - ది జెంటిల్మేన్ లు ఏ మాత్రం నిలబడలేకపోయాయి. ఇక రామ్ చరణ్ సంగతైతే చెప్పనక్కర్లేదు. జంజీర్ ని రీమేక్ చేసి మాటలు కూడా పడాల్సి వచ్చింది. 

మరి ఇలాంటి ట్రాక్ రికార్డ్ ను బద్దలు కొట్టి.. మెగా ఫ్యామిలీకి బాలీవుడ్ లో పవన్ హిట్ అందించగలడా అన్నది అసలు క్వశ్చన్. మరోవైపు సల్మాన్ ను చూడాల్సిన రోల్ లో ఆడియన్స్ పవన్ ను ఏ మాత్రం యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. అయితే.. ముందు కాళ్లు పైకి లేపి ఎగురుతున్న గుర్రంపై.. పవన్ వెనక నుంచి కనిపిస్తున్న పోస్టర్.. ఇప్పటికే బాలీవుడ్ లో ఆసక్తిని కలుగచేసిందని ఈరోస్ వర్గాలు అంటున్నాయి.

గుంటూరు టాకీస్ Movie Review



చిత్రం: గుంటూరు టాకీస్

నటీనటులు: నరేష్ - సిద్ధు - రష్మి గౌతమ్ - శ్రద్ధా దాస్ - మహేష్ మంజ్రేకర్ - రాజా రవీంద్ర  - రఘుబాబు - రవిప్రకాష్ - ఫిష్ వెంకట్ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్
ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి
మాటలు: ప్రవీణ్ సత్తారు - సిద్ధు
నిర్మాత: రాజ్ కుమార్
రచన - దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

ఎల్బీడబ్ల్యూ - రొటీన్ లవ్ స్టోరీ - చందమామ కథలు లాంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు ప్రవీణ్ సత్తారు. ఐతే ఆ సినిమాలేవీ కూడా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. దీంతో ఈసారి రూటు మార్చి.. అడల్ట్ కంటెంట్ బాగా దట్టించి.. ట్రెండీగా ఉండే క్రైమ్ కామెడీ జానర్ లో ‘గుంటూరు టాకీస్’ తెరకెక్కించాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ: 

భార్య ఎవరితోనో లేచిపోతే జబ్బు పడ్డ తల్లి - ఇద్దరు పిల్లల్ని పోషిస్తూ అసహనంతో జీవితాన్ని సాగించే గిరి (నరేష్) - ఓ లేడీ డాన్ నుంచి తప్పించుకుని వచ్చేసి సువర్ణ (రష్మి గౌతమ్) అనే అమ్మాయితో ఎఫైర్ నడుపుతూ లైఫ్ లాగించేస్తున్న హరి (సిద్ధు).. వీళ్లిద్దరూ ఓ మెడికల్ షాపులో పని చేస్తుంటారు. పగలంతా మామూలుగా కనిపించే వీళ్లు రాత్రవ్వగానే దొంగలుగా మారిపోయి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఐతే చాలీ చాలని డబ్బులతో ఇంకెన్నాళ్లు అనుకుంటున్న వీళ్లు.. ఓ రోజు రాత్రి రెండు ఇళ్లలో తలో ఐదు లక్షలు దొంగతనం చేస్తారు. అక్కడి నుంచి వాళ్ల జీవితం మలుపు తిరుగుతుంది. ఓవైపు పోలీసులు - మరోవైపు ఓ డాన్ మనుషులు వాళ్ల వెంట పడటం మొదలుపెడతారు. మరి వీళ్లందరి నుంచి హరి - గిరి ఎలా తప్పించుకున్నారు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 

ప్రవీణ్ సత్తారు ఇంతకుముందు తీసిన సినిమాలు కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకున్నా వాటిలో మంచి విషయాలు చాలానే కనిపించేవి. కథాకథనాలు కానీ.. పాత్రలు కానీ.. చాలా ప్రత్యేకంగా అనిపించేవి. ఐతే ఆ సినిమాల ఫలితాలు ప్రవీణ్ లో చాలా మార్పు తెచ్చేసినట్లున్నాయి. ఈసారి అసలు కంటెంట్ గురించి పట్టించుకోకుండా కుర్రాళ్లకు కిక్కెక్కించే అంశాల మీద మాత్రమే తన ఫోకస్ అంతా పెట్టాడు. ట్రైలర్లో.. ప్రోమో సాంగ్స్ లో రష్మి గౌతమ్ అలా రెచ్చిపోతుంటే.. అది కేవలం జనాల దృష్టిని ఆకర్షించడానికి చేసిన ప్రయత్నమేనని.. సినిమాలో అసలు కంటెంట్ వేరే ఉంటుందని అనుకున్నారు జనాలు. కానీ ‘గుంటూరు టాకీస్’లో రష్మి అందాల ప్రదర్శన - బూతు డైలాగులు - కాస్తంత కామెడీ తప్పితే.. ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు.

వాట్సాప్ - యూట్యూబుల్లో అడల్ట్ కామెడీ వీడియోలు చాలా వస్తుంటాయి. అందులో టాయిలెట్ లో పాస్ పోసుకుంటున్న ముగ్గురు ఒకరికొకరు సాయపడే వీడియో ఒకటి చాలామంది చూసుంటారు. దాని గురించి ఇక్కడ వివరంగా రాయడానికి స్వీయ నియంత్రణ అడ్డొస్తోంది కానీ.. ‘గుంటూరు టాకీస్’ సినిమాలో ఆ తరహా సన్నివేశం చూపించడానికి ఎవరికీ ఏమీ అభ్యంతరం లేకపోయింది. కథలో భాగంగా ఆ సన్నివేశం వచ్చిందీ అంటే సరేలే అనుకోవచ్చు. కానీ కల్పించుకుని ఆ సన్నివేశం పెట్టడంలో ప్రవీణ్ ఉద్దేశం ఏంటో మరి.

ఇక మహేష్ మంజ్రేకర్ వాడే బూతుల గురించి.. సినిమాలో మిగతా పాత్రల మాటలు - చేతల గురించి చెప్పడానికి చాలా ఉంది. ఎంత అడల్ట్ సినిమా అని ముద్ర వేయించుకున్నప్పటికీ.. మరీ ఈ స్థాయిలో హద్దులు దాటాల్సిన అవసరమేంటో? హిందీలో ‘ఢిల్లీ బెల్లీ’ తరహా సినిమాల్లో ఇలాంటి బూతులు చూశాం కానీ.. అందులో కంటెంట్ కూడా ఉంది కాబట్టి అవన్నీ కొట్టుకుపోయాయి. కానీ ‘గుంటూరు టాకీస్’లో అసలు విషయం లోపించడంతో ఈ అంశాలన్నీ దర్శకుడిపై చీప్ అభిప్రాయాన్ని కలిగించాయి. జాతీయ అవార్డు తెచ్చుకున్న సినిమా తర్వాత ప్రవీణ్ ఇలాంటి సినిమా తీశాడేంటి అన్న ఫీలింగ్ కలిగించాయి.

టొరంటినో తరహాలో ‘రా’గా ఉండే అడల్ట్ క్రైమ్ కామెడీ తీసే ప్రయత్నంలో ప్రవీణ్.. మసాలాలు బాగానే నూరాడు కానీ.. కథాకథనాల మీద మాత్రం శ్రద్ధ పెట్టలేదు. నరేష్ - సిద్ధుల పాత్రల వరకు ఓ మోస్తరుగా వినోదం పండించాడు కానీ.. మిగతా పాత్రలన్నీ ఏదో పైపైన రాసుకోవడంతో అవేవీ ఎలివేట్ కాలేదు. క్రైమ్ కామెడీ తరహా సినిమాల్లో ఉండాల్సిన వేగమే ‘గుంటూరు టాకీస్’లో లోపించింది. ప్రథమార్ధమంతా అసలు కథలోకే వెళ్లకుండా సిల్లీగా అనిపించే సన్నివేశాలతో లాగించేశాడు. పైగా సన్నివేశాలన్నీ మరీ నెమ్మదిగా సా...గడంతో సినిమా భారంగా కదులుతుంది.

ఇంటర్వెల్ ముందు ట్విస్టుతో కదలిక వచ్చినప్పటికీ.. ద్వితీయార్ధంలో మళ్లీ కథ పక్కదారి పడుతుంది. హరి - గిరిల దొంగతనానికి సంబంధించి పోలీస్ ఇంటరాగేషన్ తాలూకు సన్నివేశాలు విసిగిస్తాయి. కోటి రూపాయల డబ్బా గురించి కథనం నడపకుండా వీళ్లు చేసిన చిన్న దొంగతనాల చుట్టూ సన్నివేశాల్ని సాగదీయడంతో ప్రేక్షకులు డీవియేట్ అయిపోతారు. అక్కక్కడా జోకులు పేలుతున్నప్పటికీ సన్నివేశాల సాగతీత విసిగిస్తుంది. కథను క్లైమాక్స్ దాకా తీసుకెళ్లడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తుంది.

‘గుంటూరు టాకీస్’ సినిమాకు ట్రంప్ కార్డులాగా ఉపయోగపడిన రష్మి గౌతమ్.. తన నుంచి ప్రేక్షకులు ఏం ఆశించారో అది ఇచ్చింది. ఆమె అందాల విందు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. శ్రద్ధా దాస్ కూడా బోల్డ్ గా నటించి కుర్రాళ్లకు కాక పుట్టించింది. ఆమె సిద్ధును రేప్ చేసే సన్నివేశాలు ఫన్నీగా అనిపిస్తూనే.. మరీ టూమచ్ అన్న ఫీలింగ్ కూడా కలిగిస్తాయి. అసలే కథాకథనాలు వీక్ అంటే.. పైగా నిడివి రెండున్నర గంటల దాకా ఉండటం సినిమాకు మైనస్. అడల్ట్ కంటెంట్ ను ఎంజాయ్ చేసేవారిని అక్కడక్కడా నవ్వించి.. కవ్వించి.. కొంచెం సంతృప్తి పరుస్తుంది ‘గుంటూరు టాకీస్’. కానీ అంతకుమించి ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.

నటీనటులు: 

సిద్ధు - నరేష్ ఇద్దరూ బాగా చేశారు. సహజంగా నటించి మెప్పించారు. కంటెంట్ వీక్ అయినా.. వీళ్లిద్దరూ కలిసి సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. రష్మి గౌతమ్ తన బాధ్యత తాను నెరవేర్చింది. సువర్ణ - నా సొంతం పాటల్లో రెచ్చిపోయింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ లేదు. రివాల్వర్ రాణిగా శ్రద్ధా దాస్ బాగానే చేసింది. మహేష్ మంజ్రేకర్ పాత్ర అనుకున్న స్థాయిలో లేదు. ఫిష్ వెంకట్ తనదైన శైలిలో నవ్వించాడు. రఘుబాబు - రాజారవీంద్ర - గుండు సుదర్శన్ - రవిప్రకాష్ పర్వాలేదు. 

సాంకేతిక వర్గం: 

టెక్నికల్ గా ‘గుంటూరు టాకీస్’ బాగానే అనిపిస్తుంది. శ్రీచరణ్ డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ జానర్ సినిమాలకు సరిగ్గా సరిపోయేలా భిన్నమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. రామ్ రెడ్డి ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలు ఓకే. ఇక రచయిత - దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఎప్పట్లాగే రొటీన్ కు భిన్నమైన సినిమానే ట్రై చేశాడు కానీ.. అదనపు ఆకర్షణల మీద పెట్టిన శ్రద్ధ ఇంతకుముందులా కథాకథనాల మీద పెట్టలేదు. స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్. అడల్ట్ క్రైమ్ కామెడీ సినిమాల్ని అనుకరించాడు తప్పితే.. ప్రవీణ్ తనదైన ముద్ర వేయలేకపోయాడు.

చివరగా: ఈ ‘టాకీస్’లో బూతెక్కువ..  విషయం తక్కువ

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

తుంటరి Movie Reviews


చిత్రం: తుంటరి 

నటీనటులు: నారా రోహిత్ - లతా హెగ్డే - కబీర్ సింగ్ - వెన్నెల కిషోర్ - షకలక శంకర్ - కాశీ విశ్వనాథ్ - పూజిత - సుదర్శన్ తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: పళని కుమార్
మాటలు: లక్ష్మీభూపాల్ - శ్రీకాంత్ రెడ్డి
నిర్మాతలు: అశోక్ - నాగార్జున్
కథ: మురుగదాస్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: కుమార్ నాగేంద్ర

తెలుగులో హీరోలు తరచుగా కమర్షియల్ సినిమాలు చేస్తూ.. ఛేంజ్ కోసం కొంచెం వైవిధ్యమైన సినిమాలు ట్రై చేస్తుంటారు. కానీ నారా రోహిత్ దీనికి భిన్నంగా మొదట్నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. ఇప్పుడు తొలిసారి ‘తుంటరి’ లాంటి కమర్షియల్ సినిమా ట్రై చేశాడు. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ అందించిన కథతో తెరకెక్కిన తమిళ సినిమా ‘మాన్ కరాటె’కు ఇది రీమేక్. కుమార్ నాగేంద్ర దర్శకుడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: 

రాజు (నారా రోహిత్) వైజాగ్ లో అల్లరి చిల్లరిగా తిరిగేసే కుర్రాడు. ఐతే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయిన ఐదుగురు మిత్రుల బృందం రాజు దగ్గరికి వచ్చి బాక్సర్ అవ్వమని కోరుతుంది. నెలకు లక్ష రూపాయలు ఇస్తామని అతను అడిగిందల్లా ఇస్తామని ఆ ఫ్రెండ్స్ చె్పడంతో రాజు మొక్కుబడిగా బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలుపెడతాడు. రాజు ప్రేమించిన సిరి కూడా అతడి బాక్సింగ్ చూసి ఇష్టపడుతుంది. ఐతే రాజు బాక్సింగ్ టైటిల్ కోసం కిల్లర్ రాజు (కబీర్ సింగ్) అనే క్రూరమైన బాక్సర్ తో తలపడాల్సి వస్తుంది. ఇంతకీ ఐదుగురు మిత్రులు రాజునే ఎందుకు బాక్సర్ అవ్వమని అడిగారు. కిల్లర్ రాజు ముందు ఈ రాజు నిలవగలిగాడా? టైటిల్ గెలిచాడా? అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ: 

‘తుంటరి’ ఫాంటసీ యాంగిల్ ఉన్న కథ. ఫాంటసీ అనగానే లాజిక్ చచ్చిపోతుంది కాబట్టి.. తర్కం గురించి ఆలోచించకుండా సినిమా చూస్తే ‘తుంటరి’ వేషాలు బాగానే అనిపిస్తాయి. మురుగదాస్ అందించిన కథ బాగానే ఉంది. కానీ దాన్ని అనుకున్నంత సీరియస్ గా నడపకపోవడం సినిమాలోని ప్రధానంగా చెప్పుకోవాల్సిన మైనస్. ఓ దశ వరకు ‘తుంటరి’లోని వినోదం బాగానే ఎంటర్ టైన్ చేస్తుంది. కానీ కథ సీరియస్ గా నడవాల్సిన సమయంలోనూ సరదాగానే నడిపించడంతో వస్తుంది సమస్య. అవసరానికి మించి ఫన్ డోస్ ఇచ్చేయడం.. పాటలు బ్రేకుల్లా అడ్డుపడటంతో ‘తుంటరి’ అనుకున్న స్థాయికి చేరదు.

ఐతే రెండు గంటల తక్కువ నిడివిలో ‘తుంటరి’ చాలా వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. లాజిక్కుల గురించి ఆలోచించకుండా.. కొన్ని సిల్లీ విషయాల్ని పట్టించుకోకుండా.. చూస్తే ‘తుంటరి’ ఓకే అనిపిస్తుంది. ‘తుంటరి’ రెగ్యులర్ మసాలా సినిమా అన్న అంచనాతో థియేటర్లోకి అడుగుపెట్టిన ప్రేక్షకుడికి ఇందులోని ఫాంటసీ యాంగిల్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రేక్షకుడిని నేరుగా కథలోకి ఇన్వాల్వ్ చేస్తాయి ఆరంభ సన్నివేశాలు. ఆ తర్వాత హీరో అల్లరి వేషాలతో ప్రథమార్ధం వేగంగానే సాగిపోతుంది.

హీరో హీరోయిన్ల రొమాన్స్ ఆకట్టుకోదు. రోహిత్ - లతా హెగ్డే మధ్య కెమిస్ట్రీ పండలేదు. హీరోయిన్ హీరోను ప్రేమించడానికి సరైన కారణం కనిపించదు. ఐతే ఇప్పటిదాకా ఎక్కువగా సీరియస్ వేషాలే వేసిన రోహిత్ అల్లరి చిల్లరి పాత్రలో పండించిన వినోదం బాగా వర్కవుటవడంతో చకచకా ఇంటర్వెల్ బ్రేక్ దగ్గరికి వచ్చేస్తాం. రోహిత్ తో పాటు షకలక శంకర్ వెన్నెల కిషోర్ కూడా బాగానే నవ్వించడంతో ప్రథమార్ధంలో వినోదానికి ఢోకా లేకపోయింది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టు షాకిస్తుంది. ఐతే ఇక్కడి నుంచి కథ సీరియస్ టర్న్ తీసుకుని.. ఎమోషనల్ గా సాగుతుందని ఆశిస్తాం. కానీ అలా ఏమీ జరగదు. బాక్సింగ్ లో ఓనమాలే తెలియని హీరో.. టోర్నీ మొదలయ్యే ముందైనా బాక్సింగ్ నేర్చుకుంటాడేమో అనుకుంటే అదేమీ చెయ్యడు. చార్లీ చాప్లిన్ తరహా అల్లరితోనే టోర్నీలో ఫైనల్ దాకా వచ్చేయడం సిల్లీగా అనిపిస్తుంది. ఈ సన్నివేశాలు ఫన్నీగా ఉన్నప్పటికీ.. లాజిక్ కు మరీ దూరంగా అనిపిస్తాయి.

ఐతే ప్రేక్షకుడు ఆశించిన ఎమోషన్ చివరి అరగంటలో వస్తుంది. హీరోలో ఎమోషన్ రావడానికి దారి తీసే సన్నివేశాలు రొటీనే అయినప్పటికీ.. పకడ్బందీగానే ఉన్నాయి. చివర్లో బాక్సింగ్ ఎపిసోడ్ కూడా అంచనాలకు తగ్గట్లే సాగినప్పటికీ.. ప్రేక్షకుడు ఎమోషనల్ గా కనెక్టయ్యేలా దీన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. నారా రోహిత్ తన మార్కు సీరియస్ నటనతో ప్రిక్లైమాక్స్ - క్లైమాక్స్ లో సినిమాను నిలబెట్టాడు. నిడివి తక్కువ కావడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఐతే ఇంత తక్కువ నిడివిలోనూ ఐదు పాటలు పెట్టడం టూమచ్. అందులోనూ ద్వితీయార్ధంలో వచ్చే రెండు పాటలూ పూర్తిగా అనవసరం అనిపిస్తాయి. ఓవరాల్ గా ‘తుంటరి’లో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్లున్నాయి. అలాగే కొన్ని మైనస్సులూ ఉన్నాయి.

నటీనటులు: 

నారా రోహిత్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపించాడు ‘తుంటరి’లో. టైటిల్ కు న్యాయం చేసేలా తన అల్లరి నటనతో ఆకట్టుకున్నాడు రోహిత్. అతడి కామెడీ టైమింగ్ బాగుంది. సినిమాలో చాలా వరకు అల్లరిగానే కనిపించే రోహిత్.. చివర్లో అవసరానికి తగ్గట్లు సీరియస్ గానూ నటించి మెప్పించాడు. పతాక సన్నివేశాల్లో రోహిత్ నటన చాలా బాగుంది. హీరోయిన్ లతా హెగ్డే పర్వాలేదు. అందం - అభినయం రెండు విషయాల్లోనూ బలమైన ముద్రేమీ వేయదు. నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. కబీర్ సింగ్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ - షకలక శంకర్ బాగానే నవ్వించారు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం: 

సాయికార్తీక్ పాటల్లో డైమండ్ గర్ల్.. వినసొంపుగా ఉంది. మిగతా పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం పతకా సన్నివేశాల్లో బాగుంది. మిగతా అంతా మామూలుగా అనిపిస్తుంది. పళని కుమార్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. బాక్సింగ్ ఎపిసోడ్ కు సంబంధించిన సన్నివేశాలు బాగా తీశాడు. లక్ష్మీభూపాల్ - శ్రీకాంత్ రెడ్డి కలిసి అందించిన మాటలు బాగానే ఉన్నాయి. కుమార్ నాగేంద్ర.. మురుగదాస్ అందించిన సీరియస్ కథకు కామెడీ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తమిళంలో కంటే తెలుగులోకి వచ్చేసరికి కామెడీ డోస్ పెంచాడు. ఇది ఒకరకంగా సినిమాకు మేలు చేస్తే.. ఇంకోరకంగా చెడు కూడా చేసింది. కామెడీ మీద కమర్షియల్ అంశాల మీద ఎక్కువ దృష్టిపెట్టడంతో కొన్ని చోట్ల కథనం పక్కదారి పట్టింది. ఐతే మళ్లీ కథనాన్ని ట్రాక్ మీదికి తీసుకొచ్చి గమ్యాన్ని చేర్చాడు. దర్శకుడిగా అతడికి పాస్ మార్కులు పడతాయి.

చివరగా: తుంటరి.. టైంపాస్ ఎంటర్ టైనర్

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

డైవర్స్ రూమర్లపై రామ్ చరణ్ స్పందించాడు

సెలబ్రెటీలకు సంబంధించి చీమ చిటుక్కుమన్నా సరే.. అది పెద్ద వార్తయి కూర్చుంటుంది. రెండుసార్లు సానియా మీర్జాతో కలిసి పబ్లిక్ లో కనిపించాడో లేదో రామ్ చరణ్ గురించి ఊహాగానాలు మొదలుపెట్టేశారు జనాలు. చరణ్ - సానియాల మధ్య ఎఫైర్ నడుస్తోందని.. ఈ విషయంలో చరణ్ భార్య ఉపాసన గుర్రుగా ఉందని.. ఇద్దరి మధ్య వేరే గొడవలు కూడా ఉన్నాయని.. త్వరలోనే చరణ్ - ఉపాసన విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం మొదలైపోయింది. ఐతే మొదట ఈ రూమర్లను తేలిగ్గానే తీసుకుంది మెగా ఫ్యామిలీ. ఐతే ఊహాగానాలు మరీ జోరందుకుంటుండటంతో స్వయంగా రామ్ చరణ్ ఈ విషయంపై స్పందించాడు.

సానియా మీర్జా తనకు మంచి ఫ్రెండ్ అని.. అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని... అలాగే తాను - ఉపాసన విడిపోతున్నట్లు వస్తున్న వార్తలు కూడా శుద్ధ అబద్ధమని.. తామిద్దరం ప్రస్తుతం తన చెల్లెలు శ్రీజ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నామని.. దయచేసి ఇలాంటి రూమర్లను ప్రచారం చేసి తమను ఇబ్బంది పెట్టవద్దని చరణ్ కోరాడు. చరణ్ - ఉపాసన చిన్ననాటి స్నేహితులన్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల కిందట వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచి ఇద్దరూ అన్యోన్యంగానే ఉంటున్నప్పటికీ.. ఈ మధ్య ఉన్నట్లుండి విడాకుల వార్తలు తెరమీదికి వచ్చాయి. చరణ్ ప్రస్తుతం ఓ పక్క శ్రీజ పెళ్లి పనులు చూసుకుంటూనే.. మధ్య మధ్యలో తన కొత్త సినిమా షూటింగులోనూ పాల్గొంటున్నాడు. ఈ నెల 28న శ్రీజ పెళ్లి జరగబోతోంది.

వరుణ్ తేజ్.. వాట్ ఎ షాకింగ్ లుక్

మెగా కుర్రాడు వరుణ్ తేజ్ ను చూస్తే మామూలుగానే హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అతడికి కొంచెం టచప్స్ ఇస్తే చాలు.. లుక్ అదిరిపోతుంది. శ్రీను వైట్ల సినిమా కోసం అలాంటి లుక్ తోనే రెడీ అయిపోయాడు మెగా కుర్రాడు. పైన ఫొటోలో చూస్తున్నారుగా మెగా కుర్రాడు ఎలా తయారయ్యాడో? ఓ హాలీవుడ్ హీరోనే ఇక్కడికి దిగుమతి అయిపోయినట్లుగా లేడూ ఈ కొత్త లుక్ లో.

కొన్ని రోజులుగా గడ్డం అది పెంచితే బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగా ఖాళీ టైంలో ఏం చేయాలో తోచక అలా వదిలేశాడేమో అనుకున్నారంతా. కానీ ఆ గడ్డానికి కొంచెం స్టైలింగ్ అదీ చేసి.. పోష్ గా ఉండే బట్టలవీ తొడిగితే ఇలా షాకింగ్ లుక్ లోకి వచ్చేశాడు మెగా కుర్రాడు. మామూలుగా రొటీన్ సినిమాలు తీసే శ్రీను వైట్ల.. వరుణ్ ను ఇలా రెడీ చేయించాడంటే కొంచెం ఏదో భిన్నంగా ట్రై చేయబోతున్నాడని అర్థమైపోతుంది.

తొలి సినిమా ‘ముకుంద’లో పక్కింటి కుర్రాడిలా మామూలుగా కనిపించిన వరుణ్.. ఆ తర్వాత ‘కంచె’లో పాత తరం కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. ‘లోఫర్’లో మాస్ అవతారంలోనూ మెప్పించాడు. ఇప్పుడు వైట్ల సినిమాకు మరో సరికొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. మొత్తానికి మెగా కుర్రాడు మిగతా హీరోలకు తాను చాలా భిన్నంగా అని చాటుకుంటున్నాడు.

ఇండియాపై పాక్ గెలిస్తే విప్పేస్తుందట..

 
భారత్ లోనే కాదు.. పాకిస్థాన్ లోనూ పూనమ్ పాండేలున్నారన్నమాట. 2011 ప్రపంచకప్ టీమ్ఇండియా గెలిస్తే బట్టలిప్పేసి నగ్న ప్రదర్శన చేస్తానని పూనమ్ అప్పట్లో సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఐతే ఇండియా గెలిచినా పూనమ్ మాట నిలబెట్టుకోలేదనుకోండి. ఆ సంగతలా వదిలేస్తే.. ఈ రోజే ఆరంభం కాబోతున్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ శనివారం ఇండియా - పాకిస్థాన్ తలపడబోతున్నాయి. ప్రపంచకప్ లో ఇప్పటిదాకా ఇండియాపై గెలిచిన చరిత్రే లేదు పాకిస్థాన్ కు. దీంతో ప్రపంచకప్ గెలవడం కంటే ఇండియాపై గెలవడం పాకిస్థానీయులకు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.

ఈ నేపథ్యంలోనే పూనమ్ పాండే తరహాలో ఓ పాకిస్థానీ మోడల్ సంచలన ప్రకటన చేసింది. ఈ శనివారం భారత జట్టను పాకిస్థాన్ ఓడిస్తే.. పాక్ ప్రజల ముందు తాను స్ట్రిప్ డ్యాన్స్ (ఒంటిపై ఉన్న బట్టలు ఒక్కోటి విప్పుతూ చేసే డ్యాన్స్) చేస్తానని ప్రకటించింది కాందీల్ బాలోచ్ అనే మోడల్. ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్ లో వీడియోను పోస్ట్ చేసింది కాందీల్. పాక్ జట్టు గెలిస్తే తాను కచ్చితంగా మాట నిలబెట్టుకుంటానని.. ఆ స్ట్రిప్ డ్యాన్స్ వీడియోను పాక్ జట్టు కెప్టెన్ అఫ్రిదికి అంకితమిస్తానని ఆమె పేర్కొంది. మరి కాందీల్ ఇచ్చిన స్ఫూర్తితోనైనా పాకిస్థాన్ జట్టు చరిత్రను తిరగరాస్తుందేమో చూడాలి. ఒకవేళ పాక్ గెలిస్తే కాందీల్ మాట నిలబెట్టుకుంటుందా.. పూనమ్ లాగా హామీని తుంగలో తొక్కేస్తుందా?