
ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ‘రుద్రమదేవి’ సినిమా తీశాడు గుణ. విడుదలకు ముందు కూడా అతను ఎన్నెన్ని కష్టాలు పడ్డాడో అందరికీ తెలిసిందే. ఐతే రూ.70 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీసిన గుణ.. నిండా మునిగిపోవడం ఖాయమని చాలామంది అంచనా వేశారు కానీ, అతను చివరి తక్కువ నష్టాలతోనే బయటపడ్డాడు. ‘రుద్రమదేవి’ అంచనాల్ని మించి ఆడింది. గుణ మళ్లీ ఇంకో సాహసం చేయడానికి కావాల్సిన ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘రుద్రమదేవి’ తాలూకు స్ట్రెస్ నుంచి బయటపడ్డానికి ఓ ఆర్నెల్ల దాకా విశ్రాంతి తీసుకున్న గుణ.. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టు పని మొదలుపెట్టాడు. ‘రుద్రమదేవి’ చివర్లోనే ‘ప్రతాపరుద్రుడు’ పేరుతో తన తర్వాతి సినిమాను తెరకెక్కించబోతున్నట్లు హింట్ ఇచ్చాడు గుణ.
మధ్యలో ‘గోనగన్నారెడ్డి’ సినిమా తెరమీదికి వచ్చింది కానీ.. తర్వాత ఆ ప్రయత్నాలు పక్కనబెట్టేసి ‘ప్రతాపరుద్రుడు’ చేయడానికే రెడీ అయ్యాడు గుణ. ఈ సినిమాలో హీరో బాలకృష్ణ అని.. ప్రభాస్ అని.. రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఐతే ఆ రూమర్లన్నింటినీ ఖండించిన గుణ.. సైలెంటుగా స్క్రిప్టు మీద పని చేసుకుంటున్నాడు. ఇండియాలో చిట్టచివరి రాజు అయిన ప్రతాపరుద్రుడి గురించి తెలుసుకునేందుకు లైబ్రరీల మీద పడ్డాడు. చరిత్రకారుల్ని కలుస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఓ అద్భుతమైన పుస్తకం దొరికిందట. శతాబ్దం కిందట, 1910లో రాసిన ‘హిందూ మహాయుగము’ అనే పుస్తకాన్ని సంపాదించాడు గుణ. ఇందులో ప్రతాపరుద్రుడి గురించి కూడా చాలా సమాచారం ఉందట. ఈ పుస్తకం తన సినిమాకు చాలా ఉపయోగపడుతుందని సంబరపడుతున్నాడు గుణ. ఈ విషయాన్ని ట్విట్టర్లో కూడా షేర్ చేసుకుని సంతోషించాడు గుణ. మొత్తానికి ‘ప్రతాపరుద్రుడు’ కోసం గుణ బాగానే కష్టపడుతున్నాడన్నమాట.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14186/Gunasekhar-got-a-book-100-years-old-#sthash.Cc3IwteK.dpufమధ్యలో ‘గోనగన్నారెడ్డి’ సినిమా తెరమీదికి వచ్చింది కానీ.. తర్వాత ఆ ప్రయత్నాలు పక్కనబెట్టేసి ‘ప్రతాపరుద్రుడు’ చేయడానికే రెడీ అయ్యాడు గుణ. ఈ సినిమాలో హీరో బాలకృష్ణ అని.. ప్రభాస్ అని.. రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఐతే ఆ రూమర్లన్నింటినీ ఖండించిన గుణ.. సైలెంటుగా స్క్రిప్టు మీద పని చేసుకుంటున్నాడు. ఇండియాలో చిట్టచివరి రాజు అయిన ప్రతాపరుద్రుడి గురించి తెలుసుకునేందుకు లైబ్రరీల మీద పడ్డాడు. చరిత్రకారుల్ని కలుస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఓ అద్భుతమైన పుస్తకం దొరికిందట. శతాబ్దం కిందట, 1910లో రాసిన ‘హిందూ మహాయుగము’ అనే పుస్తకాన్ని సంపాదించాడు గుణ. ఇందులో ప్రతాపరుద్రుడి గురించి కూడా చాలా సమాచారం ఉందట. ఈ పుస్తకం తన సినిమాకు చాలా ఉపయోగపడుతుందని సంబరపడుతున్నాడు గుణ. ఈ విషయాన్ని ట్విట్టర్లో కూడా షేర్ చేసుకుని సంతోషించాడు గుణ. మొత్తానికి ‘ప్రతాపరుద్రుడు’ కోసం గుణ బాగానే కష్టపడుతున్నాడన్నమాట.
No comments:
Post a Comment