shorte links

Wednesday, March 16, 2016

సూర్యకి నో.. శివ ఓకే.. దటీజ్ పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ పూర్తి కాగానే.. ఎస్ జే సూర్య డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడు. దీనికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి. అయితే.. ఈ సినిమా స్టోరీకి సంబంధించిన ఓ అప్ డేట్ ఇప్పుడు బయటకొచ్చింది. ఖుషీ2 అని అనుకుంటున్న ఈ మూవీకి దర్శకుడు ఎస్ జే సూర్య స్టోరీని పవన్ పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. 

సూర్య చెప్పిన స్టోరీ లైన్ బాగున్నా.. దాన్ని పూర్తి స్క్రిప్ట్ గా మార్చడంలో ఈ దర్శకుడు ఫెయిల్ అయ్యాడట. అయితే ఇదే సమయంలో ఆకుల శివ చెప్పిన స్టోరీ సూపర్బ్ గా నచ్చడంతో.. ఆ కథను ఓకే చేసిన పవన్.. దర్శకత్వ బాధ్యతలను మాత్రం ఎస్ జే సూర్యకే అప్పగించాడని టాక్ వినిపిస్తోంది. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ కు అనేక స్టోరీలు అందించాడు ఆకుల శివ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టైల్ - మేనరిజమ్స్ తగినట్లుగా.. ఓ మంచి రోల్ చుట్టూ రాసిన స్టోరీ.. పవర్ స్టార్ కి బాగా నచ్చిందని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. 

పవన్-ఎస్జే సూర్య కాంబినేషన్ లో రానున్న సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిచనున్నాడు. గోపాలాగోపాలా టైంలో.. తన సినిమా ఆఫర్ ఇస్తానని చేసిన ప్రామిస్ ని ఇలా నెరవేర్చుకుంటున్నాడు పవర్ స్టార్. మరోవైపు ఖుషీ2ని పవన్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ నిర్మిస్తుండడం విశేషం.

No comments:

Post a Comment