shorte links

Monday, March 21, 2016

తేజతో అతడు.. పుష్కరం తర్వాత

తేజతో అతడు.. పుష్కరం తర్వాత
డైరెక్టర్ తేజ.. చాలామంది నటీనటులకు లైఫ్ ఇచ్చాడు. నవదీప్ కూడా అతను పరిచయం చేసిన వాడే. తాను పరిచయం చేసిన కొంతమందికి తలపొగరు ఎక్కువై తననే పట్టించుకోని స్థితికి వచ్చేశారని.. కానీ కొందరు మాత్రం తన మేలు మరిచిపోలేదంటూ.. ఆ జాబితాలో నవదీప్ పేరు కూడా చెప్పాడు తేజ ఆ మధ్య.

ఐతే ప్రస్తుతం తేజ ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడో.. నవదీప్ కూడా అలాగే కష్టాల్లో ఉన్నాడు. ఈ టాలెంటెడ్ హీరోకు తెలుగులో అవకాశాలే లేవు. ఈ పరిస్థితుల్లో తన కొత్త సినిమాలో తేజ...నవదీప్‌కు హీరోగా ఛాన్సివ్వడం విశేషం. సరిగ్గా పుష్కరం కిందట వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘జై’ సినిమా వచ్చింది. అది ఫ్లాపైనా.. నవదీప్ టాలెంట్ ఏంటో ఇండస్ట్రీకి తెలిసిందే. ఆ తర్వాత మంచి మంచి అవకాశాలు అందుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్.

మళ్లీ ఇన్నేళ్లకు తేజ దర్శకత్వంలో నవదీప్ నటించడం విశేషమే. ‘అహం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతడిది కూడా హీరో స్థాయి పాత్రేనట. ఈ చిత్రంలో రాజశేఖర్ విలన్ క్యారెక్టర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దాడట తేజ. రాజశేఖర్, నవదీప్, తేజ.. ఈ ముగ్గురికీ కూడా ‘అహం’ చాలా చాలా కీలకం. ఈ సినిమాతో ముగ్గురి కెరీర్ మలుపు తిరుగుతుందేమో చూద్దాం మరి.

No comments:

Post a Comment