shorte links

Friday, March 18, 2016

యూట్యూబ్‌కి పవర్ చూపిస్తున్నాడు

యూట్యూబ్‌కి పవర్ చూపిస్తున్నాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే.. రికార్డుల మోత మోగాల్సిందే. ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు సంబంధించి ఊరికే ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేసినా.. అది కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక టీజర్ వదిలితే రికార్డులు బద్దలవక ఏమవుతాయ్ చెప్పండి. మొన్న మధ్యాహ్నం ‘సర్దార్..’ ఆడియో టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అది రెండు రోజుల వ్యవధిలో యూట్యూబ్ సింగిల్ ఛానెల్లో 10 లక్షల వ్యూస్ మార్కును అందుకుంది. దాదాపు 44 వేల దాకా లైక్స్ కూడా పడ్డాయి ఈ టీజర్‌కి. తెలుగులో ఇంకే సినిమా టీజర్.. ఇంత వేగంగా ఇన్ని వ్యూస్, ఇన్ని లైక్స్ సంపాదించలేదు. మరోవైపు నిన్న రిలీజ్ చేసిన ‘సర్దార్..’ హిందీ టీజర్‌కు సైతం రెస్పాన్స్ బాగానే ఉంది. ఒక్క రోజు వ్యవధిలో 2.5 లక్షల మంది దాకా సర్దార్.. హిందీ టీజర్‌ను వీక్షించారు.

తెలుగు టీజర్‌తో పోలిస్తే హిందీ టీజర్‌ను భిన్నంగా రూపొందించిన సంగతి తెలిసిందే. తెలుగులో రిలీజ్ చేసింది ఆడియో టీజర్. అందులో పవన్ అల్లరి వేషాలు.. డ్యాన్సులు అవీ చూపించారు. ఐతే హిందీలో రిలీజ్ చేసింది యాక్షన్ టీజర్. ఫైట్ల మీద ఫోకస్ పెట్టారు. రెండు వేటికవే భిన్నంగా ఉండి జనాల దృష్టిని ఆకర్షించాయి. హిందీ టీజర్ రిలీజయ్యాక ట్విట్టర్లో అది నేషనల్ లెవెల్లో ట్రెండవడం విశేషం. ఈ నెల 20న ‘సర్దార్ గబ్బర్సింగ్’ ఆడియో రిలీజవబోతుండగా.. ఏప్రిల్ 8న తెలుగు, హిందీ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

No comments:

Post a Comment