మా అన్నయ్య మీద నాకెంతో ప్రేముందు ఎవ్వరికీ రుజువు చేయాల్సిన పని లేదంటూనే చిరు మీద తన ప్రేమను బాగానే చాటుకున్నాడు పవన్ కళ్యాణ్. అన్నయ్య సాక్సుల్లోంచి వచ్చే చెమట కూడా తనకు సువాసనే అంటూ గొప్ప మాట చెప్పి.. నాకు హీరో అంటే ఆయనే.. చిరునే నా దైవం అంటూ 'సర్దార్ గబ్బర్ సింగ్" ఆడియో వేడుకలో అన్నయ్యను ఓ రేంజిలో పొగిడేశాడు పవన్.
ఈ సందర్భంగా చిరంజీవి సంస్కారం గురించి చెబుతూ ఉదహరించిన ఓ సంఘటన అందరిలోనూ ఆసక్తి రేపింది. చాలా ఏళ్ల కిందట చిరంజీవి ఇంట్లో ఓ సినిమా మ్యాగజైన్ కింద పడి ఉందట. దాని ముఖచిత్రం మీద ఎవరో వేరే హీరో ఫొటో వేశారట. ఆ మ్యాగజైన్ అలా కింద పడి ఉన్నా.. ఎవ్వరూ పట్టించుకోకుండా అలా తిరిగేస్తున్నారట. ఐతే అప్పుడే అక్కడికి వచ్చిన చిరు ఆ మ్యాగజైన్ ను అలా చూసి కోప్పడిపోయాడట.
మన సినీ పరిశ్రమకు సంబంధించిన మ్యాగజైన్ ఇలా పడి ఉంటే పట్టించుకోరా.. మన తోటి హీరో ఫొటోను అలా తొక్కుకుంటూ వెళ్లిపోతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడట చిరు. ఆ మ్యాగజైన్ తీసి.. దాన్ని తుడిచి టేబుల్ మీద పెట్టాడట చిరు. తన అన్నయ్యది అంత గొప్ప సంస్కారం అని.. సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ బాగుండాలని మనసా వాచా కర్మణా తన అన్నయ్య కోరుకుంటాడని.. అలాంటి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి కుటుంబం నుంచి తామంతా వచ్చామని.. ఆయన దారిలోనే నడుస్తున్నామని చెప్పాడు పవన్.

No comments:
Post a Comment