shorte links

Monday, March 21, 2016

పవన్‌ అంతే... రెండో మాట ఉండదు

పవన్‌ అంతే... రెండో మాట ఉండదు
పవన్‌కళ్యాణ్‌ కనిపించగానే చిరంజీవితో సంబంధాల గురించి, రాంగోపాల్‌వర్మ ట్వీట్ల గురించి అడిగేసి, అతను టంగ్‌ స్లిప్‌ అయితే దుమారం రేపవచ్చు అని చూసిన వారికి అతను ఛాన్సే ఇవ్వలేదు. చిరంజీవితో సంబంధాల గురించి ప్రశ్న కూడా రాకుండా పవన్‌ తెలివిగా ముందే చిరంజీవిని సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఆడియో లాంఛ్‌కి పిలిచినట్టు చెప్పాడు. అక్కడితో ఆగకుండా అన్నయ్యపై తనకున్న సెంటిమెంట్‌ని చాటుకుంటూ 'గబ్బర్‌సింగ్‌' ఆడియో కూడా ఆయనే లాంఛ్‌ చేశారని గుర్తు చేసాడు. ఇంకాస్త సెంటిమెంట్‌ జోడిస్తూ చాలా కాలం తర్వాత తను రాసిన కథ ఇదే కనుక ఈ చిత్రానికి అతిథిగా అన్నయ్య వస్తే బాగుంటుందని ఫీలయ్యానని అన్నాడు. దీంతో ఇక ప్రెస్‌మీట్‌లో చిరంజీవి ప్రస్తావన తేవాల్సిన అవసరమే మీడియాకి కనిపించలేదు. 

ఇక రాంగోపాల్‌వర్మ విషయాన్ని ప్రస్తావించి, ఆయన ట్వీట్ల గురించి స్పందించమంటే ఆయన అభిప్రాయాల్ని తాను గౌరవిస్తానని పవన్‌ అన్నాడు. అంతకుమించి ఒక్క మాట కూడా లేదు. తన ట్వీట్స్‌ గురించి పవన్‌ కనుక ఏదైనా వెటకారం చేస్తే ఇక రాంగోపాల్‌వర్మకి కొన్ని రోజుల పాటు వార్తల్లో వుండడానికి స్టఫ్‌ దొరికేది. అటు వర్మకి ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా, ఇటు మీడియాకి కూడా దాని గురించి కవర్‌ చేయడానికి పెద్ద విషయమేం లేకుండా పవన్‌ సింపుల్‌గా తేల్చేసాడు. దీంతో వర్మ కూడా తాను పవన్‌కి అందరికంటే పెద్ద అభిమానినని చెప్పుకుని ఆ మేటర్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టడం తప్ప దానిని ముందుకి లాగలేకపోయాడు.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14197/Pawan-About-RGv-and-chiranjeevi-in-pressmeet#sthash.0QZbJHUm.dpuf

No comments:

Post a Comment