shorte links

Tuesday, November 22, 2016

Award Winning||TELUGU ACTION SHORTFILM||BY SASWITH

Award Winning||TELUGU ACTION SHORTFILM||BY SASWITH.Very Interesting Story.No Boating,No Time west, 100% saticfied..This 8th Short film Of Saswith Sidhu



Sunday, July 31, 2016

ఢిల్లీకి వెళ్లను.. మోడీని కలవను

పిడికిలి బిగించి ఉంటే.. లోపల ఏం లేకున్నా ఏదో ఉందన్న భావన కలుగుతుంది. అదే గుప్పిటను తెరిచేస్తే.. గుట్టు రట్టవుతుంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు సైతం ఇలానే ఉంది. ప్రత్యేకహోదా మీద ఇప్పటికి పాతికసార్లు ఢిల్లీ వెళ్లానని చెప్పుకునే చంద్రబాబు.. ఈ సారి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలుస్తారా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు చాలా పనులు ఉన్నాయని.. ఆ పని తమ ఎంపీలు చేస్తారని చెప్పుకొచ్చారు.

ఇదే చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లో వారానికి ఒక రోజు ఢిల్లీకి కేటాయిస్తానని.. జాతీయ రాజకీయాలు.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి ఫాలో అప్ చేసేందుకు తాను వెళ్లనున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ.. మోడీ నుంచి ఇందుకు స్పందన లేకపోవటం.. ప్రతి దానికి మీరు ఢిల్లీకి రావటం ఏమిటన్న మోడీ అసంతృప్తితో పాటు.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వచ్చే వాడినే కానని.. తన రాష్ట్రానికి కావాల్సిన పనులన్నీ నేతలు.. అధికారులతో పూర్తి చేసేవాడినంటూ బాబుతో చెప్పినట్లుగా చెబుతారు.

బాబుతో మోడీ అన్న ఈ మాటల సారాంశం ఏమిటో ప్రత్యేకంగా విప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఢిల్లీకి రావొద్దు. మీ స్టేట్ లొ కూర్చొని మీ పని మీరు చేసుకోవచ్చుగా?’ అని చెప్పటమే. మోడీ మాటల్లో సందేశాన్ని అర్థం చేసుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లే మాటను చెప్పటం తగ్గించేశారు. ఇక.. మోడీతో తనకు పెరుగుతున్న దూరం.. తనకిస్తున్న మర్యాద ఎంతన్నది అర్థం చేసుకున్న చంద్రబాబు.. తరచూ ఢిల్లీకి వెళ్లే తీరును తగ్గించుకున్నారు. మొన్నామధ్యన ప్రధాని మోడీతో ముఖ్యమంత్రుల భేటీ జరిగిన సదర్భంలోనూ.. మీటింగ్ ముగిసిన వెంటనే రాష్ట్రానికి తిరిగి వచ్చారే కానీ.. గతంలో మాదిరి బాబు ఢిల్లీలోనే ఉండిపోలేదు.

తాజా విలేకరుల సమావేశంలో తాను ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదని.. ప్రధాని మోడీని కలవాల్సిన అవసరం లేదని చెప్పటం ద్వారా ప్రధానితో అంత గొప్ప రిలేషన్స్ ఏమీ లేవన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. తనకు రాష్ట్రంలో బోలెడన్ని పనులుఉన్నాయని చెప్పిన చంద్రబాబు.. మరి హోదా గురించి పాతికసార్లు ఢిల్లీ వెళ్లినట్లు చెబుతారు. మరి.. అప్పుడు ఆయనకు రాష్ట్రంలోపని లేదా? హోదా అంశంపై తన ఎంపీలు చూసుకుంటారన్న ఆయన మాటల్ని చూసినప్పుడు.. మరి గతంలో అదే పనిని ఎందుకు చేయలేదో? అన్న సందేహం కలగక మానదు. ఢిల్లీకి వెళ్లను.. మోడీని కలవనన్న మాటలతో ఢిల్లీలో తనకున్న పరపతి లెక్కను బాబు  చెప్పకనే చెప్పేసినట్లుగా చప్పాలి. ఇలా ఇంటి గుట్టును రట్టు చేసుకుంటే విలువ ఉండన్నవిషయాన్ని బాబు ఆలోచించటం లేదా?

‘డిజైన్’ను కేసీఆర్ రిజెక్ట్ చేశారు


ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు దోచుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆయనకు నచ్చినట్లుగా డిజైన్లు రూపొందించటం అంత తేలికైన విషయం కాదు. కొత్త కొత్త కట్టడాల మీద ఆసక్తి ప్రదర్శిస్తూ.. ఓ పక్క సచివాలయాన్ని.. మరోపక్క అసెంబ్లీ భవనాల్ని కొత్తగా నిర్మించాలని తపిస్తున్న కేసీఆర్ దృష్టి ప్రస్తుతం సచివాలయం మీద పడింది. ఇప్పుడున్న సచివాలయాన్ని మొత్తంగా నేలమట్టం చేసి.. అత్యద్భుతమైన రీతిలో కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన డిజైన్లు కేసీఆర్ పరిశీలనకు వచ్చాయి. మీడియాకు రిలీజ్ చేసిన ఈ బొమ్మలపై కేసీఆర్ దృష్టి సారించారు. బాగున్నాయన్న భావన కలిగించిన ఈ డిజైన్లను తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రిజెక్ట్ చేశారు.

ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సచివాలయమైన సౌత్ బ్లాక్.. నార్త్ బ్లాక్ భవన నమూనాలతో సిద్ధం చేసిన తెలంగాణ సెక్రటేరియట్ డిజైన్ కేసీఆర్ మనసును దోచుకోలేదు. డిజైన్ లోని లోపాల్ని ఎత్తి చూపిన కేసీఆర్.. సచివాలయానికి అవసరమైన ‘తెలంగాణ’ మార్క్ లేదని ఎత్తి చూపారు. తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా డిజైన్ లేకపోవటం.. వాస్తు పరంగా కొన్ని లోపాలు ఉండటతో.. కొత్త డిజైన్లు రిజెక్ట్ చేసి వేరేవి సిద్ధం చేయాలని ఆదేశించారట.

సచివాలయం కోసం సిద్ధం చేసిన నమూనాలలో.. కేసీఆర్ కు ఇష్టమైన భారీ గుమ్మటాలు లేకపోవటం కూడా.. డిజైన్ ను రిజెక్ట్ చేయటానికి ఒక కారణమన్న భావన కూడా వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ డిజైన్ ను చూస్తే.. భారీ గుమ్మటాలు కనిపిస్తాయి. అదే కాదు.. ఇటీవల తెలంగాణ సచివాలయానికి కొత్తగా నిర్మించిన ప్రధాన ద్వారం సెక్యురిటీ కార్యాలయ నమూనా కూడా భారీ గుమ్మటాలతో ఉండటాన్ని చూడొచ్చు. ఈ లోపాలతో పాటు.. సీఎం కూర్చునే సీఎంవోను నైరుతి దిశలో ఉండేలా చూడాలని.. సీఎం కార్యాలయం మిగిలిన వాటి కంటే ఎత్తులో ఉండటం.. ఈ భవనంపై భాగంలో భారీ గుమ్మటం ఏర్పాటు చేయాలన్న సూచన కూడా చేసినట్లుగా చెబుతున్నారు. సచివాలయ నమూనాను కేసీఆర్ తిరస్కరించటంతో కొత్త డిజైన్లను మళ్లీ రూపొందించాల్సిన అవసరం ఉంది. సో.. రానున్న రోజుల్లో మరిన్ని నమూనాలు కలర్ ఫుల్ గా మీడియాలో కనిపించనున్నాయన్న మాట.

తాలిబన్ రాజ్యంలా కాశ్మీర్ మారిందా?


తాలిబన్ల హవా నడిచే చోట పరిస్థితులు ఎంత ఆరాచకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కాశ్మీర్ లో అలాంటి పరిస్థితి ఉందా? అన్న సందేహం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు వింటే కలగటం ఖాయం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అల్లర్లతో కాశ్మీర్ లో పరిస్థితులు దిగజారాయి. ఎప్పుడూ లేని కొత్త పోకడలు కొత్తగా పుట్టుకు వచ్చినట్లుగా ఆ సీఎమ్మే చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఈ మాటలు కొత్త ఆందోళనల్ని రేకెత్తించేలా ఉండటం గమనార్హం.

గత నెలలో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానిని భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేయటం తెలిసిందే. జులై 8న చోటు చేసుకున్న ఈ ఘటన అనంతరం కశ్మీర్ లోయ మొత్తంగా అట్టుడికిపోయింది. అల్లర్లు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో స్థానిక కాశ్మీరీ ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికంగా చెలరేగిన అల్లర్లను అదుపు చేసే క్రమంలో భద్రతా దళాలు జరుపుతున్న కాల్పులతో పరిస్థితి మరింత దిగజారుతున్న దుస్థితి.

ఇదిలా ఉంటే..  కాశ్మీర్ లో తాజాగా చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలపై మాట్లాడిన ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ తూటాలు.. గ్రెనేడ్లు సమస్యలకు పరిష్కారం కావని వ్యాఖ్యానించారు. '‘పదేళ్ల కుర్రాడు షాపు నిర్వాహకుల్ని కొడుతున్నాడు.. ముసుగులు ధరించిన పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు. స్కూటీల్ని నడిపే అమ్మాయిల్ని తగలబెట్టేస్తామంటున్నారు. మహిళల్ని.. వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇలాంటి కాశ్మీర్ నా మనం కోరుకుంది?’’ అంటూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్ని ఆందోళనలు ఉన్నా.. కాశ్మీర్ లోయలో మహిళల పట్ల దాడులు జరగటం.. అమర్యాదకరంగా వ్యవహరించటం కనిపించదు. అలాంటి చోట.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. తాలిబన్ పోకడల్ని కొందరు వ్యాప్తి చేస్తున్నట్లు కనిపించక మానదు. అదే జరిగితే.. పెద్ద ముప్పే కాశ్మీర్ ను పొంచి ఉందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.

బాబు నిర్ణయాన్ని కేసీఆర్ ఫాలో అయ్యారు

ఈ మధ్యన వాట్సప్ లో ఒక మెసేజ్ పలువురి దృష్టిని ఆకర్షించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రుళ్ల పేర్లు మాత్రమే కాదు.. వారి పాలన కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుందని అందులో ఎలాంటి తేడా లేదంటూ ఉదాహరణలతో కూడిన ఒక పోలికతో ఉన్న పోస్టింగ్ పెట్టారు. ఇది విపరీతంగా షేర్ అయ్యింది. నిజానికి.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయని చెప్పాలి. చాలా సందర్భాల్లో కుడి ఎడంగా ఒకేలాంటి నిర్ణయాలు కనిపిస్తాయి.

ఇటీవల సెల్ ఫోన్ల మీద వసూలు చేస్తున్న 14.5 వ్యాట్ ను ఐదు శాతానికి తగ్గిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఏపీతో సహా పలు దక్షిణాది రాష్ట్రాలు మొబైల్స్ మీద 5 శాతం పన్ను విధిస్తే.. తెలంగాణ రాష్ట్రం మాత్రం 14.5 శాతం వ్యాట్ ను వసూలు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందన్న విషయాన్ని గుర్తించిన కేసీఆర్.. ఎట్టకేలకు పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన మరిన్ని నిర్ణయాలపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. పాలనా పరంగంలో ఇప్పటికే జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మీద దృష్టి పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని పెంచే నిర్ణయాల్ని చకచకా తీసుకుంటున్నారు. ఏవియేషన్ రంగానికి ప్రోత్సాహాన్ని కల్పించేలా అప్పుడెప్పుడో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

విమానాలకు వినియోగించే ఇంధనంపై వ్యాట్ ను 16 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో.. పెద్ద ఎత్తున విమానాలు ఏపీకి వెళుతున్న పరిస్థితి. ఫ్యూయల్ ఫిల్లింగ్ కు శంషాబాద్ లో అవకాశం ఉన్నా.. పన్నులో వచ్చే 15 శాతం వ్యత్యాసం నేపథ్యంలో ఏపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి. దీని కారణంగా.. ఈ రంగంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కోల్పోతోంది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరిగా లేదంటూ విమర్శలువచ్చినా పట్టించుకోని కేసీఆర్ సర్కారు.. తాజాగా దిద్దుబాటు చర్యల్ని చేపట్టటం తోపాటు.. ఇప్పటివరకూ 16 శాతంగా ఉన్న వ్యాట్ ను ఒక శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ నిర్ణయాన్ని గతంలోనే తీసుకోవాల్సింది. మరింత కాలం ఎందుకు పట్టించుకోలేదో కేసీఆర్ సర్కారుకే తెలియాలి.

ఆంధ్రా ‘గుండె’ తెలంగాణ ‘ప్రాణాన్ని’ నిలిపింది

నిజమే.. పెద్ద మనసుతో చేసిన ఆలోచనతోనే ఇది సాధ్యమైంది. ఆయుష్షు తీరిన మనిషికి మరో గుండె కొత్త జీవితాన్నిచ్చిన మానవీయ ఘటన ఇది. ఒక మహిళా రోగి గుండె వేదనను.. మరో కుటుంబం ఆవేదనలోనూ అర్థం చేసుకున్న వైనంతో మరో ప్రాణం నిలబడిన పరిస్థితి. తీవ్రఉత్కంఠతో పాటు.. ఎంతో మంది మనసుల్ని దోచిన ఈ ఉదంతం లోకి వెళితే..

హైదరాబాద్ లోని తార్నాక ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల విజయలక్ష్మి పదేళ్లుగా కార్డియో సమస్యలతో బాధ పడుతున్నారు. ఆమెకున్న సమస్యతో రక్తాన్ని పంప్ చేసే గుండె క్రమేపీ తన సామర్ధ్యాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో గుండెను మార్చటం మినహా మరో మార్గం లేని పరిస్థితి. దీంతో ప్రభుత్వ కార్యక్రమైన జీవన్ దాన్ లో పేరు నమోదు చేసుకున్న విజయలక్ష్మి గుండెను ఇచ్చే దాత కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే  తిరుపతికి చెందిన 45 ఏళ్ల చిరంజీవిరెడ్డి స్విమ్స్ లో చికిత్స పొందుతూ ఆదివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ తమ ఇంట ఆగిన వెలుగుతో మరో ఇంట వెలుగులు వెలుగుతాయన్న మాటకు సానుకూలంగా స్పందించి.. అవయువ దానానికి చిరంజీవిరెడ్డి కుటుంబం ఒప్పుకుంది. చిరంజీవిరెడ్డి అవయవాలతో నలుగురి ప్రాణాల్ని నిలబెట్టొచ్చంటూ వైద్యుల చెప్పిన మాటకు ఓకే చెప్పింది. దానానికి గుండెసిద్ధంగా ఉండటంతో స్టార్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ గోపీచంద్.. వైద్యుల బృందం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లింది. అక్కడ చిరంజీవిరెడ్డి గుండెను వేరు చేసి.. విమానంలో హుటాహుటిన బయలుదేరారు.

పోలీసుల సాయంతో గ్రీన్ చానల్ ఏర్పాటు చేయటంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బంజారాహిల్స్ స్టార్ ఆసుపత్రికి కేవలం 25 నిమిషాల వ్యవధిలో గుండెను చేర్చారు. గుండెను తీసిన నాలుగున్నర గంటలలో శస్తచికిత్స ద్వారా అమర్చాల్సి ఉంటంది. లేనిపక్షంలో అప్పటివరకూ జరిగిన ప్రయత్నం మొత్తం వృథా. మొత్తానికి నిర్దిష్ట సమయంలోపే గుండెను విజయలక్ష్మికి అమర్చారు. అలా ఆంధ్రా గుండె.. తెలంగాణలోని ఒకరి ప్రాణాల్ని నిలిపింది. ఇక.. చిరంజీవి రెడ్డి నుంచి సేకరించిన కాలేయం.. రెండు కిడ్నీలను వేర్వేరు వ్యక్తులకు అమర్చారు. కాలేయాన్ని విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించగా.. ఒక కిడ్నీని నెల్లూరు.. మరో కిడ్నీని స్విమ్స్ లో చికిత్స పొందుతున్న మరో రోగికి అమర్చారు. మానవత్వంతో తీసుకున్న ఒక నిర్ణయం ఎంతమంది ప్రాణాల్నికాపాడిందో కదూ.

పారికర్.. అమీర్.. రాహుల్.. ఒక వివాదం


రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది. బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ ఆ మధ్యన ‘భార్య విదేశాలకు వెళదామంది’  అన్నమాటల్ని పారికర్ తీవ్రంగా తప్పు పడుతూ వ్యాఖ్యలు చేశారు. అమీర్ ఖాన్ పేరును నేరుగా ప్రస్తావించని పారికర్.. ఒక బాలీవుడ్ నటుడి మాటలకు దేశ ప్రజలు తీవ్రంగా స్పందించారని.. ఆయన ఎండార్స్ మెంట్ లో ఉన్న బ్రాండ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. చివరకు సదరు కంపెనీ సైతం వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. 

దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి గుణంపాఠం చెప్పాలనీ.. తన భార్య దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నారని చెప్పటం సిగ్గుచేటు వ్యవహారంగా అభివర్ణించిన పారికర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాడి చేశారు.
పాకిస్థాన్ లాంటి శత్రుదేశాల నుంచి భారత్ ను రక్షించటం రక్షణమంత్రి పారికర్ బాధ్యతే తప్పించి.. స్వదేశీయులను బెదిరించటం కాదంటూ రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. పారికర్ వ్యాఖ్యలు ఆర్ ఎస్ ఎస్ పాఠాలు చెప్పినట్లుగా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఒక ట్వీట్ తో మండిపడ్డ రాహుల్.. ‘ద్వేషంతో పిరికివాడు విజయం సాధించలేరని వాళ్లు తెలుసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. తన మాటలపై విమర్శలు చెలరేగటంతో  పారికర్ స్పందించారు. తాను ‘పాఠం’ నేర్పాలన్న పదం వాడలేదని.. దేశాన్నిప్రేమించే వారు నిశ్శబ్దంగా ఉండకూడదని మాత్రమే తాను చెప్పినట్లుగా వివరణ ఇచ్చారు. పారికర్ లాంటి నిజాయితీ కలిగిన నేతలు  తాము మాట్లాడే మాటల్ని ఆచితూచి ఉపయోగించాలే కానీ ఇష్టం వచ్చినట్లు కాదు. తాము చేసే కీలకవ్యాఖ్యలకు రాజకీయ రంగు అంటే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎలాంటి తప్పు దొర్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో చిన్న పొరపాటు దొర్లినా.. అందుకు చెల్లించాల్సిన మూల్యం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని పారికర్ లాంటోళ్లు మర్చిపోకూడదు. 

హైదరాబాద్ లో ‘లక్ష’ మందికి మోడీ మాట

తాను వెచ్చించే ప్రతి నిమిషానికి అంతకు వందల రెట్లు ప్రయోజనం కలిగేలా జాగ్రత్తలు తీసుకునే తత్వం ప్రధాని మోడీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే తాను వెళ్లే ప్రతిచోటా భారీ బహిరంగ సభల్ని ఏర్పాటు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన పాతిక నెలల తర్వాత రాష్ట్రానికి తొలిసారి వస్తున్న మోడీ.. తన పర్యటనకు సంబంధించిన భారీ ప్రయోజనాన్ని పొందాలని భావిస్తున్నారు. అందుకే.. తమ పార్టీ నేతృత్వంలో ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ నెల ఏడున తెలంగాణ పర్యటనకు రానున్న ఆయన.. తొలుత గజ్వేల్ కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటారని భావించారు. తాజాగా అందుకు భిన్నంగా ఆయన భారీ బహిరంగ సభకు ఓకే చెప్పారు. రాక రాక వస్తున్నప్రధానికి ఘన స్వాగతం పలకటంతో పాటు.. పలు కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ బీజేపీ భావించినా.. అలాంటి వాటికి పీఎంవో నో చెప్పేసింది. అయితే.. తన మాట పెద్ద ఎత్తున ప్రజలకు చేరే అవకాశం ఉంటే నో చెప్పేలని మోడీ తీరుకు తగ్గట్లే.. తెలంగాణ బీజేపీ.. ఎల్ బీ స్టేడియంలో ఒక భారీ సభను ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు.

గజ్వేల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనే మోడీ.. అనంతరం హైదరాబాద్ లోపార్టీ కార్యక్రమంలో పాల్గొనడటం విశేషం. ఎల్ బీ స్టేడియంలో గంట గడిపేందుకు మోడీ ఓకే చెప్పారని.. ఈ గంటలో అరగంటకు తక్కువ కాకుండా మోడీ ప్రసంగం ఉంటుందని చెబుతున్నారు. ఈ సభ కోసం భారీ జనసమీకరణ బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య కార్యకర్తల్ని ఆహ్వానించాలని భావిస్తున్నారు. లక్షకు పైగా జన సమీకరణతో సభను ఏర్పాటు చేయటం ద్వారా తెలంగాణలో తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని తర్వాత తన పార్టీ కార్యక్రమంలో భాగంగా భారీ సభలో పాల్గొనటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాస్తంత చికాకు తెప్పించటం ఖాయమంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమంలో మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? పార్టీ చేపట్టిన భారీ సభలో మోడీ నోటి నుంచి తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు వస్తాయన్నది ఆసక్తికరంగా మారటం ఖాయం.

ఎన్నికల వేళ ‘రేప్’ జరిగితే రియాక్షన్ ఇదీ..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పేరు విన్న వెంటనే దారుణమైన నేరాలకు.. ఒళ్లు జలదరించే అత్యాచారాలు ఇట్టే గుర్తుకు వస్తాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ను పలువురు గుండా రాజ్యంగా అభివర్ణిస్తారు. దారుణ నేరాలు తరచూ జరిగే ఆ రాష్ట్రంలో తాజాగా ఒక దారుణం చోటు చేసుకుంది. ఇనుపరాడ్ తో కారును అడ్డుకొని.. కారులో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం ఇప్పుడా రాష్ట్రాన్ని ఊపేస్తుంది. అత్యంత అనాగరికంగా వ్యవహరించిన ఈ ఘటనపై యూపీలోని అఖిలేశ్ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

గడిచిన నాలుగేళ్ల వ్యవధిలో అఖిలేశ్ సర్కారు ఇలాంటి దారుణాల్నిఎన్నింటినో చూసింది. కానీ.. నెలల వ్యవధిలోనే అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. చోటు చేసుకున్న ఈ సామూహిక అత్యాచారంపై తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. ఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులు పోలీసుల అత్యవసర నెంబరుకు ఫోన్ చేసినా స్పందించకపోవటాన్ని ముఖ్యమంత్రి అఖిలేశ్ తీవ్రంగా పరిగణించారు.

ఘటన జరిగిన ప్రాంతంలో భద్రత వ్యవహారాల్ని పర్యవేక్షించే ఎస్ ఎస్ పీ.. నగర ఎస్పీ.. స్థానిక ఏఎస్పీ.. సీఐ.. ఎస్ ఐలు అందరిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ శివారులోని నొయిడాకు చెందిన కుటుంబం కారులో బులంద్ షహర్ పట్టణ శివారుకు చేరుకున్న సమయంలో ఇనుప రాడ్ ను కారు మీదకు విసరటం.. ఏదో ప్రమాదం జరిగిందని కారు ఆపిన వెంటనే.. ఆగంతుకులు కారు మీద దాడికి పాల్పడి.. కారులోని వారి దగ్గర నుంచి నగదు.. బంగారం తీసుకోవటంతో పాటు.. కారులో ప్రయాణిస్తున్న తల్లీ కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూతురు వయసు కేవలం పదమూడేళ్లు. 

ఈ ఘటనకు బాధ్యులైన వారిని 24 గంటల్లో అదుపులోకి తీసుకోవాలంటూ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ నేరుగా ఘటనాస్థలానికి చేరుకొని.. అక్కడే ఉండి.. విచారణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వైనం చూస్తే.. రాష్ట్ర సర్కారు జరిగిన ఉదంతంపై ఎంత సీరియస్ గా ఉందో ఇట్టే తెలుస్తోంది. పోలీసులు తలుచుకుంటే నిందితులు తప్పించుకోవటం అసాధ్యమన్న మాటకు బలం చేకూరేలా జరిగిన దారుణంతో సంబంధం ఉందని భావిస్తున్న పదిహేను మంది పాత నేరస్థులను అరెస్ట్ చేశారు. జరిగిన అత్యాచార కాండలో భావరియా సంచార జాతికి చెందిన వారే బాధ్యులుగా భావిస్తున్నారు. మరోవైపు.. అదుపులోకి తీసుకున్న 15 మందికి జరిగిన నేరంతో ఏ మాత్రం సంబంధం లేదని.. ఇదంతా ప్రభుత్వం ఏదో చేశామన్న భావన కలిగించేందుకేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించటంతో పాటు.. రాజకీయంగా పెను దుమారాన్నే రేపుతోంది.

జగన్ కు కామ్రేడ్స్ తోడయ్యారు

ఏపీ ప్రత్యేకహోదా అంశంపై రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంపై రాజకీయంగా ఎంత రచ్చ జరుగుతుందో తెలిసిందే. ఏపీకి తీరని అవమానం.. అన్యాయం జరిగిందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుండెలు బాదుకుంటుంటే.. ఇంతకంటే అన్యాయం.. దారుణం ఇంకేం ఉంటుందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నారు. ఏపీ ప్రజలకు అన్యాయం జరిగేలా ఉన్న జైట్లీ మాటలపై ఏపీ విపక్ష నేత జగన్.. ఏపీ బంద్ కు పిలుపునివ్వటం తెలిసిందే. 

విపక్షం ఇచ్చిన బంద్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు పట్టటమే కాదు.. బంద్ అంటే నిరసనలు కాదని.. ఉత్పత్తిని పెంచాలని.. రోడ్లు ఊడవాలని.. మురికి కాల్వల్ని శుభ్రం చేసి కేంద్రం మీద తమ నిరసనను వ్యక్తం చేయాలని.. చేతికి నల్లబ్యాడ్జిలు కట్టుకోవాలంటూ చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంద్ చేయటం ఏ మాత్రం సమంజసం కాదన్నది చంద్రబాబు మాట.

అయితే.. ఇదంతా రాజకీయంగా వచ్చే మైలేజీని అడ్డుకోవటం కోసం చంద్రబాబు ఆడుతున్న నాటకంగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు.. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు కారణంగానే ఏపీకి ప్రత్యేకహోదా రావటం లేదన్నది జగన్ పార్టీ నేతల వాదన. తాము పిలుపునిచ్చిన బంద్ ను పెద్ద ఎత్తున చేపట్టి తమ సత్తా చాటటంతో పాటు.. ఏపీ సర్కారుపై భావోద్వేగ వ్యతిరేకతను పెంచాలన్నది జగన్ టీం ఆలోచనగా చెప్పొచ్చు. ఇలా ఎవరికి వారుగా అధికార.. విపక్షాలు తమ తమ పొలిటికల్ మైలేజీ కోసం ప్రత్యేక హోదా అంశాన్ని వాడుకుంటున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే ఈ ఆటలో.. కమ్యూనిస్టులు తమ భాగం కోసం పావులు కదిపారు. విభజన సమయంలో విభజనకు అనుకూలంగా వ్యవహరించిన సీపీఐ.. విభజనను వ్యతిరేకించిన సీపీఎం పార్టీలు ఏపీ తరఫున ఒక్కమాట అంటే ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. విభజన సమయంలో కమ్యూనిస్టుల వ్యవహారశైలిపై విసిగిన ఆంధ్రులు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి కాంగ్రెస్ కు వేసిన శిక్ష వేయటంతో పాటు.. ఆ పార్టీకి గతంలో ఉన్న ఛరిష్మా పూర్తిగా తగ్గిపోయిన దుస్థితి. దీంతో..ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా చక్కటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కమ్యూనిస్టులకు తాజా పరిణామాలు కలిసి వచ్చినట్లుగా మారాయి. అందుకే.. జగన్ పార్టీ పిలుపునిచ్చిన ఏపీ బంద్ కు తోడుగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పిలుపునివ్వటం గమనార్హం. కామ్రేడ్స్ తాజా నిర్ణయంతో జగన్ కు కమ్యూనిస్టులు తోడయ్యారని చెప్పాలి

దూసుకెళ్తున్న హరీష్

తెలంగాణ ప్రభుత్వానికి చుక్కలు చూపించిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు యవ్వారాన్ని ఒక చూపు చూసేందుకు.. ఈ ఇష్యూను క్లోజ్ చేసేందుకు తన జపాన్ పర్యటనను సైతం వాయిదా వేసుకున్న మంత్రి హరీశ్ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. గడిచిన పాతిక నెలల్లో ఎప్పుడూ ఎదురుకాని ఇబ్బందికర పరిస్థితులు మల్లన్నసాగర్ ఇష్యూ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే ఎనిమిది గ్రామాల ప్రజలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించటం.. ముంపునకు గురయ్యే తమ భూముల్ని ఇచ్చేందుకు ఏ మాత్రం సిద్ధం కాకపోవటంతో.. దీన్ని రాజకీయాంశంగా మలచటంలో విపక్షాలు కొంతమేర విజయం సాధించిన విషయం తెలిసిందే.

మల్లన్నసాగర్ ఇష్యూలో విపక్షాలన్నీ ఏకమైన తెలంగాణ సర్కారుకు షాకిస్తున్న వేళ.. ఈ వివాదానికి తెర దించేందుకు మంత్రి హరీశ్ స్వయంగా నడుం బిగించారు. తమ భూములకు తగిన పరిహారం ఇచ్చే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గ్రామాల వారితో వేర్వేరుగా భేటీ అయి.. వారి సమస్యల్ని అసాంతం విని.. వారి మనసుకు నచ్చేలా నిర్ణయాల్ని వెలువరించేందుకు హరీశ్ ప్రత్యేక కసరత్తు చేశారు. అదే సమయంలో.. ముంపు గ్రామాల్లో పర్యటించటం ద్వారా నిరసల్ని మరింత రాజేసేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాల్ని అరెస్ట్ లతో అడ్డుకొన్న తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు బాధితుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేశారు.

ఇంతకాలం ఎనిమిది ముంపు గ్రామాల్లో ఆరు గ్రామాల్ని ఒప్పించిన మంత్రి హరీశ్..తాజాగా మరో ఊరును ఒప్పించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూముల్ని తీసుకోవటంతో పాటు.. ముంపునకు గురయ్యే గ్రామాన్ని తిరిగి అదే పేరుతో వేరుగా కట్టిస్తామన్న హామీతో ఇష్యూ పరిష్కారమైంది. తాజా ఒప్పుకున్న సింగారం గ్రామస్తులతో..ఇక వేములఘాట్ ఒక్కటే మిగిలింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూములుసేకరించాల్సిన ఎనిమిది గ్రామాల్లో ఏడు గ్రామాలకు చెందిన వారు ఓకే అనటంతో వేముల ఘాట్ ను ఒప్పిస్తే మల్లన్నసాగర్ మీద రచ్చ ముగిసినట్లే. తాజా పరిణామం హరీశ్ కు మరింత ఉత్సాహానిస్తుందనటంతో సందేహం లేదు.

Friday, July 29, 2016

సీమాంధ్రలో ‘టీఆర్ ఎస్’ లాంటిది ఉండి ఉంటే..

రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే మనసులో ఉంటే మాటలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే టీఆర్ఎస్ నేతల్ని చూసి నేర్చుకోవాలి. ఎదుటోళ్లు ఎవరు.. వారిది ఏ స్థాయి అన్నది చూసుకోకుండా రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం దూకుడుగా వెళ్లే తీరు చాలామందికి నచ్చకున్నా.. మొత్తంగా మోసపోయినప్పుడు.. అన్యాయానికి.. వివక్షకు గురి అవుతున్నప్పుడు.. అలాంటి పార్టీ మనకు ఎందుకు లేదన్న భావన కలగటం ఖాయం.

ఇంతకు ముందు ఎప్పుడైనా అనిపించినా.. అనిపించకపోయినా తాజాగా రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదా అంశంపై జరిగిన చర్చ మొత్తాన్ని చూసిన తర్వాత టీఆర్ఎస్ లాంటి పార్టీ.. కేసీఆర్ లాంటి అధినాయకుడు సీమాంధ్రకు లేకపోవటం ఎంత భారీ నష్టమన్న విషయం ఇట్టే తెలిసిపోతోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కూడా రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తమ అంగీకారాన్ని పార్లమెంటుసాక్షిగా చెప్పింది లేదు. కానీ.. అందుకు భిన్నంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో పార్టీలన్నీ సానుకూలంగా స్పందించటమే కాదు.. విభజన బిల్లు సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ లాంటి నేత హామీ ఇచ్చిన నేపథ్యంలో హోదా ఇవ్వాలంటూ తేల్చి చెప్పినా.. మోడీ సర్కారు మాత్రం ససేమిరా అనటం స్పష్టంగా కనిపించింది.

జాతీయ స్థాయిలో ఇన్ని పార్టీలు ఒక అంశం మీద మద్దతు పలికిన తర్వాత కూడా ఏపీకి సాయం చేసేందుకు నో అంటున్న మోడీ సర్కారు తీరుపై ఎలా రియాక్ట్ కావాలి? ఎంత తీవ్ర నిరసన వెల్లువెత్తాలి? అన్న ప్రశ్నలు రాక మానవు. కానీ.. సీమాంధ్ర ప్రజల గుండెల్లో బాధ ఉన్నప్పటికీ.. తమ ఆశల్ని.. ఆకాంక్షల్ని గుర్తించి.. తమ కోసం పోరాడే టీఆర్ఎస్ లాంటి పార్టీ లేకపోవటంతో సీమాంధ్రులు తన ధర్మాగ్రహాన్ని మనసులో దాచుకున్నారని చెప్పొచ్చు. కేంద్రం అనుసరిస్తున్న తీరుతో.. ఏపీలో ఉద్యమాలు చెలరేగొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేసిన దానికి తగ్గట్లే.. తమను మొత్తంగా మోసం చేసిన మోడీ సర్కారు మీదా.. బీజేపీ మీద సీమాంధ్రుడు తానేంటో చేతల్లో చేసి చూపించటం ఖాయమని చెప్పొచ్చు.

నిజానికి ఈ రోజు సీమాంధ్రలో టీఆర్ ఎస్ తరహా పార్టీ కానీ ఉండి ఉంటే.. ఈ రోజు రాజ్యసభలో జరిగిన దానికి రేపు ఏపీలో భారీ బంద్ జరిగేది? రాజకీయ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. పత్రికలు పతాక స్థాయిలో ఏపీకి జరిగిన అన్యాయం గురించి చెప్పేవి. ఇక.. ఎడిటోరియల్స్ మొత్తం కూడా మోడీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించేవి.కానీ.. రాజకీయ చైతన్యం తీసుకొచ్చే టీఆర్ ఎస్ లాంటి ఉద్యమపార్టీ సీమాంధ్రలో లేని నేపథ్యంలో రేపటి రోజు.. ఇవాల్టి మాదిరే సాగుతుంది తప్ప మరెలాంటి మార్పు ఉండదనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ద్యావుడా...యూరిన్ తో బీర్ అంట!

బీర్...మందు ప్రియులందరికీ పరిచయం అక్కర్లేని సురపానీయం. ఆల్కహాల్ చాలా తక్కువ మోతాదులో ఉన్నందున బీర్ ను చాలా మంది ఇష్టడతారు. అందుకే బీర్ పట్ల ఆడా - మగా అందరూ ఆకర్షితులవుతున్నారు. రకరకాల ఫ్లేవర్లలో బీర్ లు మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి. ఈ లిస్ట్ లోకి మరో రకం బీర్ రంగ ప్రవేశం చేయనుంది. ఈ బీర్ ను దేనితోని తయారు చేస్తారో తెలుసుకుంటే షాక్ కు గురవుతారు. ఎందుకంటే ఈ బీర్ యూరిన్ తో తయారవుతోంది మరి. బెల్జియంలోని ఘెంట్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇపుడీ వార్త హల్ చల్ సృష్టిస్తోంది.

ఇంతకీ ఈ యూరిన్ బీర్ ను తయారు చేయడానికి నేరుగా మూత్రం వాడరు. పలు దశల్లో బీర్ తయారు చేస్తారు. శాస్త్రవేత్తలు దీని గురించి వివరిస్తూ....యూరిన్ ను సోలార్ ఎనర్జీ ద్వారా నీరుగా మార్చే యంత్రాన్ని వారు కనుగొన్నామని తెలిపారు. ఇందులో మొదట యూరిన్ ను ఓ పెద్ద ట్యాంక్ లో నిల్వ ఉంచుతారు. సౌర విద్యుత్ తో పనిచేసే బాయిలర్ లో వేడి చేసి పొంగకుండా దానిని ప్రవహింపచేస్తారు. దీని వల్ల ఆ మూత్రం.. పొటాషియం - నైట్రోజన్ - పాస్ఫరస్ - నీరుగా విడిపోతుంది. ఆ నీరును ప్రాసెస్ చేసి మంచి టేస్టీ బీర్ గా తయారు చేస్తారు. ఇక యూరిన్ నుంచి వేరు చేసిన పొటాషియం - నైట్రోజన్ - పాస్పరస్ వంటి ఖనిజ లవణాలను పొలంలో ఎరువులుగా కూడా వాడుకోవచ్చని తెలుపుతున్నారు. ఈ మధ్య ఘెంట్ యూనివర్సిటీ క్యాంపస్లో ఈ మెషిన్ ను ఉంచి దాదాపు వెయ్యి లీటర్ల మూత్రాన్ని సేకరించామని అన్నారు. దీనిని ప్రాసెస్ చేసి రకరకాల ఫ్లేవర్లలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు తెలిపారు. 

బాబోయ్ ఇలాంటి బీర్ తో ఆరోగ్యం సంగతేంటి అనే కదా మీ సందేహం? ఆరోగ్యానికి ఎటువంటి హానీ చేయదని బెల్జియం శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెప్తున్నారు.

అలారం మోతను ఆపెయ్యొద్దు...

ఎవరైనా వ్యాయామం చేయడానికి సమయం లేదంటే.. రోగాలను తెచ్చుకోవడానికి సమయం కేటాయిస్తున్నట్టు లెక్క! సగటు మనిషి జీవితం సమయంతో పరుగులు తీస్తోంది. ఉద్యోగం - కెరీర్ - టార్గెట్స్ - మనీ... వీటన్నింటి మధ్యలో వ్యాయామం అనేది దినచర్య జాబితాలో ఉండటం చాలా కష్టమైపోతోంది. రోజుకి ఓ అరగంట వాకింగ్ చేసినా ఎంతో మేలు అని డాక్టర్లు మొత్తుకుంటున్నా కూడా... ఆ 30 నిమిషాలు కేటాయించేందుకు కూడా చాలామందికి సమయం ఉండటం లేదు. వ్యాయామం ఎందుకు చేయడం లేదూ అని ఎవరిని అడిగినా... టైమ్ చాలడం లేదు గురూ అని చెప్పేవారే ఎక్కువ! అయితే వ్యాయామానికి టైం కేటాయించి తీరాలని చెబుతున్నారు వైద్యులు. రోజుకి 8 గంటలకుపైగా కుర్చీల్లో శరీరాన్ని కుదేసి పనిచేస్తున్నవారు తప్పనిసరిగా వ్యాయామం చేసి తీరాలని అంటున్నారు. సరైన శారీరక శ్రమ లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఆ మూల్యం ఎంత అనేదానిపై ఇంటర్ నేషనల్ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ ఒక పరిశోధన చేశారు.

ఆ పరిశోధనలో తేలింది ఏంటంటే... వ్యాయామం లేకపోవడం వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ వాటిని నయం చేసుకునేందుకు ఏటా 67.5 బిలియన్ డాలర్లను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఖర్చు చేస్తున్నారు. వారానికి కనీసం 150 నిమిషాలపాటు శారీరక శ్రమ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కానీ ఆ మార్కును దాటుతున్నవారు వయోజనుల్లో కనీసం 50 శాతం మంది కూడా ఉండటం లేదని ఆ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాయామం లేని కారణంగా గుండె జబ్బులు - డయాబెటిస్ - క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతూ ఏటా 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని నివేదిక తేల్చింది. రోజులో ఓ గంట... లేదంటే కనీసం ఓ అరగంట ఆరోగ్యం కోసం కేటాయించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వ్యాయామానికి సమయం కేటాయించకపోతే... వైద్య ఖర్చులకు బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. ఇలాంటి బడ్జెట్ కేటాయింపులకన్నా... సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే శ్రేయస్కరం కదా! సో.. ఇంకెందుకు ఆలస్యం... అలారం మోతను ఆపెయ్యొద్దు!

ఢిల్లీలో ఇంటికి వెళ్లటానికి 12 గంటలు

ఈ మధ్యనే ఒక దేశంలో భారీ ట్రాఫిక్ జాం కారణంగా గంటల కొద్దీ రోడ్ల మీద వాహనాలు ఆగిపోయాయంటూ వార్త వస్తే ఆశ్చర్యపోయిన పరిస్థితి. తాజాగా అలాంటి చేదు అనుభవం దేశ రాజధాని ప్రజలకు అనుభవంలోకి వచ్చేసింది. గడిచిన రెండు రోజులుగా ఢిల్లీ చుట్టుపక్కల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నింటికి మించి ఢిల్లీ.. గుర్గావ్ ఎక్స్ ప్రెస్ హైవే మీద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం కావటం సంచలనం సృష్టిస్తోంది.

ఈ ట్రాఫిక్ జాం గురించి గుర్తుకు వస్తేనే ఢిల్లీ వాసులు హడలిపోతున్నారు. గురువారం ఆఫీసు నుంచి బయలుదేరిన పలువురు వాహనదారులు మహా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని శుక్రవారం ఉదయం ఇళ్లకు చేరుకున్న దుస్థితి. ఐటీ హబ్ అయిన గుర్గావ్ నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించే వేలాది మంది నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా అనుభవించిన పరిస్థితి. బారీవర్షాల కారణంగా ట్రాఫిక్ జాం కావటం.. వాహనాలు నెమ్మదిగా నడుస్తున్న వేళ.. ఫస్ట్ గేర్ లో బండిని నడపాల్సి రావటంతో పెట్రోల్.. డీజిల్అయిపోయిన వాహనాలు రోడ్ల మీద ఆగిపోవటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

చివరకు ఢిల్లీ ట్రాఫిక్ చీఫ్ స్వయంగా రంగంలోకి దిగి బైకు మీద వెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడాల్సి వచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ – గుర్గావ్ హైవే దరిదాపుల్లోకి రాకుండా ఉండటం మంచిదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా ట్రాఫిక్ జాంపై వ్యంగ్యంగా వ్యాఖానించిన కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేస్తూ.. ఢిల్లీ నుంచి గుర్గావ్ కు వెళ్లటం కంటే న్యూయార్క్ కు త్వరగా చేరుకోవచ్చని వ్యాఖ్యానించటం గమనార్హం.

దళిత డైరక్టర్ అనకండి ప్లీజ్!!


అదేంటో తెలియదు కాని.. మన మీడియాలో ఒక వింతైన ప్రవర్తన ఉంది. ఎక్కడన్నా ఎవరన్నా వెనుకబడిన కులాలకు చెందిన వారు ఏదైనా సాధించినా.. లేదే ఏదైనా ఇబ్బందులకు గురైనా కూడా.. వారిని వెంటనే కులం పేరుతో ప్రస్తావిస్తుంటారు. ఏదన్నా గోల్డ్ మెడల్ గెలిచినప్పుడు.. మెడల్ గెలిచిన దళిత యువకుడు.. అని రాస్తుంటారు. దాని వలన నిజంగానే వెనుకబడిన వర్గాలకు మేలు జరుగుతుందా లేదా అనేది రాసేవారికే తెలియాలి. అయితే తనను మాత్రం అలా పిలవద్దని అంటున్నాడు దర్శకుడు పా.రంజిత్. 

ఈ ''కబాలి'' డైరక్టర్ గతంలో అత్తకత్తి.. మద్రాస్.. సినిమాల్లో కూడా కులాల గురించి ప్రస్తావించాడు. అయితే తాను దళిత వర్గానికి చెందిన వాడిని కాబట్టే ఇలా కులాల గురించి ప్రస్తావిస్తున్నా అనుకోవద్దని.. తాను కులం కారణంగా అణచివేతకు గురయ్యాను కాబట్టే ఇలా కులాల గురించి సినిమాల్లో చూపిస్తున్నానని చెప్పాడు. అంతే కాదు.. తనను దళిత దర్శకుడు అని ప్రస్తావించొద్దని మీడియాకు విన్నపించాడు. ఎక్కడ ఏ కులం వారికి అన్యాయం జరిగినా కూడా దానిని తన సినిమాల్లో చూపిస్తానని.. అది అగ్ర కులం అయినా అణగారిన కులం అయినా సరే అంటున్నాడు రంజిత్. సమాజంలోని అసమానతల గురించి మాట్లాడటానికి దళితులే కావల్సిన అవసరం లేదని చెప్పాడు ఈ కుర్ర దర్శకుడు. 

''నేనే కాదు.. ఫిలిం మేకర్ ఎవరైనా కూడా సమాజంలో జరుగుతున్న వాటిని సినిమాల్లో ప్రస్తావించాలి. అసమానతలను ప్రశ్నించాలి. అప్పుడు సినిమాల వలన సోసైటీకి ప్రయోజనం ఉంటుంది'' అంటూ ముగించాడు రంజిత్. నిన్న సాయంత్రం చెన్నయ్ లో కబాలి సక్సెస్ మీటుకు వచ్చిన ఆయన ఈ కామెంట్లు చేశాడులే. 

సీనియర్ రైటర్ తో వినాయక్ షార్టు ఫిలిం

టాలీవుడ్ లో ఒక్కోసారి స్టార్ డైరక్టర్లు కూడా రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటి విన్యాసాల్లో ఒకటి ఏంటంటే.. స్టార్ డైరక్టర్లు షార్టు ఫిలింస్ లో ఇన్వాల్క్ కావడంత. ''ఐ యామ్ ది చేంజ్'' అంటూ అప్పట్లో అల్లు అర్జున్ తో ఒక షార్టు ఫిలిం తీశాడు సుకుమార్. ఇప్పుడు మరో స్టార్ డైరక్టర్ వివి వినాయక్.. ఒక స్టార్ రైటర్ తీస్తున్న షార్టు ఫిలింను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. 

అనేక సినిమాలకు మాటలు రాసి.. తరువాత నటుడిగా తెలుగు వారిని అలరిస్తూ.. ఇప్పుడు దర్శకుడిగా కొన్ని ఆర్టు సినిమాలను తీసిన డైరక్టర్ తనికెళ్ళ భరణి. ఈ మద్యనే ''మిథునం'' సినిమాతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడు ‘లాస్ట్ ఫార్మర్’ అనే షార్టు ఫిలిం ఒకటి తీయబోతున్నారట. ఈ లఘు చిత్రం కథను విని చాలా ఇంప్రెస్ అయిన వినాయక్.. వెంటనే సినిమాను నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నారట. గతంలో ఎలాగైతే తనికెళ్ళ తీసిన సిరా మరియు మిథునం సినిమాలు ప్రాచుర్యం పొందాయో.. ఇప్పుడు లాస్ట్ ఫార్మర్ కూడా అలాగే సక్సెస్ అవుతుందని ఆశిద్దాం. 

ఇక వినాయక్ విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 150వ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. అఖిల్ ఫెయిల్యూర్ తరువాత వస్తున్న సినిమా కాబట్టి.. వినాయక్ పై చాలా బాధ్యత ఉందిప్పుడు. అది సంగతి. 

ఫొటోస్: అమైరా దస్తూర్ ఫోటో షూట్

బన్నీకి ఇష్టమైన ఇతర హీరోలు..

అల్లు అర్జున్ అంటే స్టయిలిష్ స్టార్ అని తెలిసిందే. తెలుగులోనే కాకుండా మలయాళం కూడా మనోడు హిట్టయ్యాడు. ఇప్పుడు సరైనోడు సినిమా కూడా మలయాళంలో బాగా ఆడేసింది. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడిన బన్నీ.. కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. తనకు మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు సరే.. ఇంతకీ మనోడు ఎవరి ఫ్యాన్? అయితే బన్నీ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అని ఊరందరికీ తెలుసు.. మరి ఆయన కాకుండా ఇంకెవరి ఫ్యానో తెలుసా? 

నిజానికి బన్నీ ఆల్ టైమ్ ఫేవరేట్ ఎవరంటే.. స్టయిల్ ఐకాన్.. మైఖేల్ జాక్సన్. అందుకే ఫిలిం నగర్లోని తన డ్యాన్సు ప్రాక్టీసింగ్ హాల్లో మనోడు జాక్సన్ ఫోటో మరియు చిరంజీవి ఫోటోలను పెట్టుకున్నాడు. ఇక హాలీవుడ్ లో తనకు ఇష్టమైన నటుడు లియోనార్డో డికాప్రియో అని.. అలాగే హిందిలో ఎప్పటికీ అమిత్ బచ్చన్ సాబ్.. అమీర్ జి.. ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ నచ్చుతున్నాడని తెలియజేశాడు. తమిళంలో అయితే ధనుష్.. విజయ్ సేతుపతి.. బాగా నచ్చేశారట. ఈ మధ్యన విజయ్ కూడా నచ్చుతున్నాడటలే. ఇక తెలుగులో ఫేవరేట్ ఎవరు అని అక్కడి మీడియావారు ఎవ్వరూ అడగలేదు. మరి చిరంజీవి కాకుండా వేరే పేర్లు చెప్పాల్సి వస్తే.. బన్నీ ఏం చెప్పేవాడో. 

ఇదంతా సరే.. ఇంతకీ కొత్త సినిమా ఎప్పుడు ఎవరితో మొదలెడుతున్నావ్ బన్నీ? హరీశ్ శంకర్ తో చేస్తున్నావా లేదంటే విక్రమ్ తో చేస్తున్నావా.. ముందు ఆ విషయం చెప్పు. 

శ్రీదేవి కూతురు.. మహేష్ ఫిలిం కాదంది

కొంతమంది హీరోయిన్లు మహేష్ బాబుతో సినిమా ఆఫర్ వస్తే బాగుండు అని ఎదురు చూస్తుంటే.. కొంతమంది భామలు మాత్రం మహేష్ సినిమా ఎందుకులే అని కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో మొన్ననే పరిణీతి చోప్రా.. తన నేటివ్ హిందీ సినిమాకే ప్రాధాన్యతను ఇచ్చి.. తెలుగులో 2.5 కోట్లు ఇస్తామన్నాకూడా చేయనని చెప్పేసింది. పైగా ప్రమోషన్లకు రాననడంతో మనోళ్ళు కూడా వద్దులే అనుకున్నారట. 

ఇకపోతే అసలు విషయం ఏంటంటే.. పరిణీతి చోప్రా వద్దనగానే.. ఈ ఆఫర్ ఎగురుకుంటూ రకుల్ ప్రీత్ దగ్గరకు మాత్రం రాలేదు. నిజానికి మనోళ్ళు మరో బాలీవుడ్ గాళ్ కోసం ప్రయత్నించారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ఎలాగో హీరోయిన్ అవుదాం అనుకుంటోంది కాబట్టి.. ఆమెతో తెరంగేట్రం చేయించాలని చూశారట దర్శకుడు మురుగుదాస్. ఇప్పటికే లాస్ ఏంజెలిస్ లోని లీ స్ర్టాస్బర్గ్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్న అమ్మడిని చేస్తావా అని అడిగితే.. మహేష్ సినిమా అయినా కూడా ఇప్పుడప్పుడే నేను చేయలేను.. నేను ఇంకా రెడీగా లేను అని చెప్పిందట. 

బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడితే.. శ్రీదేవి తన కూతురు విపరీతంగా పేరొచ్చేసి ప్రాజెక్టు అయితేనో.. లేకపోతే ఏ షారూఖ్ ఖాన్ కొడుకు హీరోగా తెరంగేట్రం చేసే సినిమా అయితేనో కాని.. జాన్వి కోసం ఓకె చేయదులే అంటూ జోకులు వేస్తున్నారు.  

ఆ ఒక్క మాటతో సీట్లు పెంచేయొచ్చట


తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత.. రాజ్యసభ సభ్యులు దేవేందర్ గౌడ్ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పక్షాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రత్యర్థి పార్టీల నుంచి నేతల్ని ఆహ్వానించిన సందర్భంగా అవసరానికి మించి మరీ పెద్ద ఎత్తున నేతల్ని తీసుకోవటం తెలిసిందే. ఇంతమంది నేతల్ని పార్టీలోకి తీసుకొస్తున్న నేపథ్యంలో.. రేపొద్దున వారికి పదవులు.. బాధ్యతలు ఎలా అన్న ప్రశ్నకు.. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అన్న మాటను చెప్పటం తెలిసిందే. విభజన చట్టంలో అసెంబ్లీ స్థానాల్ని పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ అవకాశం ఉండటం.. కేంద్రం ఆమోదం పొందేలా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే తాము తిరుగులేని అధికార కేంద్రాలుగా మారిపోవచ్చని రెండు రాష్ట్రాల్లోని అధికారపక్షాలు భావించాయి.

అయితే.. అసెంబ్లీ నియోకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ఆలోచన ఏదీ కేంద్రం వద్ద లేదని.. ఈ విషయంలో తామేమీ చేయలేమని తేల్చేయటమే కాదు.. రాజ్యాంగంలోని నిబంధనలు మార్పుకు అడ్డుకుంటున్నాయన్న మాటను చెప్పుకొచ్చారు. దీంతో.. అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణ విషయంలో కోటి ఆశలతో ఎదురుచూస్తున్న పలువురు నేతలకు కేంద్రం మాటలు షాకింగ్ గా మారాయి.

కేంద్రం చెప్పినట్లుగా రాజ్యాంగంలోని 170వ అధికారణం పునర్ వ్యవస్థీకరణకు అడ్డు పడుతుందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఆసక్తికర వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు. కేంద్రం తలుచుకోవాలే కానీ.. ఏది అడ్డంకి కాదని చెబుతున్నారు. దీనికి ఏపీ రాష్ట్ర విభజన ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. విభజనకు ముందు రాజ్యాంగంలోని 371(డి) అడ్డుకుంటుందని అందరూ అనుకున్నారని కానీ.. రెండు రాష్ట్రాలకూ ఈ చట్టం వర్తిస్తుందన్న మాటను చేర్చటంతో విభజన వ్యవహారం సింఫుల్ గా పూర్తి అయ్యిందని చెబుతున్నారు.

ఇక.. అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణకు రాజ్యాంగంలోని 170వ అధికారం అడ్డుగా ఉందన్న కేంద్రం మాట కేవలం మోకాలు అడ్డటమే తప్పించి మరింకేమీ కాదని.. ఒకవేళ కేంద్రం కానీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను పూర్తి చేయాలని బలంగా అనుకుంటే చేసేయొచ్చని.. ఇందుకు రాజ్యాంగంలోని 170వ అధికారణ అడ్డు పడకుండా ఉండేందుకు వీలుగా.. ‘‘నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 170 అధికారం నుంచి మినహాయింపు’’ ఇస్తున్నాం అన్న వ్యాక్యాన్ని చేరిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేసుకోవచ్చని సెలవిస్తున్నారు. ఏ నిబంధన అయినా బంధనంగానే ఉంటుంది. కానీ.. దాని బంధనాలు విప్పే ‘కిటుకు’ ఉన్నా.. కేంద్రానికి ఇష్టమైతే తప్ప అది బయటకు రాదు. ఎవరెంత కోరుకున్నా.. కేంద్రానికి అసెంబ్లీస్థానాలు పెంచాలని లేకపోతే.. ఎన్ని కిటుకులు చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండదనే చెప్పాలి.

పార్టీ బలోపేతం కోసం బాబు షార్ట్ కట్


తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం కొత్త రూట్ కనుక్కొన్నారని అంటున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇప్పటివరకు ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు పసుపు కండువా కప్పిన బాబు ఇపుడు కొత్తగా స్థానిక సంస్థలపై కన్నేశారని తాజా పరిణామాల ఆధారంగా ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. నగర పాలక - పురపాలక - గ్రామ పంచాయతీల్లోనూ ప్రజాప్రతినిధులందరూ తమ వాళ్లే ఉండేలా టీడీపీ అధిష్టానం  తమ ప్రభుత్వం ద్వారా 'పంచాయతీరాజ్ యాక్ట్ 2007 - చాప్టర్ 28'లో సవరణ తీసుకురానుండటం ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.  తద్వారా  'ఎనభై శాతం మనోళ్లే ఉండాలి.. 2050 వరకూ మనమే అధికారంలో ఉండాలి.. జనం వద్దకు వెళ్లండి..' అని మహానాడులో చంద్రబాబు ఇచ్చిన పిలుపును అమలు చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. 

వైసీపీ ఎమ్మెల్యేలతో మొదలుపెట్టిన చంద్రబాబు 'ఆపరేషన్ ఆకర్ష్' పథకం స్థానిక సంస్థల్లోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకువచ్చిన జీవోకే మార్పులు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల్లో తరచూ అవిశ్వాస తీర్మానాలు పెట్టడం వల్ల పరిపాలనకు ఆటంకంగా మారుతోందని రాజకీయ జోక్యం ఎక్కువవుతోందని 'అవిశ్వాస' కాలపరిమితిని నాలుగేళ్లకు పొడిగిస్తూ వైఎస్ జీవో తెచ్చారు. అయితే ఈ జీవోను చంద్రబాబు నాయుడు తమకు అనుకూలంగా మరల్చుకునే ప్రయత్నాలను ప్రారంభించారని అంటున్నారు. రెండేళ్ల పాలన పూర్తి కావడంతో స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్తున్నారు. ముందుగా ఈ సవరణ ద్వారా తన సొంత జిల్లా అయిన చిత్తూరులో ఆపరేషన్ రూపొందించేలా బాబు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

పంచాయతీరాజ్ యాక్ట్ 2007 - చాప్టర్ 28 సవరణ అమల్లోకి వస్తే ఒక్క చిత్తూరు జిల్లాలోనే నగరి - పలమనేరు మున్సిపాలిటీలు టీడీపీకి దక్కనున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న అమరనాథరెడ్డి ఇటీవలే టీడీపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. అదే సమయంలో 50 శాతానికి పైగా కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం వైసిపికి చెందిన శారదా కుమార్ ఛైర్మన్ గా ఉన్నారు. మరోవైపు వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి మున్సిపాలిటీలో ఒకే ఒక్క సీటు తేడాతో టీడీపీ ఛైర్మన్ పదవిని పోగొట్టుకుంది. నగరి ఎమ్మెల్యే హోదాలో రోజా తన ఓటును వేయడంతో ఛైర్మన్ పదవిని వైసీపీ దక్కించుకుంది. రెండేళ్ల అవిశ్వాసం తెరపైకి వస్తే ఈ రెండు మున్సిపాలిటీలూ టిడిపి వశం కానున్నాయి. జిల్లాలో ఒక్క పుంగనూరు తప్ప మిగిలిన ఏడు మున్సిపాలిటీలూ టిడిపి పరం కానున్నాయి. అలాగే పుంగనూరు - మదనపల్లి - జీడీ నెల్లూరు - పూతలపట్టు నియోజకవర్గాల్లో ఎక్కువ ఎంపిపి స్థానాలను వైసిపి దక్కించుకుంది. అక్కడా ఆకర్ష్ పథకం ఉపయోగించి అవిశ్వాసం ప్రయోగించి టిడిపి వశం చేసుకోనుంది. ఈ విధంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెండేళ్ల కాలానికే తగ్గించడం వల్ల మెజారిటీ స్థానిక సంస్థలను తమ వైపు మళ్లించుకోవచ్చని వ్యూహం సాగుతోంది. మొత్తంగా ఆపరేషన్ ఆకర్ష్ aలో బాబు కొత్త తరహా విధానానికి శ్రీకారం చుట్టారని అంటున్నారు

ఎంపీకి చంద్రబాబు వార్నింగ్

ఏపీ సీఎం చంద్రబాబు సాక్షిగా టీడీపీ తమ్ముళ్లు రెచ్చిపోయారు. ఓ వైపు ఎంపీ వర్గం - మరోవైపు పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ ల వర్గాలు ఎవరికి వారు పోటాపోటీగా బలప్రదర్శనలు చేయాలని డిసైడ్ అవ్వడంతో పాటు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. చంద్రబాబు సమక్షంలోనే పబ్లిక్ గా ఈ గొడవ జరగగా చిర్రెత్తుకొచ్చిన చంద్రబాబు ఎంపీతో పాటు ఆయన వర్గీయులపై ఫైర్ అయ్యారు. శుక్రవారం చంద్రబాబు వనం-మనం కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని సుంకొల్లులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభావేదికపై నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావును స్టేజ్ మీదకు పిలవడంతో ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గీయులు స్టేజ్ వద్ద తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.

 ముద్దరబోయినను స్టేజ్ మీదకు ఆహ్వానించవద్దంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా ముద్దరబోయిన వర్గీయులు సైతం నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు మాగంటితో పాటు ఆయన వర్గీయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఏలూరు ఎంపీ మాగంటిబాబుకు - నూజివీడు ఇన్ చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు మధ్య గత సాధారణ ఎన్నికల నుంచే తీవ్రస్థాయిలో విబేధాలు ఉన్నాయి. మద్దరబోయిన చివరి క్షణంలో పార్టీలోకి వచ్చి టిక్కెట్టు దక్కించుకున్నారు. ఎన్నికల టైంలో కూడా ఇద్దరూ ముభావంగానే ప్రచారం చేశారు.

 ఎన్నికలయ్యాక ఇద్దరూ వేర్వేరు వర్గాలను ప్రోత్సహించడంతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది. తాజాగా బాబు పర్యటన సాక్షిగా ఈ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. గతంలోనే వీరిద్దరు సవాళ్లు-ప్రతి సవాళ్లు రువ్వుకున్నారు. వీరి మధ్య విబేధాలతో నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ నియామకం కూడా వాయిదాలు పడుతూ వస్తోంది. ఎవరికి వారు తమ వర్గానికి చెందిన వారికే ఏఎంసీ చైర్మన్ ఇప్పించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే ఈ ఇద్దరి నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించినా ఆయన మాటలు గాలిమీద నీటిమూటలయ్యాయి. ఇక తాజాగా బాబు ముందే మాగంటి వర్గీయులు చేసిన హంగామా ఆయనకు కోపం తెప్పించడంతో చంద్రబాబు ఎంపీ మాగంటితో పాటు ఆయన వర్గీయులపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

“గ్రేటర్ రాలే వాసులకు గోదావరి రెట్టింపు ఆత్మీయత”

యూఎస్ ఏ - జూలై 29 - 2016: అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న ఇండియన్ రెస్టారెంట్ చైన్ ‘గోదావరి’ ఇపుడు గ్రేటర్ రాలే వాసులకు రెట్టింపు ఆత్మీయతను అందించనుంది. మారిస్ విల్లే టౌన్ లో గోదావరికి చెందిన రెండో రెస్టారెంట్ ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. తద్వారా దక్షిణ భారత దేశ వంటకాలను ఆత్మీయంగా అందించేందుకు మరింతగా చేరువ అయింది.

ఈ ప్రారంభోత్సవం నేపథ్యంలో టీమ్ గోదావరి సభ్యులు మాట్లాడుతూ ‘గ్రేటర్ రాలేలో గోదావరి మొదటి రెస్టారెంట్ ప్రారంభించిన సమయంలో మాకు అద్భుతమైన స్పందన లభించింది. మా ఫ్రాంచైజీ భాగస్వామ్యులైన శ్రీకాంత్ బాల - సతీష్ సుంకర - హనీష లు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి రెండో రెస్టారెంట్ ను గ్రేటర్ రాలే పరిధిలో కొలువుదీర్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. గ్రేటర్ రాలే పరిధిలో ప్రారంభమైన రెండో భారతీయ రెస్టారెంట్ గోదావరి ఒక్కటేనని తెలిపేందుకు మేం గర్విస్తున్నాం. మా నోరూరించే వంటకాలు మారిస్విల్లే వాసులకే కాకుండా నార్త్ కరోలినాలో భోజన ప్రియులందరిని అలరించడం ద్వారా అద్వితీయ విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం’’ అని తెలిపారు.
 
గ్రాండ్ గాళా లాంచ్ ఈవెంట్ లో భాగంగా నోరూరించే వంటకాలతో ఏర్పాటుచేసిన భారీ బఫెట్ తో అలరించనున్నారు. ‘’పల్లెటూరి’’ థీమ్ తో గ్రామీణ నేపథ్యంలో ఈ గ్రాండ్ బఫెట్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా గ్రామీణ నేపథ్యానికి ఆధునిక టచ్ ఇస్తూ వంటలు రూపొందించారు. ‘పాపారావ్’ పాపడ్ బజ్జి - ‘ఊర్వశి’ ఉల్లికారం ఇడ్లీ - ‘కిన్నెరసాని’ కంజు పిట్ట వేపుడు - వేట మాంసం పులావ్ - బొంగులో చికెన్ - ‘సిల్క్ స్మిత’ స్ట్రాబెర్రి జున్ను వంటివి అమెరికాలో మొట్టమొదటి సారి వడ్డించనున్నారు. 

గోదావరి ప్రత్యేక మెనూలో భాగమైన విశిష్టమైన ‘చేప చిప్స్’ ‘కోడిలో బిర్యానీ’ వంటివి మరెన్నో వంటకాలు సైతం భాగస్వామ్యం పంచుకున్నాయి. దీంతో పాటుగా రెస్టారెంట్ లో ఏర్పాటుచేసిన అద్భుతమైన బార్ (#Spicy Indian Bar) ద్వారా వెరైటీ బీర్ - లిక్కర్ వంటివి రిలాక్స్ గా ఆస్వాదించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆత్మీయ వాతావరణంలో ఈ మధుశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. 

200 సీట్ల సామర్థ్యం కలిగి ఉన్న ఈ రెస్టారెంట్ దాదాపుగా 10000 మందికి పైగా కార్పొరేట్ ఉద్యోగులు ఉన్న పెరిమీటర్ పార్క్ గేట్ వే వద్ద కీలక స్థానంలో కొలువుదీరి ఉంది. ఈ రెస్టారెంట్ నుంచి రాలే/దుర్హం ఎయిర్ పోర్ట్ కు కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. రీసెర్స్ ట్రయాంగిల్ పార్క్ నుంచి పది నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.

దక్షిణ భారతదేశానికి చెందిన ఆత్మీయ వంటకాలే కాకుండా పలు వెరైటీ వంటకాలను సైతం గోదావరి ఇక నుంచి వడ్డించనుంది. ‘’పుల్లారావు పులావ్’’ పేరుతో గోదావరి విస్తరించిన పలు ప్రాంతాల్లో ప్రత్యేక వంటకం వడ్డించనున్నారు. 

ఆస్టిన్ లో ఇటీవల ప్రారంభించిన గోదావరి రెస్టారెంట్ కు భారీ స్పందన వచ్చింది. ‘’పంచె కట్టు’’ లంచ్ బఫెట్ పేరుతో వడ్డించే భోజనాన్ని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఆస్టిన్ వాసులు అందించిన ఈ ఆదరణకు గోదావరి ఆస్టిన్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తోంది. ఈ నమ్మకాన్ని - ఆత్మీయతను నిలబెట్టుకుంటూ మరిన్ని విశిష్ట వంటకాలు వడ్డించనున్నట్లు వెల్లడించింది.

గోదావరి ఆస్టిన్ గ్రాండ్ ఓపెన్ కు చెందిన ట్రైలర్ ఈ లింక్ లో చూడవచ్చు:https://www.youtube.com/watch?v=R9vOmfdLJdc 

భారతీయులకు మరింత చేరువ అయ్యేందుకు గోదావరి కొత్త అడుగులు వేస్తోంది. గోదావరి రెస్టారెంట్  కార్యక్రమాలకు చెందిన ఫొటోలు - ట్రైలర్ లు తీసే ‘షట్టర్ ఆర్మీ’తో జట్టుకట్టింది. తద్వారా తన అతిథులకు కేవలం ఆత్మీయ భోజనమే కాకుండా అద్భుతమైన అనుభూతులను అందించనుంది. గోదావరి-షట్టర్ ఆర్మీ ఒప్పందంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు అందుబాటు ధరలోనే ఫొటోలు - వీడియోలు - ట్రైలర్లు అందించవచ్చు. 

ఇంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారికి భారతీయ ఆత్మీయతను గుర్తుచేసేలా మరిన్ని వంటకాలను - రుచులను అందించేందుకు గోదావరి బృందం తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. 

మారిస్ విల్లే - నార్త్ కరోలినాతో పాటు పరిసర ప్రాంతాల్లోని తమకు ఆదర అభిమానులు కొనసాగుతాయని గోదావరి భరోసాతో ఉంది. 

ప్రతి భోజనప్రియుడిని ఆత్మీయంగా ఆహ్వానించి గోదావరి రుచులను ఆస్వాదించవలసిందిగా కోరుతోంది. అంతేకాకుండా వారి వంటకాలను పంచుకోమని ఆహ్వానిస్తోంది. 

ఈ జూలై 30 నుంచి మీకు ఆత్మీయతను పంచేందుకు సిద్ధం.  

గోదావరి మారిస్ విల్లే
100 జెరుసలేం డ్రైవ్ - #108
మారిస్ విల్లే - నార్త్ కరోలినా - 27560
ఫోన్: 919-234-6950 

మా సేవలతో మీరు సదా ఆనందించగలరని ఆశిస్తూ మరోసారి కృతజ్ఞతలు.

సంప్రదించండి:

శ్రీకాంత్ బాల
269-779-4245
Sree@GodavariUS.com
www.GodavariUS.com
 

మిస్టర్ చౌదరీ.. అలా ఎలా చేస్తారు?


ఏపీ ప్రత్యేక హోదా అంశంపై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం ప్రత్యేక హోదా అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు మోడీ సర్కారును.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని వెనకేసుకొచ్చి.. పొగడ్తల మీద పొగడ్తలతో ముంచెత్తిన నేపథ్యంలో వచ్చిన నెగిటివ్ టాక్ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు టోన్ మార్చారు. ఏపీ ప్రత్యేక హోదా మీద చర్చ షురూ అయిన వెంటనే కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి గళం విప్పే ప్రయత్నం చేశారు.

‘‘మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు కేంద్రమంత్రి’’ అంటూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పదే పదే ప్రస్తావించటం గమనార్హం. అలా అని.. సుజనా చౌదరి మరీ అంత ఘాటుగా రియాక్ట్ అయ్యింది లేదు. కేంద్రం వైఖరిని తప్పు పడుతూనే.. అలా అని తన మాటలు ఎక్కడా మితిమీరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ కిందామీదా పడ్డారు. ఆయన అవస్థ చాలా స్పష్టంగా అర్థమైంది.

కాకుంటే.. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయన తన పరిధిని కాస్త దాటారనే చెప్పాలి. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా మీద సమాధానం ఇస్తూ ప్రసంగిస్తున్న వేళ.. మధ్యలో కల్పించుకొని ఏపీకి జరిగిన కేటాయింపుల మీద ఆయన జైట్లీ వ్యాఖ్యల్ని విభేదించటం కనిపించింది. ఈ సందర్భంగా కురియన్ కల్పించుకుంటూ.. మిస్టర్ చౌదరి.. ఇది చాలా అన్ యూజవల్.. మీరు ప్రభుత్వంలో భాగం. మీరు కేంద్రమంత్రి.. మీరు ఇలా వ్యవహరించటం ఏమిటి? అంటూ వ్యాఖ్యలు చేయటం కనిపించింది. అయినప్పటికీ ఆ మాటల్ని పట్టించుకోనట్లుగా వ్యవహరించిన సుజనా చౌదరి.. జైట్లీ వ్యాఖ్యలకు మధ్యలో అడ్డుపడటం కనిపించింది

జైట్లీ చెప్పిందిదే; ఉత్త ఇస్తరాకు..మంచినీళ్లు

ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ఏపీ ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై గురువారం హాట్.. హాట్ గా చర్చసాగి.. అది కాస్తా శుక్రవారం కూడా కంటిన్యూ కావటం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న పలు పార్టీలకు చెందిన నేతలంతా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ విస్పష్టంగా చెప్పటమే కాదు.. ఏపీని ఆదుకోవాల్సిన అవసరం ఉందని.. నాడు సభలో ప్రధాని ఇచ్చిన హామీని నెరవేర్చటం సరైన పద్ధతి అంటూ చెప్పటం కనిపించింది. సభ్యుల ప్రసంగాల తర్వాత వారు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

ప్రశాంతంగా.. ఎలాంటి టెన్షన్ లేకుండా.. తాపీగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని అరుణ్ జైట్లీ చెప్పేశారు. సూటిగా స్పష్టంగా తన వైఖరిని స్పష్టం చేయని ఆయన మాటల సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘‘ఉత్త ఇస్తరాకు.. మంచినీళ్లు’’ అని చెప్పాలి. ప్రత్యేక హోదా మీద ఎలాంటి హామీ ఇవ్వకపోవటమే కాదు.. ఈ మధ్యన పెంచిన పన్నుల వాటాతో ఏపీ బాగుపడిపోతుందని.. కొన్ని సమస్యలకే కాలమే చక్కటి మందు అన్నట్లుగా ఆయన మాటలు సాగాయి. విభజన కారణంగా ఏపీ నష్టపోయిందన్న విషయం వరకూ బాగానే ఉన్న ఆయన.. ఏపీకి సాయం చేసే విషయానికి వచ్చే సరికి.. అసలుసిసలు గుజరాతీ మార్వాడీలా వ్యవహరించారని చెప్పాలి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తమ ఇంట్లో ఆస్తులన్ని కరిగిపోతాయన్నట్లుగా ఫీలైన అరుణ్ జైట్లీ.. ఏపీకి ఇస్తే.. మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వాలన్న చిత్రమైన వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ప్రత్యేక హోదా మాత్రమే కాదు.. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ అంశం కూడా అంత తేలికైన విషయం కాదని.. అది చాలా సున్నితమైన అంశంగా చెప్పారు. ఈ అంశాన్ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చూస్తున్నారని.. ప్రస్తుతం ఆయన ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని.. ఈ ఇష్యూను ఆయన డీల్ చేస్తారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కు అన్నివిధాలుగా సాయం చేస్తున్నామని.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ తీరుస్తున్నట్లుగా చెప్పిన యన.. ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేనందున తాము ఏమీ చేయలేమని.. హోదా గురించి ప్రధాని ప్రసంగంలో మాత్రమే ఉందని తేల్చారు. పోలవరం ప్రాజెక్టుకు.. ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తున్నామని.. తామిచ్చిన నిధుల్ని ఖర్చు పెట్టిన తీరునుపరిశీలించిన తర్వాత నిధులు ఇస్తాని చెప్పారు.

విభజన కారణంగా ఏపీ హైదరాబాద్ ను కోల్పోవటం వల్లే సమస్య ఎదురైందని.. అయినా ఏపీ రాష్ట్రం కోలుకుంటుందని.. మంచిపాలన ప్రణాళికతో రెవెన్యూ లోటు నుంచి బయటపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్నింటికంటే ఒక చిత్రమైన లెక్కను జైట్లీ చెప్పుకొచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారం సమైకాంధ్రకు 1.10లక్షల కోట్లు వచ్చిందని.. ఇప్పుడున్న ఏపీకి లెక్క ప్రకారం 58 శాతం అంటే రూ.64.5వేల కోట్లు రావాల్సి ఉందని.. కానీ మార్చిన లెక్కల ప్రకారం ఏపీకి రూ.2లక్షల కోట్లు వెళ్తున్నట్లుచెప్పారు. సమాఖ్య వ్యవస్థలో ఏపీతో సహా వెనుకబడిన రాష్ట్రాలన్నింటినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుందని.. కేంద్రం నుంచి చేయగలిగిన సాయమంతా చేస్తామని జైట్లీ చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. తాజా చర్చతో స్పష్టమైనదేమంటే..  ఏపీకీ ప్రత్యేకంగా ఏమీ చేయమన్న విషయాన్ని మోడీ సర్కారు తరఫున జైట్లీ రాజ్యసభ సాక్షిగా కుండబద్ధలు కొట్టారని చెప్పాలి.

నిర్భయ కేసులో ఇనుప రాడ్ నిరూపిస్తే 10లక్షలట

దేశం మొత్తాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతం ఎంత సంచలనం  సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ.. విదేశాల దృష్టిని ఆకర్షించిన ఈ ఉదంతంలో కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థిని అత్యంత దారుణంగా.. హేయంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులు.. ఆమెను బస్సులో నుంచి తోసేయటం.. తీవ్ర గాయాలతోఆమె పోరాడి మరణించటం తెలిసిందే. దేశం మొత్తాన్ని కదిలించిన ఈ ఘటనలోనిందితులకు సంబంధించినకేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. చివరి దశకు చేరుకున్న ఈ కేసు విచారణ సందర్భంగా తాజాగా నిందితుల తరఫున కేసు వాదిస్తున్న డిఫెన్స్ లాయర్ ఎంఎల్ శర్మ సంచలన ప్రకటన చేశారు.

2012లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కోర్టు విచారణ అనంతరం బయటకు వచ్చిన డిఫెన్స్ లాయర్.. నిర్భయ ప్రైవేటు పార్ట్స్ లోకి ఇనుపరాడ్ దూర్చి అవయువాల్ని బయటకు లాగారని.. ఆ కారణంగా చోటుచేసుకున్న తీవ్ర గాయాలతోఆమె మరణించినట్లుగా పోలీసులు కోర్టుకు నివేదించటాన్ని ఆయన తప్పు పట్టారు. నిందితులు నిర్భయ విషయంలో ఇనుప రాడ్ ను దూర్చారన్న అంశాన్ని నిరూపిస్తే తానురూ10లక్షలు బహుమతిని ఇస్తారని ప్రకటించటం సంచలనంగా మారింది.

పోలీసులు కావాలనే ఇలాంటి అంశాల్ని పేర్కొన్నారని.. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు కేసు విచారణ  జరిగిన తర్వాత కోర్టు నుంచి బయటకు వచ్చిన శర్మ.. మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటు పార్ట్స్ లో ఇనుప రాడ్ ను దూర్చి పేగులు బయటకు లాగారన్నది పోలీసులు అల్లిన కట్టుకథగా చెప్పారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఒకరు మూడేళ్ల క్రితం తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా.. మరో నిందితుడు బాల నేరస్తుడు (నేరం జరిగిన నాటికి) కావటంతోమూడేళ్లు రిఫామ్ హోమ్ లో ఉంచి విడుదల చేశారు.

పోలీసులు పేర్కొన్నదే నిజమైతే.. అత్యాచారానికి గురైన బాధితురాలు చెప్పిన సాక్ష్యంలో కానీ.. ఆమె స్నేహితుడు ఇచ్చిన వాంగ్మూలంలో కానీ ఇనుప రాడ్అంశం లేదన్నారు. ఆమెకు వైద్యంచేసిన వైద్యులు కానీ.. సింగపూర్ వైద్యులుకానీ ఇనుప రాడ్ ఉదంతాన్ని ప్రస్తావించలేదని గుర్తుచేశారు. ఒకవేళ ఇనుప రాడ్ వెజీనాలో నుంచి లోపలికి పెట్టి ఉంటే యూట్రస్ కు గాయం కాకుండా పేగుల వరకు వెళ్లే అవకాశం లేదని హ్యుమన్ అనాటమీ చెబుతుందని ఆయన వాదిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలంలో ఇనుప రాడ్ అంశం లేకున్నా పోలీసులు ఎలా ఆ అంశాన్ని వాదిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

మళ్లీ ఎంసెట్ తప్పదు.. కేసీఆర్ కన్ఫర్మ్

కొందరి తప్పు అందరి పాలిట శాపంగా మారిన ఉదంతం ఇది. తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్వహించిన ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష పత్రాలు లీక్ కావటం.. భారీ కుంభకోణం చోటు చేసుకున్న ఈ ఉదంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంతమంది చేసిన తప్పునకు అందరిని బాధ్యుల్ని చేసేలా కేసీఆర్ నిర్ణయం ఉండటం గమనార్హం. ఎంసెట్ 2 లీకు వ్యవహారంలో 100 నుంచి 150 మధ్యన తప్పు చేసి ఉండొచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది.

ఈ ఉదంతాన్ని విచారించిన సీఐడీ సైతం.. లీకులో మ్యాగ్జిమం 150 మందికి మించి భాగస్వామ్యం ఉందని తేల్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 56 వేల మంది విద్యార్థులు.. వారి కుటుంబాలకు మనోవ్యధను కలిగించేలా పరీక్ష రద్దు నిర్ణయాన్ని తీసుకోవద్దంటూ విద్యార్థులు తల్లిదండ్రులు.. విద్యార్థులు.. పలువురు అధ్యాపకులు విన్నవించారు.

తాజా ఉదంతంపై సుదీర్ఘంగా సమీక్ష జరిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంసెట్ 2 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయంతో వేలాది మంది మరోసారి ప్రవేశ పరీక్షను రాయాల్సి ఉంటుంది. దీంతో.. మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులకు తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ తెలుగోడు అంతర్జాతీయ పౌరుడట

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై చర్చ శుక్రవారం కూడా జరిగింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ సభ్యులు చేసిన వ్యాఖ్యలకు బదులిచ్చిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నించారు. ఈ సందర్భంగా మధ్య మధ్యలో జైట్లీ వ్యాఖ్యల్ని ఏపీ తెలుగుదేశం నేతలు మొదలుకొని.. కాంగ్రెస్ సహా పలు పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ కాస్తంత ఉల్లాసంగా కనిపించారు.

నిత్యం చిర్రుబుర్రులాడుతున్నట్లుగా కనిపించే కురియన్.. ఈ రోజు అందుకు భిన్నంగా కాస్త సరదాగా కనిపించారు. సభ్యుల్ని అదిలిస్తూ.. అంతలోనే బుజ్జగిస్తూ.. వారిని తాను కోరుకున్నట్లుగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడారు. తాను మద్రాస్ లో పుట్టానని.. ఆంధ్రాలో పెరిగానని.. తెలంగాణతో అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు. తనకు తెలుగు రాష్ట్రాల విషయంలో అవగాహన ఉందని.. తన సూచనల్ని పట్టించుకోవాలన్నారు.

దీనికి రియాక్ట్ అయిన కురియన్.. ఏచూరిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. మీరు జాతీయ.. అంతర్జాతీయ పౌరులు. మీరు ఏ విషయం మీదనైనా మాట్లాడొచ్చు అంటూ వ్యాఖ్యానించారు. ‘‘మీకు రాష్ట్రాల పరిమితులు లేవు. ఏ రాష్ట్రం.. ఏ అంశం మీదనైనా మాట్లాడొచ్చు’’ అంటూ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలకు సభలో సభ్యులు నవ్వుల్లో మునిగిపోయారు.

సినిమా పేరు చెప్పి ఎలా మస్కా కొట్టారంటే..


ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రకటన ఇవ్వడం.. ఇంటర్వ్యూలకు వచ్చినవాళ్లకు మాయ మాటలు చెప్పడం.. వాళ్లతో డబ్బులు కట్టించుకోవడం.. నమ్మకం కుదరడానికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం.. కొన్ని రోజుల తర్వాత బోర్డు తిప్పేసి వసూలైన డబ్బులతో ఉడాయించడం.. ఇలాంటి మస్కా వ్యవహారాలు చాలా విని ఉంటాం. ఐతే ఐటీ ఉద్యోగాల విషయంలోనే కాదు.. సినిమా అవకాశాల విషయంలోనూ ఇలాంటి మోసాలే జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాదులో ఇలాంటి మోసమే చోటు చేసుకుంది. తాను ఓ దర్శకుడినని చెప్పి.. తాను తీయబోయే సినిమాలో హీరో వేషాలిప్పిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు ఓ మోసగాడు. బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

పోలీసులు చెబుతున్నదాని ప్రకారం నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన రాజేంద్రనాయక్ అలియాస్ డి.వి.సిద్దార్థ్ ఫిలింనగర్ లోని అపోలో రోడ్డులో ఓం సాయిరాం ప్రొడక్షన్స్ పేరుతో ఓ ఆఫీస్ తెరిచాడు. తన దర్శకత్వంలో ‘ప్రేమ+స్నేహం=సంగీతం’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నానని.. జూన్ 19న ప్రారంభోత్సవం అని.. ఇందులో నటించడానికి హీరోలు కావాలని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. దీంతో కొందరు కుర్రాళ్లు ఆశపడ్డారు. ఐతే అతణ్ని కలిశాక సినిమా కోసం కొంత డబ్బులు పెట్టాల్సి ఉంటుందని చెప్పాడు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రావణ్ కుమార్ గౌడ్ తన అక్క పెళ్లి కోసం ఇంట్లో ఉంచిన రూ.4 లక్షలు తీసుకెళ్లి సిద్దార్థ్ కు ఇచ్చాడు. అదే ప్రాంతానికి రాజశేఖర్ రూ.70 వేలు - కిషోర్ రూ.30 వేలు.. ఇలా మరికొంతమంది యువకులు సిద్దార్థ్ కు డబ్బులు సమర్పించుకున్నారు. ఈ డబ్బులకు అతను బాండు కూడా రాసిచ్చారు. కానీ జూన్ 19 వచ్చినా సినిమా మొదలుపెట్టలేదు. వారం రోజుల కిందట ఆఫీస్ మూతపడింది. తాము మోసపోయామని ఈ కుర్రాళ్లకు అర్థమైంది. చివరికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

నాన్నకి ఫ్యాన్స్ కి ఒకేసారి ఒకే గిఫ్ట్


అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పుడు హుషారుగా ఉన్నాడు. మొదటి సినిమా రిలీజ్ తర్వాత రెండో సినిమా స్టార్ట్ చేసేందుకు ఏ స్టార్ హీరో వారసుడు తీసుకోనంత లాంగ్ గ్యాప్ తీసుకుని.. అత్యంత జాగ్రత్తగా సెకండ్ ప్రాజెక్ట్ ఫైనల్ చేసిన హుషారు ఇది. హను రాఘవపూడితో తను సినిమా చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన అఖిల్.. దీని విషయంలో ఇంకో బిగ్ అనౌన్స్ మెంట్ కి రెడీ అవుతున్నాడు.

ఎవరితో తన రెండో సినిమా చేస్తాడో చెప్పిన అఖిల్.. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాడో మాత్రం చెప్పలేదు. ప్రీప్రొడక్షన్ పనులు అవీ అంటే కాస్త లేట్ అవుతాయ్ కానీ.. ఇప్పటికే హనుతో కలిసి చాలా వారాల నుంచి జర్నీ చేస్తున్నాడు. అందుకే ఆ పనులన్నీ దాదాపు అయిపోయాయని.. హీరోయిన్ ను ఫైనల్ చేయడం మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తం పూజకి ఇంకా నెల రోజులు మాత్రమే టైమ్ ఉందట. ఆగస్ట్ 29న ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. 

ఆగస్ట్ 29 అంటే.. నాగార్జున పుట్టిన రోజు అని ఫ్యాన్స్ నిద్దర్లో అడిగినా చెప్పేస్తారు. అందుకే ఆ రోజున అటు తండ్రి నాగ్ కి.. ఇటు ఫ్యాన్స్ కి కలిపి గిఫ్ట్ ప్లాన్ చేశాడని.. అదే తన సినిమా స్టార్టింగ్ అని తెలుస్తోంది. 

హాటీ అనసూయ ఇంకా ట్రై చేస్తోంది

హాట్ యాంకర్ అనసూయ ప్రయత్నాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. జబర్దస్త్ షో ఈమెకి కిక్ ఇచ్చిన టైమ్ లో వరుసగా బోలెడన్ని సినిమా ఆఫర్స్ వచ్చాయి. అఫ్ కోర్స్.. అవన్నీ హాట్ హాట్ రోల్సే. అయితే.. వాటికి అప్పుడు నో చెప్పేసిన ఈ హాట్ యాంకర్.. ఇప్పటికి రెండంటే రెండు సినిమాలు చేసింది. ఆశ్చర్యం ఏంటంటే.. సోగ్గాడే చిన్ని నాయన - క్షణం.. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినా.. అనసూయకి మాత్రం ఏం ఒరగలేదు. 

తాను ఐటెం సాంగ్స్ చేసినా.. సినిమాలో తనకి కేరక్టర్ ఉండాలన్నది అప్పట్లో అనసూయ ప్రధాన డిమాండ్. దీనికి ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అనసూయ ఇప్పుడు ఓ మెట్టు దిగినట్లుగా కనిపిస్తోంది. ఈమధ్యనే వైట్ కలర్ మినీ డ్రస్సులతో హాట్ ఫోటో షూట్ చేసింది. ఇప్పుడ మళ్లీ ఇలా పొట్టి పొట్టి డ్రస్సులతో మేని మెరుపు చూపించేందుకు ట్రై చేస్తోంది. మినీ జీన్.. కొంచెం క్లీవేజ్ చూపించే స్లీవ్ లెస్ టాప్.. భుజాల ఆరబోస్తున్న డ్రెసింగ్.. కొత్త గా ట్రై చేసిన హెయిర్ స్టైల్.. అన్నీ బాగానే నప్పాయి. 

అయితే.. ఈ ఫోటో షూట్స్ హంగామా అంతా సినిమా ఛాన్సుల కోసమే అని చెప్పాల్సిన పని లేదు. ఆ విషయం అనసూయ బైటకు చెప్పదు.. సినిమా వాళ్లు అర్ధం చేసుకోవడంలో.. దర్శక నిర్మాతలూ అనసూయ ప్రయత్నాలను అర్థం చేసుకోరూ!

అనసూయ న్యూ ఫోటో షూట్





JOBS IN BEST MANUFACTURING COMPANYS