shorte links

Friday, March 18, 2016

రజినీ ఫిక్సయ్యాడు.. చూస్కో మహేష్

రజినీ ఫిక్సయ్యాడు.. చూస్కో మహేష్
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే.. సందడి కేవలం తమిళనాడుకు పరిమితం అయిపోదు. సౌత్ ఇండియా మొత్తం షేకైపోతుంది. తమిళం తర్వాత రజినీకాంత్ సినిమాలకు ఎక్కువ డిమాండ్, మార్కెట్ ఉన్నది తెలుగులోనే. ఆయన సినిమాలు ఈజీగా పాతిక కోట్ల దాకా బిజినెస్ చేస్తాయి తెలుగులో. రిలీజ్ కూడా భారీగా ఉంటుంది. మన సూపర్ స్టార్లకు ఏమాత్రం తక్కువ కాని రీతిలో థియేటర్లిస్తారు. కాబట్టి రజినీకాంత్ సినిమా వస్తోందంటే మన స్టార్లు కూడా కొంచెం ఆచితూచి అడుగులేస్తారు. పోటీగా సినిమాలు రిలీజ్ చేయరు. ఈ సమ్మర్లో రజినీ తన కొత్త సినిమా ‘కబాలి’తో పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫమ్ అయిపోయింది. మే 27న ప్రపంచవ్యాప్తంగా ‘కబాలి’ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు నిర్మాత కలైపులి థాను.

మన సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’ కూడా మే నెలలోనే విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మే 6 అని.. 13 అని.. కాదు కాదు.. కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31న అని.. రకరకాల రిలీజ్ డేట్లు వినిపిస్తున్నాయి ‘బ్రహ్మోత్సవం’ విషయంలో. ఐతే ‘కబాలి’ 27కు ఫిక్సయింది కాబట్టి మహేష్ చివరి వారం మీద హోప్స్ వదిలేసుకోవాల్సిందే. 6 లేదా 13 తేదీలకే ఫిక్సయితే బెటర్. రజినీ వల్ల తెలుగు మార్కెట్లో వచ్చే ఇబ్బందుల సంగతి పక్కనబెడితే.. ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు తమిళ, మలయాళ భాషల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి మహేష్. ఈ చిత్రాన్ని ఆ రెండు భాషల్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి రజినీతో పెట్టుకుంటే కష్టం. కాబట్టి మే నెల ప్రథమార్ధానికే మహేష్ ఫిక్సవక తప్పదు.

No comments:

Post a Comment