shorte links

Wednesday, March 16, 2016

జగ్గూ కూడా భయపెట్టడానికీ రెడీ

ప్రస్తుతం 'నాన్నకు ప్రేమతో' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ.. తదుపరి సినిమాల్లో ఇంకాస్త అదరగొట్టేయాలని చూస్తున్నాడు సీనియర్ నటుడు జగపతి బాబు. విలన్ వేషాలను వేయాడానికి మనస్సును ఒప్పించేసుకున్న తరువాత అస్సలు ఎక్కడా తగ్గట్లేదు ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ వీరుడు. త్వరలోనే తమిళంలో సూపర్ స్టార్ విజయ్ కు విలన్ గా నటిస్తున్నప్పటికీ.. త్వరలో మనోడు తెలుగులో చేయబోయే సినిమా అతిపెద్ద హైలైట్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో జగపతి హీరోయన్ తండ్రిగానే కాదు.. ఒక డేంజరస్ విలన్ గా కూడా చేస్తున్నాడు.

అబ్బే విలనీ కొత్తదేం కాదుగా అనుకోకండి.. ఎందుకంటే ఈ సినిమాలో జగపతి బాబు ఒక దెయ్యంగా నటిస్తున్నాడట. హీరోయన్ ఈషా మెయిన్ లీడ్ గా కొత్త దర్శకుడు సుధాకర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో.. జగపతి ఆమె తండ్రిగా ప్లస్ ఒక దెయ్యంగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో జగపతి రోల్ ఎలా ఉండోబోతోంది అనే విషయం సినిమా రిలీజ్ అయ్యేవరకు ఏ మాత్రం రివీల్ చేయకూడాదని యునిట్ సభ్యులు నిర్ణయించుకున్నారట. అందుకే ఈ న్యూస్ ను చాలా సీక్రెట్ గా ఉంచారు. 

మొత్తానికి చాలామంది హీరోయిన్ల బాటలో ఇప్పుడు జగ్గూ కూడా భయపెట్టేస్తాడనమాట. లెటజ్ సీ

No comments:

Post a Comment