shorte links

Monday, March 21, 2016

పవన్‌కే పంచ్ పడితే..

పవన్‌కే పంచ్ పడితే..
చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటారు. ప్రెస్ మీట్లు పెట్టినపుడు మన సినీ తారలు.. రాజకీయ నాయకులు ఈ తరహాలోనే మాట్లాడుతుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ లక్షణం ఎక్కువుంటుంది. మీడియా వాళ్లు ఏదైనా ఇబ్బందికర ప్రశ్న వేస్తే.. వాళ్ల మీదికి పంచ్‌లు విసిరేస్తుంటారు. జర్నలిస్టులకు పొలిటికల్ ఉద్దేశాలు ఆపాదించి.. పంచ్‌లు వేయడం మన నాయకులకు బాగానే అలవాటు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ నాయకుడే కదా.. మన పొలిటికల్ లీడర్ల తరహాలోనే పంచ్ వేయబోయాడు. ఐతే ఓ విలేకరి ఆయనకు తిరిగి పంచ్ వేసి షాకిచ్చాడు.

నిన్న పవన్ కళ్యాణ్ అనుకోకుండా ఓ ప్రెస్ మీట్ పెట్టి విలేకరులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ విలేకరి పవన్‌ను రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న వేశాడు. దీంతో పవన్‌కు కోపం వచ్చేసింది. ‘‘మీరు సినిమా జర్నలిస్టా.. పొలిటికల్ జర్నలిస్టా’’ అంటూ పంచ్ వేశాడు. ఐతే ఆ విలేకరి ఏమాత్రం తొణక్కుండా.. ‘‘మీరు సినీ హీరో అలాగే పొలిటీషియన్ కద సార్’’ అన్నాడు. అంతే పవన్ ఇక దీని మీద ఏమీ మాట్లాడ్డానికి వీల్లేకపోయింది. అయినా మొన్న బాలీవుడ్ క్రిటిక్ అనుపమ చోప్రాకు ఇంటర్వ్యూ ఇచ్చినపుడు సినిమాల మీదా మాట్లాడాడు.. రాజకీయాల ప్రస్తావన కూడా తెచ్చాడు పవన్. మరి ఆమె దగ్గర లేని ఇబ్బంది.. మన తెలుగు జర్నలిస్టుల దగ్గర ఏమొచ్చింది..? వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వాళ్లిష్టం.. పబ్లిక్ లైఫులోకి వస్తే ఏమైనా అంటాం.. అన్నాడో మహాకవి. అలాగే ప్రెస్ మీట్ పెట్టినపుడు జర్నలిస్టులు కూడా ఏ ప్రశ్న అయినా అడగొచ్చండోయ్.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14190/Pawan-shocks-with-Journalists-Punch#sthash.jRGcykjt.dpuf

No comments:

Post a Comment