
హిట్ కొట్టాలంటే ఏదో ఒకటి చేయాలి.. ఎందుకంటే ఇండస్ట్రీలో విజయం లేకపోతే విలువ ఉండదు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పర్లేదు ఒక్కసారి ఫ్లాపుల్లో పడితే ఉండే తలనొప్పులే వేరు. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా.. లోపల మాత్రం చాలా తేడాలు వచ్చేస్తాయి. తనకు అలాంటి పరిస్థితులు రాకూడదని ఇప్పట్నుంచే జాగ్రత్త పడుతున్నాడు సునీల్. ఈయన హిట్ అనే మాట విని నాలుగేళ్లు దాటిపోయింది. అప్పుడెప్పుడో వచ్చిన పూలరంగడు తర్వాత సునీల్ కు మరో విజయం రాలేదు.
మిస్టర్ పెళ్లికొడుకు, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి.. ఇలా వచ్చిన సినిమాలన్నీ వచ్చినట్లే చాప చుట్టేసాయి. ప్రస్తుతం వీరుపోట్లతో ఈడు గోల్డ్ ఎహే, వంశీ కృష్ణ ఆకెళ్లతో ఓ సినిమా చేస్తున్నాడు సునీల్. వంశీ సినిమాకు జక్కన్న అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు దర్శకనిర్మాతలు. జక్కన్న అంటే ఇండస్ట్రీలో వెంటనే గుర్తొచ్చేది రాజమౌళి. తన సినిమాను ఓ శిల్పంలా చెక్కుతాడని ఎన్టీఆర్ అతడికి ఈ ముద్దుపేరు పెట్టాడు. తర్వాత ఇదే పాపులర్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఇదే టైటిల్ ను సునీల్ తన సినిమా కోసం టైటిల్ గా వాడుకున్నాడు. జక్కన్న ఎంటర్ టైన్ మెంట్ తో పాటు... యాక్షన్ ప్యాక్డ్ గా తెరకెక్కుతోంది. మరి చూడాలి.. కనీసం రాజమౌళి ముద్దుపేరైనా సునీల్ కు విజయం తీసుకొస్తుందో లేదో..?
- See more at: http://telugu.gulte.com/tmovienews/14183/Sunil-uses-Rajamouli-Nick-name-for-his-next#sthash.4NlTsf4G.dpufమిస్టర్ పెళ్లికొడుకు, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి.. ఇలా వచ్చిన సినిమాలన్నీ వచ్చినట్లే చాప చుట్టేసాయి. ప్రస్తుతం వీరుపోట్లతో ఈడు గోల్డ్ ఎహే, వంశీ కృష్ణ ఆకెళ్లతో ఓ సినిమా చేస్తున్నాడు సునీల్. వంశీ సినిమాకు జక్కన్న అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు దర్శకనిర్మాతలు. జక్కన్న అంటే ఇండస్ట్రీలో వెంటనే గుర్తొచ్చేది రాజమౌళి. తన సినిమాను ఓ శిల్పంలా చెక్కుతాడని ఎన్టీఆర్ అతడికి ఈ ముద్దుపేరు పెట్టాడు. తర్వాత ఇదే పాపులర్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఇదే టైటిల్ ను సునీల్ తన సినిమా కోసం టైటిల్ గా వాడుకున్నాడు. జక్కన్న ఎంటర్ టైన్ మెంట్ తో పాటు... యాక్షన్ ప్యాక్డ్ గా తెరకెక్కుతోంది. మరి చూడాలి.. కనీసం రాజమౌళి ముద్దుపేరైనా సునీల్ కు విజయం తీసుకొస్తుందో లేదో..?
No comments:
Post a Comment