shorte links

Monday, March 21, 2016

'సర్దార్‌' మూడు నిమిషాల్లో మోత మోగిపోద్ది

'సర్దార్‌' మూడు నిమిషాల్లో మోత మోగిపోద్ది
నలభై సెకన్ల టీజర్‌తోనే అభిమానుల్ని ఉర్రూతలూగించిన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఇక థియేట్రికల్‌ ట్రెయిలర్‌తో ఫాన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ పీక్స్‌కి తీసుకెళ్లిపోబోతున్నాడు. 171 సెకన్ల నిడివి వుండే థియేట్రికల్‌ ట్రెయిలర్‌ చూసిన వారు ఉత్సాహం ఆపుకోలేకపోతున్నారు. ఇంతవరకు పవన్‌ సినిమాల ట్రెయిలర్లన్నీ ఒకెత్తు, ఇదొక్కటీ ఒక రేంజు అంటూ సన్నిహిత వర్గాలు ఊగిపోతున్నాయి. డైలాగుల నుంచి యాక్షన్‌ వరకు, కామెడీ నుంచి డాన్స్‌ మూమెంట్స్‌ వరకు ఏదీ మిస్‌ అవకుండా ట్రెయిలర్‌లోనే సినిమా చూపించేయబోతున్నాడట దర్శకుడు బాబీ. ఈ ఒక్క ట్రెయిలర్‌ ఓకే చేయడానికి దాదాపు యాభై కట్స్‌ రెడీ చేసి చూపించాడట ఎడిటర్‌.

ట్రెయిలర్‌తో సినిమాపై వున్న అంచనాలు అమాంతం వందింతలు పెరిగిపోవాలనేది టార్గెట్‌గా పెట్టుకుని మరీ ఈ ట్రెయిలర్‌ కట్‌ చేయించారట. ట్రెయిలర్‌ ఫైనల్‌ ఎడిట్‌ చూసిన పవన్‌కళ్యాణ్‌ కూడా చాలా ఇంప్రెస్‌ అయి బాబీని, ఎడిటర్‌ని ప్రశంసించాడట. సినిమా ఎలా వుండబోతుందో మూడు నిమిషాల్లో చూపించేసారంటూ ఇద్దరికీ కితాబులు ఇచ్చారట. ఆ ట్రెయిలర్‌ ఏంటనేది మనం చూడాలంటే మాత్రం మరి కొన్ని గంటలు వేచి చూడక తప్పదు. ఈలోగా ఆ ట్రెయిలర్‌ చూసిన వారు చేసే హైప్‌ చూసి అంచనాలు పెంచుకోవాల్సిందే.
- See more at: http://telugu.gulte.com/tmovienews/14196/Sardaar-Gabbar-singh-Trailer-length-in-3-mins#sthash.EmRC7yvS.dpuf

No comments:

Post a Comment