shorte links

Friday, March 18, 2016

నాగ్ మేనల్లుడు టైం మెషీన్ అంటున్నాడే..

నాగ్ మేనల్లుడు టైం మెషీన్ అంటున్నాడే..
టైం మెషీన్ అనగానే తెలుగు ప్రేక్షకులకు ఆటోమేటిగ్గా ‘ఆదిత్య 369’ సినిమా గుర్తుకొస్తుంది. తెలుగులోనే కాదు.. ఇండియా మొత్తంలో 90ల వరకు ఇలాంటి ప్రయోగం రాలేదు అప్పటికి. అందుకే ఈ సినిమా టాలీవుడ్లో ఓ ల్యాండ్ మార్క్ ఫిలిం అయింది. మళ్లీ అలాంటి సాహసాలు ఇంకెవరూ చేయలేదు తెలుగులో. ఇప్పుడు విక్రమ్ కె.కుమార్ కాలంలో ప్రయాణం నేపథ్యంలో ‘24’ సినిమాను తెరకెక్కించాడు. మరోవైపు బాలయ్య ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ చేయాలని ఉబలాటపడుతున్నాడు. ఐతే ఇప్పటిదాకా చెప్పుకున్న సినిమాలన్నీ సీరియస్ తరహాలో సాగేవే. ఐతే తొలిసారి టైం మెషీన్ నేపథ్యంలో తెలుగులో ఓ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కింది. అదే.. ఆటాడుకుందాం రా.

నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. తమిళ హీరోయిన్ సోనమ్ బజ్వా కథానాయిక. ఈ సినిమా టీజర్ ఈ రోజే రిలీజ్ చేశారు. పూర్తిగా టైమ్ మెషీన్ నేపథ్యంలో సినిమా సాగేట్లు లేదు కానీ.. అది సినిమాకు కీలకం అని మాత్రం అర్థమవుతోంది. మూడు సినిమాలు చేసినా హిట్టు రుచి చూడని సుశాంత్‌కు సక్సెస్ రుచి చూపించి తీరాలన్న కసితో.. మంచి ఎంటర్టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసినట్లున్నాడు నాగేశ్వరెడ్డి. సుశాంత్ గత సినిమాలతో పోలిస్తే ఇది భిన్నంగా.. కొంచెం జోష్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. బ్రహ్మానందం, పృథ్వీ, వెన్నెల కిషోర్ లాంటి ప్రముఖ కమెడియన్లు బాగానే నవ్వించే ప్రయత్నం చేసినట్లున్నారు. మురళీ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఎప్పట్లాగే సుశాంత్ తల్లి నాగసుశీలతో పాటు చింతలపూడి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగ్ సైతం నిర్మాణంలో భాగం పంచుకోవడం విశేషం. మేనల్లుడి కోసం ఈ రోజు ఆయనే స్వయంగా టీజర్ లాంచ్ చేశారు. అన్నట్లు ఈ రోజు సుశాంత్ బర్త్ డే కూడా లెండి. ఈసారైనా అతను సక్సెస్ కొడతాడేమో చూద్దాం.

No comments:

Post a Comment