సమంత తల్లిదండ్రులది తెలుగు నేపథ్యం వున్నా... పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలోనే. అందుకే ఈ ముద్దుగుమ్మను చెన్నై పొన్ను అనే అంటారు ఇప్పటికీ. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించేస్తోంది ఈ చెన్నై సోయగం. మూలాలు చెన్నైతో ముడిపడి వుంటడంతో... అక్కడ కుర్రహీరోలను ఎంకరేజ్ చేయడానికి తన వంత సహాయం అందిస్తోంది. అందునా... తన తొలిచిత్రం(తెలుగులో) ‘ఏ మాయ చేశావే’ చిత్రానికి సంగీతం అందించిన ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ ను ప్రోత్సహించమంటే ఊరకే వుంటుందా. తనకు తోచిన సహాయం చేసేయదూ. అందుకే ఇప్పుడు ఈ కుర్రహీరో సినిమాను ప్రమోట్ చేయడానికి రంగంలోకి దిగింది సమంత.
సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తూ... సంగీతం అందిస్తున్న తాజా చిత్రం 'నాకు ఇంకో పేరుంది'. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తుంది. 'త్రిష లేదా నయనతార' చిత్రంలో జివి ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఈ చిత్రంలో కథానాయిక. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను ప్రముఖ కథానాయిక సమంతా తన ట్విటర్ ఖాతా నుండి ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనుందట. ఇలా చేయడం వల్ల ఆ సినిమాకి బోల్డంత ప్రచారం వస్తుందనేది నిర్మాతల ఆశ. అలాగే జి.వి.ప్రకాష్ కూడా తగినంత పబ్లిసిటీ లభిస్తుంది. అతి త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా జివి ప్రకాష్ మాట్లాడుతూ "యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇది. చిత్రీకరణ బాగా జరుగింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ గారి 'బాషా'లో సూపర్ హిట్ డైలాగును ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టాం. చిత్రంలో నా పేరు జానీ. 1980లో 'జానీ' పేరుతో రజనీకాంత్ చిత్రం ఒకటి విడుదల అయ్యింది. అలా రజనీ కాంత్ సినిమా పేరును, అతని సినిమాలోని పాపులర్ డైలాగును ఈ చిత్రానికి ఉపయోగించుకోవడం ఎంతో ఆనందంగా వుంది. సమంత మా చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేయనుండటం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14170/Samantha-Released-GV-Prakash-Naaku-Inko-Perundi-Movie-First-Look-Poster#sthash.q4YnWKGH.dpufసంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తూ... సంగీతం అందిస్తున్న తాజా చిత్రం 'నాకు ఇంకో పేరుంది'. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తుంది. 'త్రిష లేదా నయనతార' చిత్రంలో జివి ప్రకాష్ సరసన నటించిన ఆనంది ఈ చిత్రంలో కథానాయిక. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను ప్రముఖ కథానాయిక సమంతా తన ట్విటర్ ఖాతా నుండి ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనుందట. ఇలా చేయడం వల్ల ఆ సినిమాకి బోల్డంత ప్రచారం వస్తుందనేది నిర్మాతల ఆశ. అలాగే జి.వి.ప్రకాష్ కూడా తగినంత పబ్లిసిటీ లభిస్తుంది. అతి త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా జివి ప్రకాష్ మాట్లాడుతూ "యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఇది. చిత్రీకరణ బాగా జరుగింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రజనీకాంత్ గారి 'బాషా'లో సూపర్ హిట్ డైలాగును ఈ చిత్రానికి టైటిల్ గా పెట్టాం. చిత్రంలో నా పేరు జానీ. 1980లో 'జానీ' పేరుతో రజనీకాంత్ చిత్రం ఒకటి విడుదల అయ్యింది. అలా రజనీ కాంత్ సినిమా పేరును, అతని సినిమాలోని పాపులర్ డైలాగును ఈ చిత్రానికి ఉపయోగించుకోవడం ఎంతో ఆనందంగా వుంది. సమంత మా చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేయనుండటం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.
No comments:
Post a Comment