shorte links

Monday, March 21, 2016

బాబాయ్ నా ఇన్స్పిరేషన్ అంటున్న చరణ్!

బాబాయ్ నా ఇన్స్పిరేషన్ అంటున్న చరణ్!
తన కెరీర్ కు బాబాయ్ పవన్ కళ్యాన్ ఇన్స్పిరేషన్ అంటున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. రీసెంట్ గా చెర్రీ హైదరాబాద్ లోని ఓ కళాశాలలో ఫంక్షన్ కు అతిథిగా వెళ్ళాడు. అక్కడ స్టూడెంట్ ను ఇన్స్పైర్ చేసేలా.. ప్రేమ గురించి పెళ్లి గురించి, చదువు గురించి మాట్లాడాడు. ప్రేమించడం తప్పు కాదని అయితే ముందు కెరీర్ బిల్డ్ చేసుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండని స్టూడెంట్స్ కు చెప్పాడు. నేను ఉపాసన ప్రేమించుకున్నప్పుడు స్టేటస్ లు చూసి ప్రేమించుకోలేదని.. స్టేటస్ లు చూసి ఎప్పుడూ ప్రేమించకూడదని చెప్పడంతో పాటు.. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, లవ్, కెరీర్ విషయంలో కేర్ తీసుకోమని స్టూడెంట్స్ కు సలహా ఇచ్చాడు.

అంతేకాకుండా తన జీవితానికి పవన్ కళ్యాన్ ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పాడు. ఇరవైయేళ్ళ వయసులో చరణ్ అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడట. ఆ సమయంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పిలిచి గంటసేపు మాట్లాడరంట. అప్పుడే తనకు జీవితమంటే ఏంటో అర్ధమయిందని చరణ్ చెప్పాడు. అమ్మా నాన్న నా జీవితానికి ఎంత ఆదర్శమో… నా కెరీర్ కు బాబాయ్ ఇనిస్పిరేషన్ కూడా అంతే ఉందని చెర్రీ చెప్పుకొచ్చాడు. 
- See more at: http://telugu.gulte.com/tmovienews/14193/Ramcharan-about-Relation-with-Pawan#sthash.3mi3NaE2.dpuf

No comments:

Post a Comment