shorte links

Monday, March 21, 2016

బాహుబలి-2లో ఇంకా క్రూరంగా ఉంటాడట

బాహుబలి-2లో ఇంకా క్రూరంగా ఉంటాడట
తెలుగువాడు తీస్తూ.. తెలుగువాళ్లు నటిస్తూ.. తెలుగువాళ్లు నిర్మిస్తున్న సినిమా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా..? మన దర్శక ధీరుడు రాజమౌళి పుణ్యమా అని మన సినిమాకు అంత గుర్తింపు వచ్చింది. 'బాహుబలి'తో దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసిన జక్కన్న.. బాహుబలి-2 కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసేలా చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న సమాచారం కనిపించినా.. వినిపించినా.. చాలా ఆసక్తిగా చూస్తున్నారు జనాలు. ఇలాంటి తరుణంలో తాను పోషిస్తున్న భల్లాలదేవుడి పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు రానా.

భల్లాలదేవుడి పాత్ర తొలి భాగంలో కంటే రెండో భాగంలో చాలా క్రూరంగా ఉంటుందని అతను వెల్లడించారు. జనాలు మరింతగా ఈ పాత్రను అసహ్యించుకుంటారని.. తనను చూసి అమ్మాయిలందరూ మరింతగా భయపడతారని రానా చెప్పాడు. భల్లాలదేవుడికి భార్యగా నటించే హీరోయిన్ విషయంలో సాగుతున్న ఊహాగానాల గురించి రానా మాట్లాడుతూ.. ''భల్లాలదేవుడు రొమాన్స్ చేసేది అమ్మాయిలతో కాదు.. సింహాసనంతో. బాహుబలి-2లో కొత్త పాత్రలేవైనా ఉంటే వాటిని కచ్చితంగా వెల్లడిస్తాం. దాచాల్సిన అవసరమేమీ లేదు. కాబట్టి వెయిట్ చేయండి'' అన్నాడు. తాను ఇంకా 'బాహుబలి: ది కంక్లూజన్' షూటింగ్లో పాల్గొనలేదని.. త్వరలోనే రంగంలోకి దిగుతానని రానా వెల్లడించాడు. 
- See more at: http://telugu.gulte.com/tmovienews/14209/Rana-Role-In-Baahubali-2#sthash.CBoYmHZJ.dpuf

No comments:

Post a Comment