shorte links

Monday, March 21, 2016

పవన్‌కళ్యాణ్‌ని ప్రశ్నించడానికి భయపడ్డారా?

పవన్‌కళ్యాణ్‌ని ప్రశ్నించడానికి భయపడ్డారా?
పవన్‌కళ్యాణ్‌ చాలా కాలం తర్వాత సినిమా మీడియాని కలిసాడు. ఈమధ్య కాలంలో పొలిటికల్‌ ప్రెస్‌మీట్లు మాత్రమే పెడుతోన్న పవన్‌కళ్యాణ్‌ సినిమా మీడియాతో ముచ్చటించాడు. అయితే ప్రెస్‌మీట్‌కి సరిగ్గా రెండు గంటల ముందు న్యూస్‌ రావడంతో ఆయనని ఏమి అడగాలనే దానిపై ఎవరూ ప్రిపేర్‌ అయి వెళ్లినట్టు లేరు. ఇది సినిమా ప్రెస్‌మీట్‌ అంటూ ఇక్కడ సినిమాల గురించి మాత్రమే మాట్లాడతానని చెప్పిన పవన్‌కళ్యాణ్‌ని పదే పదే రాజకీయాలకి సంబంధించిన ప్రశ్నలే వేసారు. ఇదిలావుంటే ఈ ప్రెస్‌మీట్‌ పెట్టడానికి సరిగ్గా మూడు రోజుల ముందు నుంచీ సెట్లో కమెడియన్‌ షకలక శంకర్‌పై పవన్‌ చేయి చేసుకున్నాడనే వదంతులు వినిపిస్తున్నాయి. 

దీనిని చాలా వెబ్‌సైట్లు కవర్‌ చేసాయి. అయితే ఏ ఒక్కరూ కూడా అది నిజమా కాదా అని పవన్‌కళ్యాణ్‌ అడిగే ధైర్యం మాత్రం చేయలేకపోయారు. చాలా కాలం తర్వాత తమ ముందుకి వచ్చిన పవన్‌ని కాంట్రవర్షియల్‌ క్వశ్చన్స్‌తో చిరాకు పెడితే ఎక్కడ లేచి వెళ్లిపోతాడో లేక మళ్లీ ప్రెస్‌మీట్‌ పెట్టడో అనుకున్నారో కానీ ఒక హాట్‌ టాపిక్‌ గురించి డిస్కషన్‌ రాకుండానే పవన్‌ ప్రెస్‌మీట్‌ ముగిసింది. సినిమా జర్నలిస్టులంటే జంకారని అనుకోవచ్చు. అక్కడ పొలిటికల్‌ జర్నలిస్టులున్నా కానీ ఇలాంటివి అడిగేందుకు ఎవరూ సాహసించకపోవడం విశేషమే.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14199/Media-Afraid-Of-Pawan-to-ask-about-Shakalaka-Shankar#sthash.VHFJ9sxn.dpuf

No comments:

Post a Comment