shorte links

Monday, March 21, 2016

అమీర్ ఆశపడ్డాడు.. షారుఖ్ చేసేస్తున్నాడు

అమీర్ ఆశపడ్డాడు.. షారుఖ్ చేసేస్తున్నాడు
సన్నీ లియోన్ ఓ పోర్న్ స్టార్.. కానీ అది గతం. ఇప్పుడామె మాంచి డిమాండ్ ఉన్న బాలీవుడ్ నటి. హీరోయిన్‌గా చేయించుకుంటే హీరోయిన్‌గా చేయించుకోవచ్చు.. లేదంటే గెస్ట్ రోల్ చేయడానికైనా రెడీ.. అవసరమైతే ఐటెం సాంగ్‌లో ఆడి పాడ్డానికైనా సిద్ధం. ఆమె క్రేజ్‌ను వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఓ పెద్ద జర్నలిస్టు.. మీ లాంటి పోర్న్ స్టార్‌తో కలిసి నటించడానికి అమీర్ ఖాన్ ఒప్పుకుంటాడా అంటూ సన్నీని అవమానించేలా ప్రశ్నించాడు. దానికి ఆమె ఏం సమాధానం ఇచ్చిందన్నది పక్కనబెడితే.. సన్నీతో నటించడానికి తనకే అభ్యంతరం లేదని.. ఫ్యూచర్లో ఆమెతో కలిసి నటిస్తానని ప్రకటించాడు అమీర్. ఐతే అమీర్‌తో ప్రతి విషయంలోనూ పోటీ పడే షారుఖ్ ఖాన్.. తన శత్రువు కంటే ముందు సన్నీతో కలిసి తెర పంచుకునే అవకాశాన్ని కొట్టేయాలనుకున్నట్లున్నాడు. తన కొత్త సినిమా ‘రాయీస్’లో సన్నీతో కలిసి స్టెప్పులేయడానికి రెడీ అయిపోతున్నాడు షారుఖ్. ఈ సినిమాలో సన్నీ ఐటెం సాంగ్ చేయబోతుండటం.. అది కూడా ఓ ఫేమస్ హిందీ పాటకు రీమిక్స్ కావడం విశేషం.

బాలీవుడ్ క్లాసిక్ సాంగ్స్‌లో ఒకటైన ‘లైలా ఓ లైలా’ పాటకు నృత్యం చేయబోతోంది సన్నీ లియోన్. ‘ఖుర్బాని’లోని ఈ పాట ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఓ మైల్ స్టోన్. అలాంటి పాటను ‘రాయీస్’ కోసం రీమిక్స్ చేస్తున్నారు. ఇదే విశేషమంటే ఆ పాటలో సన్నీ, షారుఖ్ కలిసి డ్యాన్స్ చేయబోతుండటం ఇంకా పెద్ద విశేషం. ఈ పాటను సన్నీతో చేయిద్దామని స్వయంగా షారుఖ్ ఖానే చెప్పాడట. రాహుల్ డోలాఖియా దర్శకత్వం వహిస్తున్న ‘రాయీస్’లో షారుఖ్ అండర్ వరల్డ్ డాన్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఆ మధ్య రిలీజైన ‘రాయీస్’ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ఏడాది రంజాన్ రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాని కంటే ముందు ఏప్రిల్ 15న ‘ఫ్యాన్’ సినిమాతో పలకరించబోతున్నాడు కింగ్ ఖాన్.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14185/Sunny-Leone-in-Shah-Rukh-Khans-Raees#sthash.jgIdiL9H.dpuf

No comments:

Post a Comment