
మోహన్ లాల్.. మళయాల సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా సూపర్ స్టార్‌గా వెలుగొందుతోన్న నటుడు. తెలుగులో కూడా గతంలో ‘గాంఢీవం’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో మెప్పించిన ఆయన, మణిరత్నం రూపొందించిన ‘ఇద్దరు’ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు మరింత దగ్గరయారు. ఇక ఈ మధ్యే తమిళ సినిమా ‘జిల్లా’ తెలుగు డబ్బింగ్ ద్వారా మళ్ళీ మెప్పించిన మోహన్ లాల్, ప్రస్తుతం తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న ‘జనతా గ్యారెజ్’ ఒకటి కాగా, మరొకటి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మనమంతా’.
ఇక ‘జనతా గ్యారెజ్’ సినిమాకు మోహన్ లాల్ అందుకున్న రెమ్యునరేషన్ విషయంలో ఓ ఆసక్తికర విషయం తెలిసింది. మాకు అందిన సమాచారం మేరకు తమ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించేందుకు ‘జనతా గ్యారెజ్’ నిర్మాతలు మోహన్ లాల్‌కు 1.5కోట్ల రూపాయలతో పాటు మళయాల హక్కులను ఆఫర్ చేశారట. మళయాల హక్కులు కోటి రూపాయలు పలుకుతాయని నిర్మాతలు భావించగా, ఏకంగా 4 కోట్ల రూపాయలు పలికి మోహన్ లాల్‌కు జాక్‌పాట్ తెచ్చాయట. దీంతో మోహన్ లాల్, ‘జనతా గ్యారెజ్’తో ఈ స్థాయి జాక్‌పాట్ కొట్టడం ఆసక్తికరంగా మారిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర సినిమాకు ఓ హైలైట్‌గా నిలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది.
No comments:
Post a Comment