shorte links

Wednesday, March 16, 2016

సల్మాన్‌ని ఎలాగైనా పెళ్లికి ఒప్పిస్తా..

ముంబయి: ఇప్పటివరకు సల్మాన్‌ కుటుంబీకులు చేయలేని పనిని తాను చేసి చూపిస్తానంటున్నాడు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌. ఇంతకీ ఆ పనేమిటంటే సల్మాన్‌ని పెళ్లికి ఒప్పించడం అని చెబుతున్నారు. 50 ఏళ్లు వచ్చినా బాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో సల్మాన్‌ ఒకడు. ప్రస్తుతం సల్మాన్‌ రొమేనియన్‌ మోడల్‌ లులియా వ్యాంటూర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. లులియాకి హిందీ నేర్పించాలని సల్మాన్‌ ప్రత్యేక ట్యూషన్లుకూడా పెట్టించనున్నాడని అంతకుముందు వార్తలు వెలువడ్డాయి. ఎన్ని లవ్‌ ఎఫైర్స్‌ ఉన్నా సల్మాన్‌ పెళ్లి విషయం మాత్రం ప్రస్తావించడంలేదు అందుకే ఈ సారి ఎలాగైనా సల్మాన్‌ని పెళ్లికి ఒప్పిస్తానని ఆమీర్‌ పట్టుబట్టాడు. మరి ఈ విషయంలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ గెలుస్తాడో లేదో చూడాలి!

No comments:

Post a Comment