shorte links

Monday, March 21, 2016

నిర్మాతను ముంచేసిన ‘దృశ్యకావ్యం’

నిర్మాతను ముంచేసిన ‘దృశ్యకావ్యం’
చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీలోకి చాలా ప్యాషన్ తో వచ్చాం. మంచి సినిమా చేయాలనేది మా కోరిక. ఇండస్ట్రీలోకి రావడానికి పలానా వారే ఇన్ స్ఫిరేషన్ అని పాత రికార్డునే తిప్పి తిప్పి చెబుతుంటారు. అలాంటి కోవకు చెందిన నిర్మాత కమ్ దర్శకుడే బెల్లం రామకృష్ణారెడ్డి. ఇతని స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'దృశ్యకావ్యం' సినిమా ఈ నెల 18న విడుదలైంది. మాది నిజంగా దృశ్యకావ్యం అంటూ ఇందులో నటించిన యాక్టర్లు మొదలుకొని.. ఈ చిత్రానికి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన నిర్మాత కమ్ దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి వరకు అందరూ చెబుతూ వస్తున్నారు. 

అయితే.. వారి అంచనాలను చేరుకుందా ఈ సినిమా అంటే... కాదనే చెప్పొచ్చు. హారర్ బేస్డ్ స్టోరీలు వర్కవుట్ అవుతాయిలే అని ఎవరో ఇచ్చిన ఉచిత సలహాతో ఈనగారు 'దృశ్యకావ్యం' తీశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతినింది. దాంతో ఇప్పుడు కలెక్షన్లన్నీ నిల్. సినిమాకు పెట్టిన పెట్టుబడులు కాదు కదా... కనీసం థియేటర్లో షో ఆడేందుకు క్యూబ్ కోసం కట్టిన సొమ్ములు కూడా రికవరీ కాలేదట. దాంతో నిర్మాత లబోదిబో మంటున్నాడు. 

ఈ సినిమాకు బీభత్సమైన పబ్లిసిటీ కల్పిస్తామని ఈ చిత్ర పీఆర్వో మొదట నిర్మాతకు హామీ ఇచ్చాడు. అయితే నిర్మాత సామాజిక వర్గానికే చెందిన మరో వ్యక్తి పరిచయం కావడంతో.. అతని ద్వారా కొన్ని వెబ్ సైట్స్ కు యాడ్స్ రిలీజ్ చేశారు. అవేవైనా పేరొందిన సైట్లా అంటే... అదీ కాదు. ర్యాంకింగ్ లో ఎక్కడో వుండే వాటికి సదరు వ్యక్తి వెబ్ ప్రకటనలు ఇప్పించాడు. వీటితోపాటు.. తామే నెంబర్ వన్ అని డప్పుకొట్టుకుని మరో వెబ్ సైట్ కూ ఓ యాడ్ ఇచ్చాడు. ఇవేవీ దృశ్యకావ్యం సినిమాను థియేటర్లలో వుంచలేకపోయాయి. అలాగే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకోలేక పోయాయి. 

ఎన్నో ఆశలతో ఓ రెండు మూడు సినిమాలు చేసి.. మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్న రామకృష్ణారెడ్డకి ఈ సినిమా నిరాశే మిగిల్సింది. కథ, కథనం, సంగీతం పేలవంగా వుంటంతో ఈ సినిమాని చూడటం టైం వేస్ట్ అనుకున్నారో ఏమో... సినిమా చూస్తుండగానే మధ్యలో చాలా మంది వెళ్లిపోయారు. ఇలాంటి డిజాష్టర్ మూవీతో నిర్మాత మరో సినిమా తీయడానికి ఎలా ముందుకు రాగలడో కాలమే నిర్ణయించాలి.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14201/Huge-Losses-for-Drishya-Kavyam-Producers#sthash.e8Fu6EmQ.dpuf

No comments:

Post a Comment