సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. అదే టైంలో చిరంజీవి పవన్ గురించి ఏం మాట్లాడతాడో అని అంతా ఆత్రుతగా ఎదురుచూశారు. అందుకు తగ్గట్టుగానే చిరు ప్రసంగా సాగింది. తన తమ్ముడి గురించి.. ఇంతకుముందు ఎన్నడూ మాట్లాడని విధంగా అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే పవన్ కూడా తన అన్న గురించి మాట్లాడారు. ‘అన్నయ్య గురించి ఎంత మాట్లాడిన తక్కువే. అన్నయ్యపై నాకున్న ప్రేమను ఎన్నిసార్లని ప్రూవ్ చేసుకోగలను. ప్రతి సారి చెబుతున్నా. అన్నయ్య నా గుండెల్లో వున్నారు. తనపై వున్న ప్రేమను ఇంత అని చెప్పలేను’ అన్నారు.
అలాగే ‘సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి... ఈ రోజు ఓ స్టార్ గా అన్నయ్య ఎదగడానికి కారణం.. ఆయన పడిన కఠోరశ్రమే కారణం. నా లాంటి వాళ్లు ఇప్పుడు చాలా ఈజీగా స్టార్లైపోవచ్చు. దాని వెనుక అన్నయ్య పడిన శ్రమ ఎంతో వుంది. నేను హీరోగా ఎంటర్ అయినప్పుడు సినిమాలు చేయకపోయినా పర్వాలేదు... ఆయనకున్న పేరును మాత్రం చెడగొట్టరాదని అనుకున్నా. అన్నయ్య, వదిన నన్ను సినిమా హీరోగా వెళ్లాలని చెప్పినప్పుడు... పనిపాట లేకుండా తిరగుతున్న నాతో ఏదో ఓ పనిచేయించాలని వారు అలా చెప్పారనుకున్నా. కానీ... వారి నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయలేదు. ఎంతో కష్టపడి సినిమాలు చేస్తూ వస్తున్నా’ అన్నారు.
ఇంకా పవన్ మాట్లాడుతూ ‘అన్నయ్య పగలంతా కష్టపడి ఇంటికొచ్చి అలా షూస్ తో నిద్రపోయేవారు. నేను వాటిని తొలగించినప్పుడు సాక్సుల్లో నుంచి చెమట వాసన వచ్చేది. అది నాకు సువసనలానే అనిపించేది. ఎందుకుంటే.. కష్టంలో నుంచి వచ్చిన చెమట అయినా నాకు సువసనతో సమానమే. ఆ రోజుల్లో అన్నయ్య అంత కష్టపడాల్సిన పనిలేదు. కానీ.. ఆయన మా కోసం... ఇండస్ట్రీ బాగుకోసం ఎంతో కష్టపడ్డారు. అన్నయ్య సినిమా ఇండస్ట్రీని, అలాగే ఆయన నిజాయతీ ఎంతలా వుంటుంది అనేదినికి ఓ ఉదాహరణ చెబుతాను. ఓ రోజు సినీ వారపత్రిక రోడ్డుపై పడివుంటే.. దాన్ని అందరూ తొక్కేస్తూ అలా వెళ్లిపోతున్నారు. వెంటనే అన్నయ్య చూసి.. ఆ వారపత్రిక కవర్ పేజీపై వున్న ఫొటోను తుడిచి భద్రంగా ఎత్తిపెట్టారు. అప్పుడే నాకు అర్థమైంది. అన్నయ్యకు ఇండస్ట్రీ అంటే ఎంత ప్రేమో. ఆ కవర్ పేజీలో వున్నది ఇతర హీరో అయినా... అన్నయ్య ఎంతో డెడికేషన్ తో దాన్ని తొక్కకుండా భద్రపరిచారని’ తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ ‘నాకు అన్నయ్యతో రాజకీయ పరంగా విభేధాలుండొచ్చేమో కానీ.. అన్నయ్యగా మాత్రం నా గుండెల్లో వుంటాడు. దాన్ని నేను ప్రతి సారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు సినీ జీవితాన్నిచ్చిన అన్న, వదినలను మరువలేను’ అన్నారు.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14200/Pawan-kalyan-About-Chiranjeevi-Pawan-Sardaar-Audio-Launch#sthash.YQqNm0n8.dpufఅలాగే ‘సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి... ఈ రోజు ఓ స్టార్ గా అన్నయ్య ఎదగడానికి కారణం.. ఆయన పడిన కఠోరశ్రమే కారణం. నా లాంటి వాళ్లు ఇప్పుడు చాలా ఈజీగా స్టార్లైపోవచ్చు. దాని వెనుక అన్నయ్య పడిన శ్రమ ఎంతో వుంది. నేను హీరోగా ఎంటర్ అయినప్పుడు సినిమాలు చేయకపోయినా పర్వాలేదు... ఆయనకున్న పేరును మాత్రం చెడగొట్టరాదని అనుకున్నా. అన్నయ్య, వదిన నన్ను సినిమా హీరోగా వెళ్లాలని చెప్పినప్పుడు... పనిపాట లేకుండా తిరగుతున్న నాతో ఏదో ఓ పనిచేయించాలని వారు అలా చెప్పారనుకున్నా. కానీ... వారి నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయలేదు. ఎంతో కష్టపడి సినిమాలు చేస్తూ వస్తున్నా’ అన్నారు.
ఇంకా పవన్ మాట్లాడుతూ ‘అన్నయ్య పగలంతా కష్టపడి ఇంటికొచ్చి అలా షూస్ తో నిద్రపోయేవారు. నేను వాటిని తొలగించినప్పుడు సాక్సుల్లో నుంచి చెమట వాసన వచ్చేది. అది నాకు సువసనలానే అనిపించేది. ఎందుకుంటే.. కష్టంలో నుంచి వచ్చిన చెమట అయినా నాకు సువసనతో సమానమే. ఆ రోజుల్లో అన్నయ్య అంత కష్టపడాల్సిన పనిలేదు. కానీ.. ఆయన మా కోసం... ఇండస్ట్రీ బాగుకోసం ఎంతో కష్టపడ్డారు. అన్నయ్య సినిమా ఇండస్ట్రీని, అలాగే ఆయన నిజాయతీ ఎంతలా వుంటుంది అనేదినికి ఓ ఉదాహరణ చెబుతాను. ఓ రోజు సినీ వారపత్రిక రోడ్డుపై పడివుంటే.. దాన్ని అందరూ తొక్కేస్తూ అలా వెళ్లిపోతున్నారు. వెంటనే అన్నయ్య చూసి.. ఆ వారపత్రిక కవర్ పేజీపై వున్న ఫొటోను తుడిచి భద్రంగా ఎత్తిపెట్టారు. అప్పుడే నాకు అర్థమైంది. అన్నయ్యకు ఇండస్ట్రీ అంటే ఎంత ప్రేమో. ఆ కవర్ పేజీలో వున్నది ఇతర హీరో అయినా... అన్నయ్య ఎంతో డెడికేషన్ తో దాన్ని తొక్కకుండా భద్రపరిచారని’ తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ ‘నాకు అన్నయ్యతో రాజకీయ పరంగా విభేధాలుండొచ్చేమో కానీ.. అన్నయ్యగా మాత్రం నా గుండెల్లో వుంటాడు. దాన్ని నేను ప్రతి సారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు సినీ జీవితాన్నిచ్చిన అన్న, వదినలను మరువలేను’ అన్నారు.
No comments:
Post a Comment