shorte links

Monday, March 21, 2016

రామ్‌ చరణ్‌ ఈసారి ఆ తప్పు చేయట్లేదు

రామ్‌ చరణ్‌ ఈసారి ఆ తప్పు చేయట్లేదు
'బ్రూస్‌లీ' చిత్రం ఫ్లాప్‌ అయినా కానీ రామ్‌ చరణ్‌కి లుక్స్‌ పరంగా బెస్ట్‌ సినిమా అనేది మాత్రం కాదనలేని నిజం. తన లుక్స్‌ పరంగా విపరీతమైన ప్రయోగాలకి వెళుతోన్న రామ్‌ చరణ్‌ 'బ్రూస్‌లీ'లో మాత్రం అలాంటివేం లేకుండా గ్లామరస్‌గా కనిపించాడు. అయితే ఈ చిత్రం తర్వాత చేయబోతున్న సినిమాలో పోలీస్‌ క్యారెక్టర్‌ అనేసరికి మళ్లీ ఎక్కడ ఈ లుక్‌ పోగొట్టుకుంటాడో, సిక్స్‌ ప్యాక్‌ అంటూ మళ్లీ 'తుఫాన్‌'కి చేసిన తప్పు ఎక్కడ చేస్తాడోనని అభిమానులు వర్రీ అయ్యారు. 'థని ఒరువన్‌' రీమేక్‌లో తన లుక్‌ ఎలా వుంటుందనేది ఇంతకాలం బయట పెట్టని రామ్‌ చరణ్‌ మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఉత్సవాలకి వచ్చిన సందర్భంలో కనిపించినప్పుడు అందులో ఎలా వుంటాడనేది తేలిపోయింది. 

రామ్‌ చరణ్‌ ఈ చిత్రంలో 'రచ్చ' సినిమాలో కనిపించినట్టుగా కనిపించబోతున్నాడు. హెయిర్‌ స్టయిల్‌ షార్ట్‌ చేయడం కానీ, సిక్స్‌ ప్యాక్‌ అంటూ పీక్కుపోయిన ముఖంతో కానీ చరణ్‌ కనిపించడు. థని ఒరువన్‌ తెలుగులో ఎలా తయారవుతుందనేది తర్వాతి సంగతి కానీ చరణ్‌ లుక్స్‌ పరంగా మాత్రం ఈ సినిమాపై ఫాన్స్‌ ఏమీ బెంగ పడాల్సిన పనిలేదు.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14207/Ram-CHaran-ain-thani-Oruvan-Remake#sthash.qyULSIaN.dpuf

No comments:

Post a Comment