మార్చి 19.. విలక్షణ నటుడు మోహన్ బాబు జన్మదినం ప్రతి సంవత్సరం తిరుపతిలో తాను నెలకొల్పిన విద్యానికేతన్ స్కూల్లో జన్మదిన వేడుకలు చేసుకుంటారు మోహన్ బాబు. జిల్లాలోని ఎందరో ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా వచ్చి శుభాకాంక్షలు చెబుతుంటారు. బొకేలు బహుమతులు ఇస్తుంటారు. ఐతే ఇకపై అలాంటి కట్టిపెట్టమంటున్నారు మోహన్ బాబు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఇలా వృథా ఖర్చు చేయొద్దని.. దాని బదులు ఆ డబ్బులతో మంచి పని చేయమని చెబుతున్నారాయన. మిరాకిల్ అనే స్వచ్ఛంద సంస్థకు సహకారం అందించమని తన అభిమానులు - శ్రేయోభిలాషులకు పిలుపునిచ్చారు మోహన్ బాబు.
‘‘1993 నుండి ప్రతి పుట్టినరోజును విద్యానికేతన్ లో పిల్లల మధ్య జరుపుకోవడం అలవాటు. ఐతే ప్రతి పుట్టినరోజున శుభాకాంక్షలతో పాటు వందల సంఖ్యల పుష్పగుచ్చాలు - పూల దండలు అందుకుంటాను. అవి మరుసటి రోజుకు వాడిపోతాయి. చెత్తకుప్పలో పడేస్తాం. ఐతే ఈ ఏడాది నుంచి బొకేలు - పూలదండలు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నా. ఎవరూ నా కోసం అవి తీసుకురాకండి. దాని బదులు ఆ డబ్బుల్ని మిరాకిల్ ఫౌండేషన్ కు అందజేయండి. ఇటీవల మిరాకిల్ ఫౌండేషన్ ను సందర్శించి వారు సమాజానికి అందిస్తున్న తోడ్పాటు చూసి ఇంప్రెస్ అయ్యాను. 3000 మంది ఆనాథ పిల్లలకు తమ వంతుగా సహాయ సహాకారాలను అందిస్తున్నారు. ఇలాంటి సంస్థలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నా పుట్టినరోజు కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని సదరు మిరాకిల్ ఫౌండేషన్ సంస్థకు పంపండి’’ అని మోహన్ బాబు ఓ ప్రకటనలో చెప్పారు.

No comments:
Post a Comment