
ముంబయి: బాలీవుడ్ బబ్లీగర్ల్ అలియా భట్ 23వ పుట్టినరోజు నేడు. మీ పుట్టినరోజును ఎక్కడ జరుపుకోనున్నారు అని మీడియా అడిగిన ప్రశ్నకు.. దిల్లీలో అని తడుముకోకుండా చెప్పింది అలియా. అందులో వింతేముంది అంటారా..? నటుడు సిద్దార్థ్ మల్హోత్రా పుట్టింది కూడా దిల్లీలోనే..! వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నా సిద్దార్థ్ నాకు ఎప్పటికీ స్నేహితుడే.. అని చెబుతోంది అలియా. ఓ పక్క ప్రేమ పుకార్లను ఖండిస్తూనే మరో పక్క సిద్దార్థ్‌తో కలిసి ఎంచక్కా చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు సిద్దార్థ్ అలియాను తాను పుట్టి పెరిగిన దిల్లీకి తీసుకెళ్లి ఇప్పటివరకు అలియా చూడని ప్రదేశాలను చూపించనున్నాడట. వీరిద్దరూ కలిసి నటించిన కపూర్ అండ్ సన్స్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
No comments:
Post a Comment