
మంచి అంచనాలున్న.. ఆసక్తి రేపిన సినిమా విడుదలకు నోచుకోకుండా అలా ల్యాబుల్లో మగ్గుతుంటే బాధేస్తుంది. రామ్ గోపాల్ వర్మ మూవీ 'అటాక్' ఆ కోవలోకే చెందుతుంది. 'రక్తచరిత్ర' తర్వాత ఫ్యాక్షనిజం బ్యాగ్రౌండ్లో వర్మ మళ్లీ ఓ సినిమా తీస్తున్నాడు అనంగానే ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. దీనికి తోడు మంచు మనోజ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు లాంటి విలక్షణ నటుల కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కించడంతో ఆసక్తి రెట్టింపైంది. దాదాపు ఏడాది కిందటే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా వేశారు. ట్రైలర్ రిలీజ్ చేసి కూడా చాలా నెలలైంది. కానీ సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఈ సినిమాను అందరూ మరిచిపోయిన టైంలో ఉన్నట్లుండి రిలీజ్ డేట్ ప్రకటించేశారు. ఇంకో పది రోజుల్లోనే.. అంటే ఏప్రిల్ 1న 'అటాక్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజే నిర్మాత సి.కళ్యాణ్ ఉన్నట్లుండి రిలీజ్ డేట్ ప్రకటించాడు. మనోజ్ సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జగపతి బాబు కూడా అంతే కొత్తగా దర్శనమిస్తున్నారు. 'గాయం' తర్వాత జగపతి బాబు వర్మ దర్శకత్వంలో నటించింది ఈ సినిమాలోనే. మనోజ్, ప్రకాష్ రాజ్ తొలిసారి ఆయన సినిమాలో చేశారు. సురభి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో 'రక్త చరిత్ర' ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ పాత్ర పోషించాడు. వడ్డే నవీన్ సైతం విలన్ గా నటించడం విశేషం.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14211/Manoj-Attack-Going-to-release-on-April-1st#sthash.OU8qM29R.dpufఇక ఈ సినిమాను అందరూ మరిచిపోయిన టైంలో ఉన్నట్లుండి రిలీజ్ డేట్ ప్రకటించేశారు. ఇంకో పది రోజుల్లోనే.. అంటే ఏప్రిల్ 1న 'అటాక్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజే నిర్మాత సి.కళ్యాణ్ ఉన్నట్లుండి రిలీజ్ డేట్ ప్రకటించాడు. మనోజ్ సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జగపతి బాబు కూడా అంతే కొత్తగా దర్శనమిస్తున్నారు. 'గాయం' తర్వాత జగపతి బాబు వర్మ దర్శకత్వంలో నటించింది ఈ సినిమాలోనే. మనోజ్, ప్రకాష్ రాజ్ తొలిసారి ఆయన సినిమాలో చేశారు. సురభి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో 'రక్త చరిత్ర' ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ పాత్ర పోషించాడు. వడ్డే నవీన్ సైతం విలన్ గా నటించడం విశేషం.
No comments:
Post a Comment