తనపై అత్యాచారం జరిపిన ఆరుగురు అబ్బాయిలను శిక్షించిన ఓ అమ్మాయి కథతో మా చిత్రం తెరకెక్కిందన్నారు రామచంద్ర దోసపాటి. ఆయన కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘అమ్మాయి ఆరుగురు’. ఆశాలత కథానాయిక. జి.మురళీప్రసాద్ దర్శకత్వం వహించారు. చిత్రాన్ని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విలేకరుల సమావేశంలో రామచంద్ర దోసపాటి మాట్లాడుతూ ‘‘చిన్నప్పట్నుంచీ నటించాలనే కోరిక ఉంది. అది ఈ చిత్రంతో నెరవేరింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో హారర్ అంశాల్నీ జోడించాం. కథ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సినిమాకి ప్రధానాకర్షణ. నా తదుపరి చిత్రాన్ని కూడా రెండు నెలల్లో మొదలెడతా. దానిలో మంచి పాత్రలో కనిపిస్తా. ఇతర నిర్మాతల చిత్రాల్లోనూ నటించాలనుంద’’న్నారు.
No comments:
Post a Comment