shorte links

Monday, March 21, 2016

ఆ ఒక్క తమిళ సినిమానే దిక్కు

ఆ ఒక్క తమిళ సినిమానే దిక్కు

March 19th, 2016, 09:20 AM IST
ఆ ఒక్క తమిళ సినిమానే దిక్కు
తెలుగు సినిమా ఈ వారం ఎదుర్కొంటున్నంత గడ్డు పరిస్థితి గత కొన్నేళ్లలో ఎప్పుడూ ఎదుర్కొని ఉండదేమో. ఏదైనా భారీ సినిమా బాగా ఆడుతుంటే.. కొత్త సినిమాలేవీ విడుదల కాకుండా ఖాళీగా వదిలేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. సంక్రాంతి తర్వాతి వారం ఇలాగే ఏ సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఐతే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఆల్రెడీ థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలున్నాయి కానీ వాటికీ కలెక్షన్లు లేవు. కొత్తవేమైనా సత్తా చూపిస్తాయేమో అనుకుంటే.. ఈ శుక్రవారం ఓ మోస్తరు సినిమా కూడా ఏదీ రాలేదు.

ఉన్నంతలో తమిళ డబ్బింగ్ మూవీ ‘కథకళి’ మేలు. శుక్రవారం విడుదలైన నాలుగైదు సినిమాల్లో ఇదొక్కటే ఓ మోస్తరుగా జనాల్ని థియేటర్లకు రప్పిస్తోంది. దీనికి టాక్ కూడా పర్వాలేదు. థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడేవారిని విశాల్ మూవీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ వారం విడుదలైన తెలుగు సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

‘దృశ్యకావ్యం’ అంటూ మంచి పబ్లిసిటీ చేసి ఓ సినిమా వదిలారు. దానికంత ‘దృశ్యం’ లేదని తేలిపోయింది. ఈ సినిమాకు థియేటర్లు బాగానే ఇచ్చారు కానీ.. జనాలకు పెద్దగా ఆనట్లేదు. ఇక శివాజీ నటించిన ‘సీసా’ గురించి మాట్లాడేవాళ్లే లేరు. రొమాన్స్ విత్ ఫైనాన్స్ అంటూ ఇంకో సినిమా వచ్చింది దాని పరిస్థితి ఇంతే. ఐతే వచ్చే బుధవారం నుంచి బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడే అవకాశముంది. ఆ రోజు సందీప్ కిషన్ సినిమా ‘రన్’ వస్తుంది. ఇంకో రెండు రోజులకే ‘ఊపిరి’ థియేటర్లలోకి దిగుతుంది. కాబట్టి తెలుగు సినిమా స్లంప్ ఇంకో నాలుగు రోజులే అన్నమాట.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14175/VIshal-Kathakali-is-the-only-movie-to-watch-this-week#sthash.pnvk5Yn0.dpuf

No comments:

Post a Comment