shorte links

Monday, March 21, 2016

సర్దార్ పాసులు ఎంత పలుకుతున్నాయ్..

సర్దార్ పాసులు ఎంత పలుకుతున్నాయ్..
ఒకప్పుడు సినిమా టికెట్లు మాత్రమే బ్లాక్‌లో అమ్మేవాళ్లు. కానీ ఇప్పుడు ఆడియో వేడుకల పాస్‌లు సైతం వేలం పాట వేసే అమ్మేసే రోజులు వచ్చేశాయి. బ్లాక్‌లో టికెట్టు కొని థియేటర్లోకి వెళ్తే తెర మీద బొమ్మ మాత్రమే చూడొచ్చు. కానీ ఆడియో ఫంక్షన్ పాస్ తీసుకుంటే.. తమ అభిమాన కథానాయకుడిని నేరుగా చూసుకోవచ్చు. ఇంకా చాలామంది సెలబ్రెటీల్ని చూడొచ్చు. చాలా కార్యక్రమాల్ని ఆస్వాదించొచ్చు. గోల చేయొచ్చు.. కేరింతలు కొట్టొచ్చు.. అదృష్టం బాగుంటే తమ అభిమాన కథానాయకుడికి కొంచెం దగ్గరగా వెళ్లి ఫొటో కూడా దిగొచ్చు. అందుకే పెద్ద హీరోల ఆడియో ఫంక్షన్లకు సంబంధించిన పాస్‌లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది ఈ మధ్య.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి హీరోల ఆడియో వేడుకలకు వేలకు వేలు పోసి.. పాస్‌లు సంపాదిస్తున్నారు అభిమానులు. మా హీరో సినిమా టికెట్ ఇంత పలికింది అని గొప్పలు చెప్పుకున్నట్లే.. ఆడియో ఫంక్షన్ల పాస్‌లకు సంబంధించి వేలం పాటల వివరాల్ని కూడా సోషల్ మీడియాలో ఘనంగా షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఆదివారం జరగబోయే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్ పాస్‌లు కూడా ఒక్కొక్కటి కొన్ని వేలల్లో అమ్ముడుబోతున్నాయట. అభిమాన సంఘాల ద్వారా పాస్‌లు దక్కించుకున్నవాళ్లు.. వీటికి ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ బేరం పెడుతున్నారు. కొందరు ఆన్ లైన్లో సైతం వీటిని సేల్‌కు పెడుతున్నారు. ‘సర్దార్..’ ఆడియో వేడుక రోజు నాటికి ఈ పాస్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడే అవకాశముంది. ఆ రోజు వెన్యూ ముందు పాస్‌లు బేరానికి పెడితే అనూహ్యమైన ధరలు పలకడం ఖాయం.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14176/Sardaar-Gabbarsingh-Audio-Launch-Passes-Costs-Bomb#sthash.VwxMyHHZ.dpuf

No comments:

Post a Comment