shorte links

Monday, March 21, 2016

బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : క్షణం
Next
 
క్షణం : క్షణం.. అడివి శేష్, అదా శర్మ, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించగా, కొత్త దర్శకుడు రవికాంత్ పేరేపు తెరకెక్కించిన సినిమా. ఫిబ్రవరి 26న మంచి క్రేజ్‌తో విడుదలైన ఈ సినిమా, ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే అందరినీ మెప్పించి హిట్ కొట్టింది. తెలుగు సినిమాకు ఓ కొత్తదనమున్న సినిమాను పరిచయం చేసిన థ్రిల్లర్‌గా 'క్షణం'కు మొదట్నుంచీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రెండో వారం కూడా ఈ సినిమా ఏ సెంటర్స్‌లో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
‘క్షణం’ కోసం కొత్త తరహా థ్రిల్లర్ ని సబ్జెక్ట్ ని ఎన్నుకోవడమే మేజర్ ప్లస్. మొదట్నుంచి చివరి వరకూ ఎక్కడా సినిమా ఫ్లో మిస్ అవ్వకుండా పకడ్బందీగా అల్లిన సన్నివేశాలు బాగా మెప్పిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. నటీనటులంతా ఈ సినిమాను మరో ఎత్తుకి తీసుకెళ్ళారు. అడివి శేష్ సినిమాను దాదాపుగా తన భుజాలపై మోశాడనే చెప్పుకోవాలి. ఫస్ట్ ఫ్రేం దగ్గర్నుంచి చివరి ఫ్రేం వరకూ అడివి శేష్ అద్భుతమైన నటనని కనబరిచాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆద శర్మ చాలా బాగా ఆకట్టుకుంది. అనసూయ ఒక పోలీస్ పాత్రలో చాలా బాగా నటించింది. టఫ్ పోలీస్ గా సత్యం రాజేష్ సూపర్బ్ గా చేసాడు.
 
 సినిమాలో అక్కడక్కడా కొన్ని విషయాలను పూర్తిగా చెప్పకుండా మధ్యలో వదిలేసినట్లనిపించింది. అనసూయ పాత్ర మీద డిజైన్ చేసిన కొన్ని సీన్స్ సహజత్వానికి కొంచెం దూరంగా ఉంటాయి. సెకండాఫ్‌లో సినిమా వేగం కాస్త తగ్గుతుంది. ఫస్టాఫ్‌లో వచ్చే ఓ పాట కూడా సినిమా ఫ్లోను కాస్త దెబ్బతీసిందనే చెప్పాలి. ఇక ఈ తరహా కథాంశం, కథనం ఉన్న సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మాత్రమే చూసేవారికి పెద్దగా నచ్చకపోవచ్చు. 


 
బాక్స్ ఆఫీసు వద్ద :
 
ఎ సెంటర్స్ : ఫర్వాలేదు
 
బి సెంటర్స్ : అంత బాగా ఆడడం లేదు
 
సి సెంటర్స్ : అంత బాగా ఆడడం లేదు
 
తీర్పు : హిట్

No comments:

Post a Comment