
సూర్యతో వంద కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమా ప్లాన్ చేస్తోన్న త్రివిక్రమ్ అది మొదలు పెట్టేలోగా ఆరు నెలల్లో ఒక సినిమా పూర్తి చేసేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. దీంట్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తాడని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో నాగార్జునతో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయిస్తున్నారనే పుకార్లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఊపిరి సినిమాలో కార్తీతో కలిసి నటించిన నాగార్జున ఇప్పటి యువతరంతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా వున్నట్టు టాక్ వుంది.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌తో చేయడానికి నాగ్ అంగీకరించారనే ప్రచారం మొదలైంది. కానీ అలాంటిదేం లేదని నాగార్జున తేల్చేసారు. తనని ఎవరూ సంప్రదించలేదని, అయినా ఇప్పుడు కొత్త సినిమాలు టేకప్ చేసే తీరిక లేదని ఆయన చెప్పారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో భక్తిరస చిత్రం చేయబోతున్న నాగార్జున దాని తర్వాత 'సోగ్గాడే చిన్ని నాయనా' సీక్వెల్ అయిన 'బంగార్రాజు' చేస్తారట. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే నాగ్ తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తారట. సో అల్లు అర్జున్, నాగార్జున కలిసి చేస్తున్నారనే పుకార్లకి ఇక ఫుల్‌స్టాప్ పెట్టేసుకోవచ్చు.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14198/Nagarjuna-clarifies-On-Multistarrer-rumors-with-allu-arjun#sthash.fYsOMcCs.dpufఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌తో చేయడానికి నాగ్ అంగీకరించారనే ప్రచారం మొదలైంది. కానీ అలాంటిదేం లేదని నాగార్జున తేల్చేసారు. తనని ఎవరూ సంప్రదించలేదని, అయినా ఇప్పుడు కొత్త సినిమాలు టేకప్ చేసే తీరిక లేదని ఆయన చెప్పారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో భక్తిరస చిత్రం చేయబోతున్న నాగార్జున దాని తర్వాత 'సోగ్గాడే చిన్ని నాయనా' సీక్వెల్ అయిన 'బంగార్రాజు' చేస్తారట. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే నాగ్ తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తారట. సో అల్లు అర్జున్, నాగార్జున కలిసి చేస్తున్నారనే పుకార్లకి ఇక ఫుల్‌స్టాప్ పెట్టేసుకోవచ్చు.
No comments:
Post a Comment