shorte links

Wednesday, March 16, 2016

వేసవిలో ప్రేక్షకులకు ‘బ్రహ్మోత్సవం’?

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. హరిద్వార్‌, ఉదయ్‌పూర్‌లలో ఈ చిత్రం లాంగ్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందని మహేశ్‌బాబు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆయన అభిమానులతో పంచుకుంటూ సెట్‌లో తీసిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. లాంగ్‌ షెడ్యూల్‌ తరువాత, చివరికి నగరానికి చేరుకున్నామని... ఇంకా కొంచెం షూటింగ్‌ మిగిలి ఉందని ట్వీట్‌ చేశారు. చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి పొట్లూరి, మహేశ్‌బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమంత, కాజల్‌, ప్రణీత కథానాయికలు. మిక్కీ జె మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

No comments:

Post a Comment