పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్.. తెలుగుతో పాటు అదే సమయంలో హిందీలో కూడా విడుదలవుతోంది. ఈ మేరకు ఇప్పటికే హిందీ సర్దార్ గబ్బర్ సింగ్ కి సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదల చేశారు. హిందీ రిలీజ్ కోసమే స్పెషల్ గా బాలీవుడ్ మీడియా పర్సన్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు పవన్. కానీ పవన్ బాలీవుడ్ లో సక్సెస్ సాధించగలడా అన్నదే అసలు ప్రశ్న.
ఈరోస్ ఒత్తిడితో ఇలా హిందీ రిలీజ్ కు పవన్ ఒప్పుకోవాల్సి వచ్చింది. గతంలో ఇలాంటి ఎటెంప్ట్ పవన్ ఎప్పుడూ చేయలేదు. దబాంగ్ థీమ్ తో రూపొందే మూవీస్ లో అక్కడ సల్మాన్ ని చూడ్డం జనాలకు అలవాటు. ఇప్పుడు పవన్ వారికి పూర్తిగా కొత్త కావడంతో.. రిజల్ట్ పై సందేహాలున్నాయి. మరోవైపు మెగా ఫ్యామిలీకి బాలీవుడ్ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. చిరంజీవి తొలి హిందీ సినిమా ప్రతిబంధ్ పర్లేదనిపించినా.. ఆ తర్వాత ఆజ్ కా గూండారాజ్ - ది జెంటిల్మేన్ లు ఏ మాత్రం నిలబడలేకపోయాయి. ఇక రామ్ చరణ్ సంగతైతే చెప్పనక్కర్లేదు. జంజీర్ ని రీమేక్ చేసి మాటలు కూడా పడాల్సి వచ్చింది.
మరి ఇలాంటి ట్రాక్ రికార్డ్ ను బద్దలు కొట్టి.. మెగా ఫ్యామిలీకి బాలీవుడ్ లో పవన్ హిట్ అందించగలడా అన్నది అసలు క్వశ్చన్. మరోవైపు సల్మాన్ ను చూడాల్సిన రోల్ లో ఆడియన్స్ పవన్ ను ఏ మాత్రం యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. అయితే.. ముందు కాళ్లు పైకి లేపి ఎగురుతున్న గుర్రంపై.. పవన్ వెనక నుంచి కనిపిస్తున్న పోస్టర్.. ఇప్పటికే బాలీవుడ్ లో ఆసక్తిని కలుగచేసిందని ఈరోస్ వర్గాలు అంటున్నాయి.

No comments:
Post a Comment