shorte links

Friday, March 18, 2016

క్లీవేజ్ షోతో కరీనా మతులు పోగొట్టింది...

క్లీవేజ్ షోతో కరీనా మతులు పోగొట్టింది...
తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే..! బాలీవుడ్ హీరోయిన్లు ఫాలో అవుతున్న సూత్రమిదే. పెళ్లైనా.. పిల్లకు తల్లైనా వాళ్లు గ్లామర్ షో చేయాలనుకుంటే చేస్తారు. ఇప్పుడు కరీనా కపూర్ కూడా ఇదే చేస్తుంది. అమ్మాయిగారు సైఫ్ ను పెళ్లాడిన తర్వాత కొన్నాళ్లు గ్లామర్ షో కు దూరంగా ఉన్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ కొన్నాళ్ల నుంచి మళ్లీ రెచ్చిపోతుంది కరీనా. ప్రస్తుతం కీ అండ్ కా చిత్రంలో నటిస్తుంది బెబో. బాల్కీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.

కీ అండ్ కా ట్రైలర్స్, ప్రోమోస్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది కరీనా. తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో అదిరిపోయే రేంజ్ లో కెమిస్ట్రీ పండించింది కరీనా. భార్యాభర్తల మధ్య రిలేషన్ ను చాలా నేచులర్ గా చూపించాడు బాల్కీ. వర్కింగ్ వైఫ్ గా కరీనా నటిస్తుంటే.. ఇంట్లో ఉండే భర్తగా అర్జున్ కపూర్ నటిస్తున్నాడు. ట్రైలర్ లో కరీనా, అర్జున్ కపూర్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు వేడి రాజేస్తున్నాయి. సైఫ్ తో పెళ్లైన తర్వాత ముద్దులకు, హాట్ సీన్స్ కు దూరంగా ఉంటామని ఇద్దరూ అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ సైఫ్ ఆ మధ్య హీరోయిన్లతో కొన్ని రొమాంటిక్ సీన్స్ లో నటించాడు. దాంతో తన ఒట్టు కూడా తీసి గట్టుమీద పెట్టేసింది కరీనా.

ఆ మధ్య బ్రదర్స్ సినిమా నుంచి మళ్లీ గ్లామర్ షోకు తెరతీసింది కరీనా. అందులో మేరా నామ్ మేరీ సాంగ్ లో చిట్టిపొట్టి డ్రస్సుల్లో సెగలు పుట్టించింది. ఇక తాజాగా ఫెమీనా మ్యాగజైన్ కోసం మరోసారి వేడి రాజేసింది. చిట్టిచిట్టి క్యాస్ట్యూమ్స్, మతులు పోయేలా క్లీవేజ్ షోలు చూస్తుంటే కరీనా తెగింపుకు నోరెళ్లబెట్టక తప్పని పరిస్థితి. కపూర్ ఖాన్ దాన్ కోడలై ఉండి కూడా ఈ స్థాయిలో రెచ్చిపోవడం ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. చూడాలి మరి.. ఇప్పటికైనా కరీనా షోకు సైఫ్ అడ్డుకట్ట వేస్తాడో లేదంటే ఆనక మాట్లాడకుండా చూస్తుండి పోతాడో..?
- See more at: http://telugu.gulte.com/tmovienews/14169/Kareena-Hot-Photoshoot#sthash.HavrrWeL.dpuf

కుర్ర హీరోని ఎంకరేజ్ చేస్తున్న సమంత

కుర్ర హీరోని ఎంకరేజ్ చేస్తున్న సమంత
సమంత తల్లిదండ్రులది తెలుగు నేపథ్యం వున్నా... పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలోనే. అందుకే ఈ ముద్దుగుమ్మను చెన్నై పొన్ను అనే అంటారు ఇప్పటికీ. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించేస్తోంది ఈ చెన్నై సోయగం. మూలాలు చెన్నైతో ముడిపడి వుంటడంతో... అక్కడ కుర్రహీరోలను ఎంకరేజ్ చేయడానికి తన వంత సహాయం అందిస్తోంది. అందునా... తన తొలిచిత్రం(తెలుగులో) ‘ఏ మాయ చేశావే’ చిత్రానికి సంగీతం అందించిన ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ ను ప్రోత్సహించమంటే ఊరకే వుంటుందా. తనకు తోచిన సహాయం చేసేయదూ. అందుకే ఇప్పుడు ఈ కుర్రహీరో సినిమాను ప్రమోట్ చేయడానికి రంగంలోకి దిగింది సమంత.

సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జి‌వి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తూ... సంగీతం అందిస్తున్న తాజా చిత్రం 'నాకు ఇంకో పేరుంది'. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తుంది.  'త్రిష లేదా నయనతార' చిత్రంలో జి‌వి ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఈ చిత్రంలో కథానాయిక. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను ప్రముఖ కథానాయిక సమంతా తన ట్విటర్ ఖాతా నుండి ఈరోజు  సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనుందట. ఇలా చేయడం వల్ల ఆ సినిమాకి బోల్డంత ప్రచారం వస్తుందనేది నిర్మాతల ఆశ. అలాగే జి.వి.ప్రకాష్ కూడా తగినంత పబ్లిసిటీ లభిస్తుంది. అతి త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా జి‌వి ప్రకాష్ మాట్లాడుతూ "యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇది. చిత్రీకరణ బాగా జరుగింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ గారి 'బాషా'లో సూపర్ హిట్ డైలాగును ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టాం. చిత్రంలో నా పేరు జానీ. 1980లో 'జానీ' పేరుతో రజనీకాంత్ చిత్రం ఒకటి విడుదల అయ్యింది. అలా రజనీ కాంత్ సినిమా పేరును, అతని సినిమాలోని పాపులర్ డైలాగును ఈ చిత్రానికి ఉపయోగించుకోవడం ఎంతో ఆనందంగా వుంది. సమంత మా చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేయనుండటం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14170/Samantha-Released-GV-Prakash-Naaku-Inko-Perundi-Movie-First-Look-Poster#sthash.q4YnWKGH.dpuf

రజినీ ఫిక్సయ్యాడు.. చూస్కో మహేష్

రజినీ ఫిక్సయ్యాడు.. చూస్కో మహేష్
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే.. సందడి కేవలం తమిళనాడుకు పరిమితం అయిపోదు. సౌత్ ఇండియా మొత్తం షేకైపోతుంది. తమిళం తర్వాత రజినీకాంత్ సినిమాలకు ఎక్కువ డిమాండ్, మార్కెట్ ఉన్నది తెలుగులోనే. ఆయన సినిమాలు ఈజీగా పాతిక కోట్ల దాకా బిజినెస్ చేస్తాయి తెలుగులో. రిలీజ్ కూడా భారీగా ఉంటుంది. మన సూపర్ స్టార్లకు ఏమాత్రం తక్కువ కాని రీతిలో థియేటర్లిస్తారు. కాబట్టి రజినీకాంత్ సినిమా వస్తోందంటే మన స్టార్లు కూడా కొంచెం ఆచితూచి అడుగులేస్తారు. పోటీగా సినిమాలు రిలీజ్ చేయరు. ఈ సమ్మర్లో రజినీ తన కొత్త సినిమా ‘కబాలి’తో పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫమ్ అయిపోయింది. మే 27న ప్రపంచవ్యాప్తంగా ‘కబాలి’ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు నిర్మాత కలైపులి థాను.

మన సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’ కూడా మే నెలలోనే విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మే 6 అని.. 13 అని.. కాదు కాదు.. కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31న అని.. రకరకాల రిలీజ్ డేట్లు వినిపిస్తున్నాయి ‘బ్రహ్మోత్సవం’ విషయంలో. ఐతే ‘కబాలి’ 27కు ఫిక్సయింది కాబట్టి మహేష్ చివరి వారం మీద హోప్స్ వదిలేసుకోవాల్సిందే. 6 లేదా 13 తేదీలకే ఫిక్సయితే బెటర్. రజినీ వల్ల తెలుగు మార్కెట్లో వచ్చే ఇబ్బందుల సంగతి పక్కనబెడితే.. ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు తమిళ, మలయాళ భాషల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి మహేష్. ఈ చిత్రాన్ని ఆ రెండు భాషల్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి రజినీతో పెట్టుకుంటే కష్టం. కాబట్టి మే నెల ప్రథమార్ధానికే మహేష్ ఫిక్సవక తప్పదు.

నాగ్ మేనల్లుడు టైం మెషీన్ అంటున్నాడే..

నాగ్ మేనల్లుడు టైం మెషీన్ అంటున్నాడే..
టైం మెషీన్ అనగానే తెలుగు ప్రేక్షకులకు ఆటోమేటిగ్గా ‘ఆదిత్య 369’ సినిమా గుర్తుకొస్తుంది. తెలుగులోనే కాదు.. ఇండియా మొత్తంలో 90ల వరకు ఇలాంటి ప్రయోగం రాలేదు అప్పటికి. అందుకే ఈ సినిమా టాలీవుడ్లో ఓ ల్యాండ్ మార్క్ ఫిలిం అయింది. మళ్లీ అలాంటి సాహసాలు ఇంకెవరూ చేయలేదు తెలుగులో. ఇప్పుడు విక్రమ్ కె.కుమార్ కాలంలో ప్రయాణం నేపథ్యంలో ‘24’ సినిమాను తెరకెక్కించాడు. మరోవైపు బాలయ్య ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ చేయాలని ఉబలాటపడుతున్నాడు. ఐతే ఇప్పటిదాకా చెప్పుకున్న సినిమాలన్నీ సీరియస్ తరహాలో సాగేవే. ఐతే తొలిసారి టైం మెషీన్ నేపథ్యంలో తెలుగులో ఓ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కింది. అదే.. ఆటాడుకుందాం రా.

నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. తమిళ హీరోయిన్ సోనమ్ బజ్వా కథానాయిక. ఈ సినిమా టీజర్ ఈ రోజే రిలీజ్ చేశారు. పూర్తిగా టైమ్ మెషీన్ నేపథ్యంలో సినిమా సాగేట్లు లేదు కానీ.. అది సినిమాకు కీలకం అని మాత్రం అర్థమవుతోంది. మూడు సినిమాలు చేసినా హిట్టు రుచి చూడని సుశాంత్‌కు సక్సెస్ రుచి చూపించి తీరాలన్న కసితో.. మంచి ఎంటర్టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసినట్లున్నాడు నాగేశ్వరెడ్డి. సుశాంత్ గత సినిమాలతో పోలిస్తే ఇది భిన్నంగా.. కొంచెం జోష్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. బ్రహ్మానందం, పృథ్వీ, వెన్నెల కిషోర్ లాంటి ప్రముఖ కమెడియన్లు బాగానే నవ్వించే ప్రయత్నం చేసినట్లున్నారు. మురళీ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఎప్పట్లాగే సుశాంత్ తల్లి నాగసుశీలతో పాటు చింతలపూడి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగ్ సైతం నిర్మాణంలో భాగం పంచుకోవడం విశేషం. మేనల్లుడి కోసం ఈ రోజు ఆయనే స్వయంగా టీజర్ లాంచ్ చేశారు. అన్నట్లు ఈ రోజు సుశాంత్ బర్త్ డే కూడా లెండి. ఈసారైనా అతను సక్సెస్ కొడతాడేమో చూద్దాం.

ఈ ఇండ‌స్ట్రీకి ఏమైంది?

ఈ ఇండ‌స్ట్రీకి ఏమైంది?
ఈ ఇండ‌స్ట్రీకి ఏమైంది. విలాస‌వంత‌మైన జీవితానికి అలవాటు ప‌డి.. అంత‌లోనే అదఃపాతాళానికి ప‌డిపోయి జీవితం ముందుకు సాగ‌లేక కొంద‌రు..  కెరీర్ లో స‌రైన బ్రేక్ రాలేద‌ని మరికొంద‌రు.. కుటుంబ క‌ల‌హాల‌తో ఇంకొంద‌రు.. ప్రేమ పేరుతో మ‌రికొంద‌రు.. నిండు జీవితాన్ని మ‌ధ్య‌లోనే తుంచేసుకుంటున్నారు. ఇండ‌స్ట్రీలో అయితే ఇది మ‌రీ ఎక్కువ‌గా ఉంది. ఆత్మ‌హ‌త్య ఇప్పుడు ఓ ఫ్యాష‌న్ గా మారిపోయింది. త‌మిళ‌నాట సీరియ‌ల్ యాక్ట‌ర్ సాయిప్ర‌శాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషయం మరిచిపోకముందే.. జెమినీ మ్యూజిక్ యాంక‌ర్ నిరోషా ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప్రేమ వ్య‌వ‌హార‌మే ఈమె మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌ని అనుమానులున్నాయి. అయితే తీవ్రమైన కడుపునొప్పితో చనిపోయిందని సన్నిహితులు అంటున్నారు.

ఈ మ‌ధ్య చాలా మంది ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డ్డారు. ఏ చిన్న స‌మస్య ఎదురైనా పోరాడ‌లేక జీవితాన్ని చాలిస్తున్నారు. ఆ మ‌ధ్య ఓంకార్ ఆట షో లో డాన్స‌ర్ గా మంచి పేరు సంపాదించిన భ‌ర‌త్.. ఆర్థిక ఇబ్బందులు తాళ‌లేక హైద‌రాబాద్ లోని త‌న ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఓంకార్ షో లో కామెడీ చేస్తూ.. కొరియోగ్ర‌ఫ‌ర్ గానూ మంచి పేరు సంపాదించాడు భ‌ర‌త్. అయితే కొంత‌కాలంగా అవ‌కాశాల్లేక‌పోవ‌డం.. ఆర్థికంగా బాగా చితికిపోవ‌డంతో జీవితంపై విర‌క్తి చెంది సూసైడ్ చేసుకున్నాడు భ‌ర‌త్. సీనియ‌ర్ న‌టుడు రంగ‌నాథ్ సైతం ఆ మ‌ధ్య సుసైడ్ చేసుకోవ‌డం విచార‌క‌రం.

రంగుల జీవితాలు పైకి చూడ్డానికి అద్దాల మేడ‌లా క‌నిపిస్తాయని ఇప్ప‌టికే ఎన్నో ఉదంతాలు నిరూపించాయి. రంగ‌నాథ్, భ‌ర‌త్ ఆత్మ‌హ‌త్య‌ల‌తో మ‌రోసారి అది నిరూపిత‌మైంది. ఇద్ద‌ర‌మ్మాయిలు, ఓ కొడుకు ఉండి కూడా ఒంటరిత‌నాన్ని అనుభ‌వించారు రంగ‌నాథ్. అవ‌కాశాలు లేక‌పోవ‌డం కూడా ఆయ‌న్ని బాగా క‌లిచివేసింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో అంద‌రూ ఉన్న అనాథలా ఆయ‌న వెళ్లిపోయారు. ఇంట్లోనే డెస్టినీ అంటూ త‌న త‌ల‌రాత‌ను త‌నే బ‌ల‌వంతంగా తుడిచేసుకున్నారు. అనంత‌లోకాల‌కు వెళ్లిపోయారు. 

భ‌ర‌త్ జీవితం కూడా అంతే. చాలా త‌క్కువ టైమ్ లోనే బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువ‌య్యాడు. డాన్స‌ర్ గా, క‌మెడియ‌న్ గా, కొరియోగ్ర‌ఫ‌ర్ గా.. చాలా రంగాల్లో నైపూణ్యం క‌న‌బ‌రిచాడు. కానీ ఏం చేస్తాం.. 34 ఏళ్ల‌కే త‌నువు చాలించాడు. రెండేళ్ల కింద‌ ఉద‌య్ కిర‌ణ్ కూడా ఇలాగే ఆత్మ‌హ‌త్య‌తో అంద‌ర్నీ విడిచి వెళ్లిపోయాడు. హ్యాట్రిక్ విజ‌యాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీలోకి తారాజువ్వ‌లా దూసుకొచ్చిన ఉద‌య్.. చివ‌రికి కిర‌ణంలా మారిపోయాడు. బాలీవుడ్ లో జియాఖాన్.. టాలీవుడ్ లో సిల్క్ స్మిత‌, ఫ‌టాఫ‌ట్ జ‌య‌ల‌క్ష్మి, దివ్య‌భార‌తి.. ఇలా చెప్పుకుంటూ పోతే రంగుల జీవితాల్లో న‌ల్ల‌మ‌చ్చ‌లు ఎన్నో క‌నిపిస్తాయి. మొత్తానికి స‌మ‌స్య‌ల‌కు ఆత్మ‌హ‌త్య ప‌రిష్కారం కాక‌పోయినా.. మ‌నోవేద‌న‌తో క్షణికావేశంలో నిండు జీవితాల్నినిలువునా వ‌దిలేస్తున్నారు వీళ్లంతా. ఇక‌నైనా ఈ విషాదాల‌కు ఫుల్ స్టాప్ ప‌డాల‌ని కోరుకుందాం..!

యూట్యూబ్‌కి పవర్ చూపిస్తున్నాడు

యూట్యూబ్‌కి పవర్ చూపిస్తున్నాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే.. రికార్డుల మోత మోగాల్సిందే. ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు సంబంధించి ఊరికే ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేసినా.. అది కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక టీజర్ వదిలితే రికార్డులు బద్దలవక ఏమవుతాయ్ చెప్పండి. మొన్న మధ్యాహ్నం ‘సర్దార్..’ ఆడియో టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అది రెండు రోజుల వ్యవధిలో యూట్యూబ్ సింగిల్ ఛానెల్లో 10 లక్షల వ్యూస్ మార్కును అందుకుంది. దాదాపు 44 వేల దాకా లైక్స్ కూడా పడ్డాయి ఈ టీజర్‌కి. తెలుగులో ఇంకే సినిమా టీజర్.. ఇంత వేగంగా ఇన్ని వ్యూస్, ఇన్ని లైక్స్ సంపాదించలేదు. మరోవైపు నిన్న రిలీజ్ చేసిన ‘సర్దార్..’ హిందీ టీజర్‌కు సైతం రెస్పాన్స్ బాగానే ఉంది. ఒక్క రోజు వ్యవధిలో 2.5 లక్షల మంది దాకా సర్దార్.. హిందీ టీజర్‌ను వీక్షించారు.

తెలుగు టీజర్‌తో పోలిస్తే హిందీ టీజర్‌ను భిన్నంగా రూపొందించిన సంగతి తెలిసిందే. తెలుగులో రిలీజ్ చేసింది ఆడియో టీజర్. అందులో పవన్ అల్లరి వేషాలు.. డ్యాన్సులు అవీ చూపించారు. ఐతే హిందీలో రిలీజ్ చేసింది యాక్షన్ టీజర్. ఫైట్ల మీద ఫోకస్ పెట్టారు. రెండు వేటికవే భిన్నంగా ఉండి జనాల దృష్టిని ఆకర్షించాయి. హిందీ టీజర్ రిలీజయ్యాక ట్విట్టర్లో అది నేషనల్ లెవెల్లో ట్రెండవడం విశేషం. ఈ నెల 20న ‘సర్దార్ గబ్బర్సింగ్’ ఆడియో రిలీజవబోతుండగా.. ఏప్రిల్ 8న తెలుగు, హిందీ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మానవత్వం || NEW TELUGU SHORT FILM POSTER || SMT.PRAVALIKA PRESENTS ||






Story-Screenplay-Dialogues-Directior: Kuppirala Saswith Sidhu 

Producer: Pravalika
Cinematography: Ramesh itukala
Editing: Kuppirala Saikiran

online publicity by 

మగధీర || TELUGU SHORT FILM POSTER || || SMT.PRAVALIKA PEASENTS ||






Story-Screenplay-Dialogues-Directior: Kuppirala Saswith Sidhu 

Producer: Pravalika
Cinematography: Ramesh itukala
Editing: Kuppirala Saikiran

online publicity by 

International Award winning telugu short film Tholi choopu by saswith sidhu 2016

|| International Award winning || || telugu short film || Tholi choopu by saswith sidhu 2016


 

Producer: Pravalika

Written&Director/Actor: Saswith Sidhu

Female actor: Lavanya
Cinematography : Ramesh itukala
Editing: Saswith sidhu
online publicity by www.gvrfilmmedia.blogspot.com

|| ఇంతలో || || TELUGU SHORT FILM NEW POSTER || || U&I ENTERTAINMENTS||

U&I Entertainment s presents

 Upcoming Telugu horror short film

 ఇంతలో


Producer : Padmanabha reddy

 Written and direction by
 Varun Goud
 Cameraman: Mohan
 Editor: sri ram