పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ బొంబాయిలో ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టేసారు. అయితే ఈ చిత్రానికి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం వలనే బొంబాయిలో మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారనే వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ విడిపోయినా ఈ సినిమాతో మళ్లీ దగ్గరవుతున్నారని ఫ్యాన్స్ సంబరపడ్డారు.
అయితే రేణు తాజాగా చేసిన ఓ ట్వీట్ తో అభిమానుల ఆశలపై నీళ్ళు చల్లింది. ఆమె ట్వీట్ లో పవన్ సినిమా ప్రస్తావన లేక పోయినా.. ఆమె ఉద్దేశ్యం మాత్రం ఆ సినిమా గురించే అని అంటున్నారు. నాకు సంబంధించిన ఏ విషయం అయినా.. నిజమైతే నేనే ట్విట్టర్ ద్వారా తెలియచేస్తాను. అంతే కానీ ఏదేదో ఊహించుకోకండి అంటూ ట్వీట్ చేసింది. దీంతో పవన్ సినిమాకు రేణు నిర్మాతగా వ్యవహరిస్తుందో.. లేదో అనే అనుమానంలో అభిమానులున్నారు

No comments:
Post a Comment